వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ | Private security at YS Jagan’s residence | Eeroju news

వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గుంటూరు, జూన్ 18, (న్యూస్ పల్స్) Private security at YS Jagan’s residence ఏపీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నివాసం వద్ద పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 1.5 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని…

Read More

అతిగా వ్యవహరించి… చివరకు…. | Overdo it… and finally… | Eeroju news

అతిగా వ్యవహరించి… చివరకు…. సీఎస్ నుంచి పొన్నవోలు దాకా విజయవాడ, జూన్ 18 (న్యూస్ పల్స్)   Overdo it… and finally జగన్ సర్కార్లో క్యాబినెట్ మంత్రులకు మించి ఒక పేరు బలంగా వినిపించేది. జాతీయస్థాయిలో సైతం ఆ పేరు మార్మోగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబుపై మోపిన అవినీతి కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు పొన్నవోలు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కిందిస్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలను పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్డుకున్నారు. చివరకు సుప్రీంకోర్టులో పేరు మోసిన…

Read More

కమ్మని కాపులే… సక్సెస్ ఫార్ములా | Kammani Kapule… the formula for success | Eeroju news

కమ్మని కాపులే… సక్సెస్ ఫార్ములా రాజమండ్రి, జూన్ 18, (న్యూస్ పల్స్) Kammani Kapule… the formula for success ఏపీలో ప్రభుత్వం కొలువుదీరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా చంద్రబాబు సీఎం అయ్యారు. పవన్ డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్నారు. పవన్ కు ఇష్టమైన శాఖలను సైతం చంద్రబాబు కేటాయించారు. తనతో సమానంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. మిగతా మంత్రుల కంటే భిన్నంగా కాన్వాయ్ ని సిద్ధం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తనతో పాటు పవన్ కళ్యాణ్ చిత్రపటం ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే చంద్రబాబు వ్యవహార శైలి.. పవన్ నడుచుకుంటున్న తీరు చూస్తుంటే మాత్రం సుదీర్ఘ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.రెండు బలమైన సామాజిక వర్గాలను కలపడంలో చంద్రబాబు, పవన్ సక్సెస్ అయ్యారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న సూత్రం ఒకటి ఉంది. సుదీర్ఘకాలం…

Read More

ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్ | Pawan, who has taken the branches to be with the people | Eeroju nres

ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్ కాకినాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Pawan, who has taken the branches to be with the people : శాఖల కేటాయింపులో టీడీపీ మిత్రధర్మాన్ని పాటించింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ముఖ్యమైన శాఖలు కేటాయించడంతో పాటు, అదే పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు కీలకమైన పౌరసరఫరాల శాఖను అప్పగించింది. జనసేనకు సినీరంగంతో ఉన్న సంబంధాలు, పవన్‌ సినీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి విజ్ఞప్తి మేరకు కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. జనసేనానికి హోంశాఖ, ఆర్థిక శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ  ప్రజావసరాలు, పార్టీ బలోపేతంపై ద‌ృష్టిపెట్టిన ఆయన ప్రజలతో మమేకమయ్యే శాఖలనే ఏరికోరి ఎంచుకుని ప్రత్యేకత చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా జనసేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే కొనసాగనున్నారు.…

Read More

టార్గెట్ కొడాలి… అనిత ఫిక్స్ | Target Kodali… Anita Fix | Eeroju news

టార్గెట్ కొడాలి… అనిత ఫిక్స్ విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Target Kodali… Anita Fix : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో నాయకులు తెగ హడావిడి చేశారు. మీడియాను తమ వైపు తిప్పుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చేసాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలలో కనీసం ప్రతిపక్ష పార్టీ లేకుండా చేశారు. గత అధికార పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఏపీలో రాజకీయాల్లో కాక తగ్గడం లేదు. మరోవైపు చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఇందులో కీలకమైన హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా…

Read More

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ | Redistribution to YCP… tension | Eeroju news

