A place where you need to follow for what happening in world cup

HOT NEWS

బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ వ్యాఖ్యలపై మండిపడ్డ స్మృతి ఇరానీ

0

న్యూఢిల్లీ ఫిబ్రవరి 17:అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్  చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కొన్ని విదేశీ శక్తులు మన ప్రజాస్వామ్యాన్ని టార్గెట్ చేసుకుని బలహీన పరచేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జార్జి సోరోస్ తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలనుకోవడం ఆయన ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తోందని ఆన్నారు.

ప్రధాని మోదీ వంటి వారిని టార్గెట్‌గా చేసుకునేందుకే ఆయన బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించినట్టు మంత్రి విమర్శించారు.ఇండియాలో ప్రతి ఐదేళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నామని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. దేశ ప్రజాస్వామ్యం ఎప్పటికీ చెక్కుచెదరదని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచేందుకు ఎవరెన్ని దుష్ట పన్నాగాలు పన్నినా ప్రధాని మోదీ నాయకత్వంలో బలంగా ఎదుర్కుంటామని అన్నారు.

జార్జి సోరోస్ తన శక్తియుక్తులను ఇండియాకు కాకుండా తన దేశానికి లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తుంటారని, అదానీ గ్రూప్ అంశంపై ఆయన ఆలోచనా ప్రక్రియ, ప్రకటనలను భారతీయులంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.”ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంపై ప్రధాని మోదీని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో పాటు, ఇంగ్లాడ్ ప్రధాని బహిరంగంగా ప్రశంసించారు. ఇలాంటి తరుణంలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారు వ్యాఖ్యలు వెలుగుచూశాయి” అని స్మృతి ఇరానీ అన్నారు. జార్జి సోరోస్ ఎవరికి నిధులు ఇస్తున్నారనే విషయం మీడియా వ్యక్తులందరికీ బాగా తెలుసునని, ఆయన మోదీని లక్ష్యంగా చేసుకున్నారని, భవిష్యత్తులో కూడా ఆయన టార్గెట్ అదే విధంగా ఉండబోతోందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.