మంత్రి నిమ్మలకు ఘన స్వాగతం | A warm welcome to the minister | Eeroju news

పాలకొల్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సొంత నియోజకవర్గం పాలకొల్లు విచ్చేసిన నిమ్మల రామానాయుడు కు టిడిపి మరియు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లు మండలం సగం చెరువు నుండి పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీగా ప్రజలు తరలివచ్చారు. గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి మంత్రి రామానాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన నుండి విముక్తి జరిగి ఈరోజు ప్రజా పాలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వాగతం పలికారని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా ఉద్యమం జరిగి ఏదైతే తెల్ల దొరలను భారతదేశం నుంచి పారద్రోలిన విధంగా జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టారన్నారు కొత్త ప్రభుత్వానికి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకు వచ్చి…

Read More

అన్నా క్యాంటిన్లు పునః ప్రారంభం | Anna canteens relaunched | Eeroju news

అనంతపురం – ఏపీ లోని పేదలకు కేవలం ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో దాదాపు 368 అన్నా క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వం రాగానే అవన్నీ మూతపడ్డాయి.- ఆ తర్వాత పలు ప్రాంతాల్లో టిడిపి నాయకులు స్వయంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కూడా వైసిపి ప్రభుత్వం వాటిని కూలదోసింది… అనంతపురం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటిన్లు అపరిశుభ్రంగా, తాగుబోతులకు నిలయంగా ఉన్నాయి, అయితే పేదలు మాత్రం ఈ క్యాంటిన్లు పునః ప్రారంభం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు…

Read More

ఇంకో మంత్రి పదవి భర్తీ ఎప్పుడు | When will another ministerial position be filled? | Eeroju news

విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. చంద్రబాబుతో పాటు నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది.కొణతాల రామకృష్ణ సీనియర్ నేత. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత ఒక్కరే మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. విశాఖ లాంటి జిల్లాకు ఒక్కరే మంత్రి పదవి అని ఎవరూ ఊహించని విషయం. అయితే అదే సమయంలో విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. BJPఅయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, కొణతాల రామకృష్ణ ఇలా అనేక మంది నేతలు కూటమి నుంచి విజయం సాధించి ఉన్నారు. అందులో మహిళ, ఎస్సీ కోటాలో ఒక్క వంగలపూడి అనిత…

Read More

కూరగాయల ధరలకు రెక్కలు.. | Wings for vegetable prices.. | Eeroju news

రాజమండ్రి, జూన్ 13, (న్యూస్ పల్స్) తూర్పుగోదావరి జిల్లాల్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధ‌ర‌ల మంట‌కు సామాన్యుల క‌ల్లల్లో నీరు తిరుగుతుంది. అమాంతం పెరిగిన నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను ధ‌ర‌ల‌ను చూసి సామాన్యులు విల‌విలలాడుతున్నారు. ఇటీవ‌లి కురిసిన అకాల వ‌ర్షాల వ‌ల్లే కూర‌గాయల ధ‌ల‌కు రెక్కలు వ‌చ్చాయ‌ని రైతులు, విక్రయ‌దారులు పేర్కొంటున్నారు. కూర‌గాయ‌లు, ఇత‌ర వంట స‌రుకుల ధ‌ర‌లు సామాన్యుని వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. ఏం కొనేట‌ట్టు లేదు…ఏం తినేట‌ట్టు లేదు అన్న ప‌రిస్థితి నెల‌కొంది. వారం రోజుల్లోనే రిటైల్ మార్కెట్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌లు బెంబేలెత్తుతున్నారు. కొన్నింటి ధ‌ర‌లు మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగాయి.వారం క్రితం వ‌ర‌కూ కిలో ట‌మాటా రూ.20 ఉండ‌గా, ప్రస్తుతం అది మూడింత‌లు పెరిగి రూ.60కు చేరింది. ప‌చ్చిమిర్చిని ముట్టుకుంటే ధ‌ర…

