మహీధరరెడ్డికి బుజ్జగింపులు… తలొగ్గేనా ఒంగోలు, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Mahidhar Reddy ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా వున్న మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి పార్టీ మారబోతున్నాడనే టాక్ జోరుగా నడుస్తోంది. నాలుగు సార్లు కందుకూరు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మహిధర్ రెడ్డి మొన్నటి ఎన్నికల ముందు నుంచే వైసీపీకి దూరంగా వుంటూ వస్తున్నారు. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో ముందు నుంచి మానుగుంట, దివి కుటుంబాల మధ్య రాజకీయాలు నడుస్తుండేవి. ఆ రెండు కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యవారు.ఆరు దశాబ్దాల నుంచి కందుకూరు నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తుంది మానుగుంట కుటుంబం. మహిధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో…
Read MoreTag: Eeroju news
Dharmana Prasada Rao | పక్క చూపులు చూస్తున్న ధర్మాన | Eeroju news
పక్క చూపులు చూస్తున్న ధర్మాన శ్రీకాకుళం, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Dharmana Prasada Rao రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ ఆయన. వైసీపీకి చెందిన ఆ నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారతారని, రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఆయన మౌనంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు అంటే తెలుగు రాస్ట్రాలలో తెలియనివారు ఉండరు. మంచి వాక్చాతుర్యంతో పాటు రాజకీయ వ్యూాహరచనలో ఆయనది అందెవేసిన చేయి. ఇంతటి గొప్ప నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరకు తాను ఎంతగానో ఇష్టపడే దివంగత నేత Y.S. రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. దాంతో ఆ సీనియర్ ఆలోచన ఏంటి అన్నది…
Read MoreAyushman Bharat | ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ | Eeroju news
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ అక్టోబర్ 30 Ayushman Bharat 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. పేద, ధనిక అనే ఎలాంటి తారతమ్యం లేకుండా దేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి. నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల టీకా కోసం ఉద్దేశించిన యు-పోర్టల్(U-WIN)ను కూడా ప్రధాని ఈ…
Read MoreKTR | మంత్రి పొంగులేటి ఇంటిపై ఇడి దాడులు చేస్తే బిజెపి.. కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు | Eeroju news
మంత్రి పొంగులేటి ఇంటిపై ఇడి దాడులు చేస్తే బిజెపి.. కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు హైదరాబాద్ అక్టోబర్ 30 KTR మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఇడి దాడులు చేసి నెలరోజులు కావస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బిజెపి, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భారీగా డబ్బులు దొరికినట్టు మీడియాలో వార్తలు వచ్చినా కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇడి దాడులు ముగిసిన వెంటనే అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపణలు చేశారు.తెలంగాణలో బకాసుర రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన పేదలపాలిట భస్మాసుర హస్తంగా మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, హైడ్రా అనే అరాచక సంస్థతో సిఎం రేవంత్…
Read More‘Deepavali’ village | ‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? | Eeroju news
‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? ‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? ‘Deepavali’ village చాలా మందికి ‘దీపావళి’ అంటే పండుగని మాత్రమే తెలుసు. కానీ ‘దీపావళి’ అనే పేరు మీద గ్రామం ఉందని ఎవరికీ తెలిసి ఉండదు. అవును ఇది నిజం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి గ్రామం ఉంది. అయితే ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి పెద్ద చరిత్రే ఉంది. సిక్కోలును పాలించే రాజు మరో ప్రాంతానికి వెళ్తూ ఈ గ్రామంలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడి ప్రజలు అతడిని దీపాల వెలుగులో సేవ చేశారు. కోలుకున్న తర్వాత రాజు ఈ గ్రామానికి ‘దీపావళి’ అని పేరు పెట్టినట్లు సమాచారం. NKR21 | నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 న్యూ 15 డేస్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం…
