Chitti Dosha | చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు | Eeroju news

Chitti Dosha

చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు అనంతపురం, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) Chitti Dosha సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు జీతాలు లక్షల్లో ఉంటాయి. అందుకే నేటి యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎగబడుతుంటారు. అయితే రోడ్డు పక్కన దోసెలు అమ్ముకునే ఓ మహిళ టెక్కీలే ఆశ్చర్యపోయేలా సంపాదిస్తుంది. రోజుకు రూ.10 వేలు వ్యాపారం చేస్తామని నర్సమ్మ అంటున్నారు. ఇందులో గొప్పేంటి అనుకుంటున్నారా? రోడ్డు పక్కన చిన్న షెడ్డులో మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కాకా హోటల్ నడుపుతూ.. రోజుకు రూ.10 వేల వ్యాపారం చేస్తున్నారంటే…గొప్పే కదా అంటున్నారు స్థానికులు. ఒకరిపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే వారికి నర్సమ్మ ఆదర్శమే అంటున్నారు. సత్యసాయి జిల్లాలోని కదిరికి సమీపంలోని కూటగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున నెలకు దాదాపు రూ. 3…

Read More

School Management Committee Election Schedule | స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ | Eeroju news

స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌

స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ ఒంగోలు, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) School Management Committee Election Schedule ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. పాఠ‌శాలల్లో ఉన్న పేరెంట్స్ క‌మిటీల‌ స్థానంలో స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీలను నియమించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక ఆగ‌స్టు 8న నిర్వహించ‌నున్నారు. ఈ మేరకు రాష్ట్ర స‌మ‌గ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాస‌రావు షెడ్యూల్ విడుద‌ల చేశారు. 2021 సెప్టెంబ‌ర్ 22న ఏర్పాటు చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీల‌ను 2023 సెప్టెంబ‌ర్ 21తో రెండేళ్ల ప‌ద‌వీకాలం పూర్తి చేసుకున్నాయి. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే వరకు కొనసాగించారు. ఆగ‌స్టు 8న ఈ క‌మిటీలకు ఎన్నిక‌లు నిర్వహించాలని అన్ని జిల్లాల డీఈఓలు, అడిష‌న‌ల్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్స్‌కు రాష్ట్ర స‌మ‌గ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాస‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.…

Read More

Arogyasree | ఏపీలో ఆరోగ్యశ్రీ పంచాయితీ | Eeroju news

Arogyasree

ఏపీలో ఆరోగ్యశ్రీ పంచాయితీ విజయవాడ, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) Arogyasree ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసేస్తారని వైసీపీతో పాటు కాంగ్రెస్ కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలే. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగించుకోవాలని ఆయన గుంటూరులో పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ తీసేసి ఆయుష్మాన్ భారత్ ను పెడుతున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా షర్మిల కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయని.. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని పెమ్మసాని అంటున్నారని అంటే  ఇక ఆరోగ్యశ్రీ లేనట్టేనా అని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు.  కేవలం ఆయుష్మాన్ భారత్ పథకాన్నే అమలు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.…

Read More

YCP is empty in the kuppam | కుప్పంలో వైసీపీ ఖాళీ | Eeroju news

YCP is empty in the kuppam

కుప్పంలో వైసీపీ ఖాళీ తిరుపతి,  ఆగస్టు 1  (న్యూస్ పల్స్) YCP is empty in the kuppam ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కీలక నియోజకవర్గాల్లో ఇంచార్జులు పత్తా లేకండా పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఐదేళ్ల పాటు హవా చెలాయించి గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన  భరత్ పార్టీని పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆయన కుప్పం రాలేదు. జగన్ తో పాటు ఢిల్లీ ధర్నాకు వెళ్లారు కానీ.. కుప్పంకు మాత్రం రావడం లేదు. హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. వైసీపీ హయాంలో కుప్పంలో జరిగిన అనేక అరాచకాలకు భరతే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుపై రాళ్ల దాడితో  పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులు సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం…