Read More

పెద్దిరెడ్డి పని పడతారా… | Peddireddy will work… | Eeroju news

తిరుపతి, జూన్ 13, (న్యూస్ పల్స్) అందరి లక్ష్యం ఆయనే. ఆయన టార్గెట్ గా రాబోయే రాజకీయమంతా నడుస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. శత్రువుల సంఖ్య అపారం. ఆయనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి పని పట్టేందుకు ఇప్పుడు అధికార పార్టీ నేతలంతా కాచుకూర్చుని ఉన్నారు. ఒక్కరైతే పర్లేదు. కానీ కూటమిలోని మూడు పార్టీలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శత్రువులున్నారు. ఈ ఎన్నికల్లో మరింత పెరిగారు. దీంతో ఆయన లక్ష్యంగా అధికార పార్టీ ఎక్కుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా సుదీర్థ రాజకీయాల నుంచి కొందరితో శత్రువులుంటే.. మరికొందరిని పార్టీ కోసం తనకు వ్యతిరేకంగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు వైఎస్ జగన్ కంటే ముందు ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడమే అధికార పార్టీ నేతలకు ఫస్ట్ ప్రయారిటీగా మారనుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…

Read More

ఏపీకి సూపర్ ఛాన్స్ | Super chance for AP | Eeroju news

విజయవాడ, జూన్ 13, (న్యూస్ పల్స్) ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో చంద్రబాబు నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అతిరథ మహారధుల సమక్షంలో కొత్త పాలకుల ప్రమాణస్వీకారం పూర్తయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకోవడం ఖాయం. ప్రమాణం చేసిన 24 మంది రేపటి నుంచి తమ విధుల్లోకి వెళ్ళనున్నారు. కొత్త పాలన ప్రారంభించనున్నారు. జనసేన తరఫున ముగ్గురు, బిజెపి తరఫున ఒక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన 17 మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మంత్రివర్గంలో కనిపిస్తున్నది యువ రక్తమే. అందుకే ప్రమాణ స్వీకారం సైతం ఉత్సాహంగా సాగిపోయింది. ఈ…

Read More

పవన్ సలహాలపై చర్చ | Discussion on Pawan’s suggestions | Eeroju news

గుంటూరు, జూన్ 13, (న్యూస్ పల్స్) పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్..వెండితెరపై జనసేనానికి ఉన్న పేరు ఇది. అయితే ఇప్పుడా హీరోను రియల్‌ హీరో చేశారు ప్రజలు. తన చేతికి నిజమైన పవర్‌ను అందించారు. మరి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పవన్ తన పవర్‌ను ఎలా ఉపయోగించబోతున్నారు. పగలు, ప్రతికార రాజకీయాలకు కేరాఫ్‌ అయిన ఏపీ పాలిటిక్స్‌లో.. పవన్ మార్పు తీసుకొస్తారా? దీనికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటి?ఒకసారి చేస్తే తప్పు.. పదే పదే జరిగితే అది అలవాటు.. రాజకీయాల్లో ఇదే జరుగుతుంది అంటారు. వాళ్లు కాకపోతే వీళ్లు.. వీళ్లు కాకపోతే ఇంకొకరు. పాలించేవారు మారుతారు. బట్ పాలించే విధానం మాత్రం మారదు. ఇదే ఏపీ పాలిటిక్స్‌ గురించి కాస్త తెలిసిన వారు ఎవరైనా చెప్పే మాట.. కానీ ఇకపై అలా ఎవ్వరూ అనుకునే అవకాశం ఇవ్వొద్దు అంటున్నారు. జనసేన అధినేత…

Read More

బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు సంబరాలు…| TDP leaders celebrate BC Janardhan Reddy’s ministership… | Eeroju news

కొలిమిగుండ్ల, జూన్ 12, కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మన బనగానపల్లె నియోజకవర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు బస్టాండ్ సెంటర్లో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటపాడు శివరామిరెడ్డి, కొలిమిగుండ్ల అందేరాము, బొట్టు స్వామి, నాగార్జున రెడ్డి, తెలికి నాగేశ్వర్ రెడ్డి, గూడూరు నాగేశ్వర్రెడ్డి, నిమ్మకాయల చిన్న దస్తగిరి, గ్రామ టిడిపి అధ్యక్షుడు బత్తూరి శీను, టైలర్ వెంకట్రాముడు, సీతారామయ్య, నర్సింహులు, చంద్రశేఖర్, రవి, మధు,మంధా విజయ్, దస్తగిరి, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

చిరంజీవి, పవన్‌ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం | Chiranjeevi and Pawan held hands and saluted the people of Modi | Eeroju news

అమరావతి జూన్ 12 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు టిడిపి, జనసేన కార్యకర్తల, జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరి సమక్షంలో ఎపి సిఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరితోపాటు కేబినెట్ మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్‌ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సంఘటన వేడుకకు హైలెట్ గా నిలిచింది.

Read More