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ తిరుపతి, జూన్ 17,(న్యూస్ పల్స్) Redistribution to YCP… tension : ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పలేదు. మున్ముందు ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనను టిడిపి కూటమి సర్కార్ పునః సమీక్షించే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయంలో లోపాలు వెతికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మద్యం వంటి భారీ కుంభకోణంలో జగన్ తో పాటు కీలక నేతల పాత్రను టిడిపి సర్కార్ బయట పెట్టే అవకాశం ఉంది. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు వంటి అంశాల్లో భారీ లోపాలు ఉన్నాయి. అయితే ఒక్క కేసులతోనే కాదు.. వైసిపి నిర్వీర్యమయ్యే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు విడిచిపెట్టారు. అది జగన్ కు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వ…

Read More

జూలై నుంచి ఫ్రీ బస్సు | Free bus from July | Eeroju news

జూలై నుంచి ఫ్రీ బస్సు కడప, జూన్ 17, (న్యూస్ పల్స్) Free bus from July : ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా.. చంద్రబాబు ఆర్టీసీ పల్లె వెలుగుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఏపీ అధికారులు. ఈ పథకంతో ఎంత భారం పడుతుంది? ఆర్టీసీ సర్వీసులపై చూపే ప్రభావం ఎంత? వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారుసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. తరువాత రోజు బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347…

Read More

కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు | Nominated posts for hardworking | Eeroju news

కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Nominated posts for hardworking : నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారుపార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామన్నారు. నేతలు, కార్యకర్తలు సాధికారిత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయన్నారు. అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజుల్లోనే తెరిపిస్తామని స్పష్టం చేశారు. కూటమి విజయం వెనుక కార్యకర్తలు, నాయకులు కష్టం, కృషి ఎంతో ఉందన్నారు. 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈ ఎన్నికల్లో…

Read More

రాజ్ మహల్ ప్యాలెస్ తరహా నిర్మాణం… | Raj Mahal Palace style… | Eeroju news

రాజ్ మహల్ ప్యాలెస్ తరహా నిర్మాణం… రుషికొండలో ఇంటిని చూపించిన గంటా విశాఖపట్టణం, జూన్ 17, (న్యూస్ పల్స్) Raj Mahal Palace style : రుషికొండపై అత్యంత రహస్యంగా నిబంధనలకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ భవనాన్ని తలపించే నిర్మాణాన్ని చేపట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.అత్యంత రహస్యంగా రూ.500 కోట్లు వెచ్చించి రాజమహల్ తరహాలో భవనాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన మొత్తం సైటు 61 ఎకరాలు కాగా, 9.8 ఎకరాల్లో భవనాన్ని రూ.500 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారన్నారు.ఏడు బ్లాకుల్లో సాగిన నిర్మాణాలకు ఒక్కో పేరు పెట్టారని గంటా వెల్లడించారు. పూర్వీకులు కాలంలో, సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు నిర్మించుకున్న తరహాలో జగన్మోహన్ రెడ్డి ఈ భవన నిర్మాణాలను…

Read More

బీజేపీలోకి విజయసాయిరెడ్డి… | Vijayasai Reddy joins BJP | Eeroju news

బీజేపీలోకి విజయసాయిరెడ్డి… నెల్లూరు, జూన్ 17, (న్యూస్ పల్స్) Vijayasai Reddy joins BJP : వైసీపీ కీలక నేత బిజెపిలో చేరుతున్నారా? ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? కాషాయ దళంతో టచ్ లోకి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురయింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వ నిర్ణయాలపై టిడిపి సర్కార్ పునసమీక్షిస్తోంది. దీంతో తమకు కేసులతో ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు భయపడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలోనే వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. గతంలో ఓటమి ఎదురు కావడంతో చంద్రబాబు ఎటువంటి ఆలోచన చేశారో.. ఇప్పుడు జగన్ సైతం అదే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.2019లో టిడిపికి…

Read More