Read More

CM Chandrababu | ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు | Eeroju news

CM Chandrababu

 ఏపీలో 5 కొత్త పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు విజయవాడ, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) CM Chandrababu రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా…తరువాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని…కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.…

Read More

Seniors in Janasena are unhappy | జనసేనలో సీనియర్లు అసంతృప్తి | Eeroju news

Seniors in Janasena are unhappy

జనసేనలో సీనియర్లు అసంతృప్తి విశాఖపట్టణం, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) Seniors in Janasena are unhappy ఉత్తరాంధ్రలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో ఉన్నా లేనట్లేనా? ఆయన ఎందుకు యాక్టివ్ గా లేరు. అదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మచ్చలేని నేతగా గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమై ఆ ప్రాంత సమస్యలనే ఎక్కువగా పట్టించుకుంటారు. నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆయన గెలిచింది మాత్రం మూడు సార్లు మాత్రమే. 1989, 1991 లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతే…

Read More

Pawan Kalyan key announcement | పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన | Eeroju news

Pawan Kalyan key announcement

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విజయవాడ,, జూలై 31 Pawan Kalyan key announcement   ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధి హామీ కూలీలకు శుభవార్త తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటయించినట్లు పవన్‌ పవన్‌ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది.ఇదిలా ఉంటే ఇప్పటికే కేటాయించిన 15 కోట్ల పనిదినాలు జూన్‌ నెలాఖరుకే పూర్తయ్యాయి. అయితే అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలో నిర్వహించిన సమావేశంలో మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ కళ్యాణ్‌ తెలిపారు. దీంతో…

Read More

Consider the use of volunteers CM Chandrababu | వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి Eeroju news

Consider the use of volunteers CM Chandrababu..

వాలంటీర్ల వినియోగంపై ఆలోచించాలి సీఎం చంద్రబాబు.. అమరావతి, Consider the use of volunteers CM Chandrababu సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి, పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రామ వార్డు, సచివాలయఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా  వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను, ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న  దానిపై ప్రణాళికలు రచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు సూచించారు.   Confused volunteers… | అయోమయంలో వలంటీర్లు… | Eeroju news

Read More

Dokka Seethamma in google search… | గూగుల్ సెర్చ్ లో డొక్కా సీతమ్మ… | Eeroju news

Dokka Seethamma in google search...

గూగుల్ సెర్చ్ లో డొక్కా సీతమ్మ… కాకినాడ, జూలై 31, (న్యూస్ పల్స్) Dokka Seethamma in google search… డొక్కా సీతమ్మ.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది.దీంతో డొక్కా సీతమ్మ గురించి బలమైన చర్చ ప్రారంభమైంది.ఆమె ఎవరు? స్వాతంత్ర సమరయోధురాలా? దేశ నాయకురాలా? అంటూ అందరిలో అనుమానం ప్రారంభమైంది. ఆమె గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొక్కా సీతమ్మ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమె పేరిట క్యాంటీన్లను తెరుస్తామని ప్రకటించారు. అయినా సరే డొక్కా సీతమ్మ గురించి ఎక్కువమందికి తెలియదు. తాజాగా ప్రభుత్వం ఆమె పేరును గౌరవిస్తూ పథకానికి పెట్టిన వేళ.. ఆమె గురించి…

Read More

Liquor with fake Hologram stickers | నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం | Eeroju news

Liquor with fake Hologram stickers

నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం నెల్లూరు, జూలై 31 (న్యూస్ పల్స్) Liquor with fake Hologram stickers వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం మద్యం అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యం విక్రయాల్లో రూ.18 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని స్వయంగా సీఎం తెలిపారు. మద్యం విక్రయాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తామన్నారు. అయితే ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం అక్రమంగా సరఫరా చేసినట్లు అభియోగాలు వస్తున్నాయి. మద్యం డిపోల నుంచి కాకుండా నేరుగా ఉత్పత్తి కంపెనీల నుంచే షాపులకు మద్యం…

Read More