Read MoreKapil Dev Chandrababu | సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ | Eeroju news
సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ విజయవాడ, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Kapil Dev Chandrababu ఏపీలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు అవుతుందా? ఇప్పటికే ఒకటి విశాఖలో ఉంది. మరొకటి అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ భేటీకి కారణమేంటి? గతంలో తెచ్చిన ప్రొగ్రాంను తెరపైకి తెస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సమావేశమయ్యారు. గతరాత్రి విజయవాడకు చేరుకున్న ఆయన, మంగళవారం సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో గోల్ప్ కోర్టు ఉంది. అలాంటిది అమరావతిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2014-19 మధ్య కాలంలో గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీయ…
Read MoreHyderabad | గ్రూప్ వన్ పరీక్షలకు 67 శాతమే హాజరు | Eeroju news
గ్రూప్ వన్ పరీక్షలకు 67 శాతమే హాజరు హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Hyderabad తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. అయితే ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 31,383 మందీ పరీక్షలకు హాజరుకాలేదు. వీరిలో కేవలం 67.17శాతం మాత్రమే గ్రూప్ 1 మెయిన్స్‌కు హాజరయ్యారు. అంటే 21,181 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ మేరకు హాజరు శాతాన్ని టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఏడు పేపర్లకు (జనరల్ ఇంగ్లిష్ కలిపి) 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించింది. అక్టోబరు 21 నుంచి నిర్వహించిన…
Read MoreTDP | టీడీపీతో జాగ్రత్తగానే ఉండండి | Eeroju news
టీడీపీతో జాగ్రత్తగానే ఉండండి హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) TDP రెండు రోజులుగా జరిగేదంతా చూస్తున్నారు. ఇంతటితో అయిపోలేదు.. రానున్న రోజుల్లో మన మీద అనేకవిధాలుగా బురదజల్లే ప్రయత్నాలు జరుగుతాయి. కేవలం కాంగ్రెస్ ఒక్కటే కాదు బీజేపీ, టీడీపీల సోషల్ మీడియా కూడా మనల్ని ట్రోల్స్ చేస్తాయంటూ పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. కేటీఆర్ చేసిన ట్వీట్ ఆధారంగా.. అన్ని రంగాలలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, వారి వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ మీద అసహనంతో ఉన్నారన్నారు. ఈ పోరాటంలో సర్వశక్తులూ ఒడ్డుతున్న బీఆర్ఎస్ నాయకత్వానికి, సోషల్ మీడియా వారియర్లకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ తెలిపిన కేటీఆర్ మరికొన్ని విషయాలను ప్రస్తావించారు. గత రెండు రోజులుగా మనం…
Read MoreTelangana | జనవరి నుంచి సన్నబియ్యం | Eeroju news
జనవరి నుంచి సన్నబియ్యం హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ప్రభుత్వం.. తాజాగా చెప్పిన గుడ్ న్యూస్, పేద ప్రజలందరికీ గొప్పవరమనే చెప్పవచ్చు. మధ్య తరగతి, ధనిక కుటుంబాలలో కనిపించే సన్నబియ్యం ఇక పేదలకు కూడా అందనున్నాయి. సూపర్ సిక్స్ పథకాల హామీతో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని అమలు పరచడంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని ఈ ప్రకటనతో మరోమారు నిరూపితమైంది. ఇప్పటికే పేదల స్వంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మళ్లీ అదే పేదలకు జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా,…
Read MoreNagam Janardhan Reddy | ఆగమాగం.. నాగం… | Eeroju news
ఆగమాగం.. నాగం… మహబూబ్ నగర్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Nagam Janardhan Reddy నాగం జనార్దన్ రెడ్డి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం అంటే నాగం.. నాగం అంటే నాగర్ కర్నూల్ అన్న రేంజ్లో రాజకీయాల్లో చక్రం తిప్పారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హితులు సన్నిహితులు చెప్పిన మాటలు పెడ చెవిన పెట్టి రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అటు రాజకీయవర్గాల్లోనూ, నాగర్‌కర్నూల్ వాసుల్లోనూ చర్చ జరుగుతుంది.అసెంబ్లీ టైగర్‌గా పేరు ఉన్న నాగం జనార్దన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేశారు . పార్టీలో చంద్రబాబునాయుడు ఆయనకు అత్యంత ప్రాధాన్యత…
Read More