Ratan Tata | ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… క్షేమంగానే ఉన్నా… రతన్‌ టాటా | Eeroju news

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు....క్షేమంగానే ఉన్నా... రతన్‌ టాటా

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు….క్షేమంగానే ఉన్నా… రతన్‌ టాటా ముంబై అక్టోబర్ 7 Ratan Tata ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. రక్తపోటు తగ్గిపోవడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి తరలించారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్వస్థత వార్తలపై రతన్‌ టాటా స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఐసీయూలో చేరిన వార్తలను రతన్‌ టాటా ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవి. నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య…

Read More

KCR and Kavitha… | కేసీఆర్, కవితలకు ఏమైంది… | Eeroju news

కేసీఆర్, కవితలకు ఏమైంది...

కేసీఆర్, కవితలకు ఏమైంది… హైదరాబాద్, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) KCR and Kavitha… దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సెంటిమెంట్‌తో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయాక ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ఆయన దసరా నుంచి పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారని ప్రచారం జరిగినా చడీచప్పుడు లేదు. ఇక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగంటే తెగ హడావుడి చేశేవారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణలో బతుకమ్మకు ప్రాచుర్యం తెచ్చిన ఆమె పండుగ మొదలై రోజులు గడుస్తున్నా వేడుకల్లో కనిపించడం లేదు. దాంతో అసలా తండ్రీ కూతుళ్లకు ఏమైందన్న చర్చ నడుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కేసీఆర్‌గా అందరికీ పాపులర్ అయిన మాజీ ముఖమంత్రి. టీడీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కలేదని 2001లోతెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ…

Read More

Hyderabad | 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ | Eeroju news

20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ హైదరాబాద్, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Hyderabad పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20 నుంచి 25 ఎకరాల్లో ఇంగ్లీష్ మీడియాలకు దీటుగా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి నర్సరీ నుంచి ఇంటర్ వరకు మెరుగైన ఉచిత విద్య అందిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ఇప్పటివరకూ సొంత భవనాలు లేవని, ఇరుకైన బిల్డింగ్స్ లో ఈ స్కూళ్లు ఉన్నాయన్నారు.రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్…

Read More

Jagan Realization | జగన్ రియాలైజేషన్ మొదలైందా…. | Eeroju news

జగన్ రియాలైజేషన్ మొదలైందా....

జగన్ రియాలైజేషన్ మొదలైందా…. కడప, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Jagan Realization వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2024లో తన పార్టీ దారుణ ఓటమి తర్వాత కొంత మేర ఆయనకు రియలైజేషన్ వచ్చినట్లుంది. ఆయన తన ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులేమిటో ఒక్కొక్కటీ తెలుసుకుంటున్నారు. కేవలం సంక్షేమ పథకాలు ఓట్లు తెచ్చిపెట్టవని, బటన్ నొక్కితే ఈవీఎంలలో జనం బటన్ నొక్కరని జగన్ కు జ్ఞానోదయం అవుతున్నట్లు కనిపిస్తుంది. కేవలం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కావడం, నేతలను ప్రజలకు దూరం చేయడంతో పాటు వాలంటీర్ల వ్యవస్థతో తాను కొత్త వ్యవస్థను తీసుకు వచ్చానని భ్రమలో ఉన్నానని అర్థమయినట్లుంది. కేవలం నగదు ఇచ్చినంత మాత్రాన ప్రజలు సంతృప్తి చెందరని, వారికి అభివృద్ధి కూడా కావాలని వైఎస్ జగన్ కు క్రమంగా బోధపడినట్లుంది.ఇక పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తలను దూరం…

Read More

Pawan Kalyan | పవన్ ఫామ్ కోల్పొతారా… | Eeroju news

పవన్ ఫామ్ కోల్పొతారా...

పవన్ ఫామ్ కోల్పొతారా… తిరుపతి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Pawan Kalyan జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకింత ఫామ్ కోల్పోతున్నారా? ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఏమీ చేయలేక నిరాశ నిస్పృహలో మిగిలిపోయారా? అందుకే సనాతన ధర్మం ముసుగు వేసుకుని తిరుగుతున్నారా? అన్న కామెంట్స్ ఇప్పుడు ఆయన అభిమానులనే కాదు కాపు సామాజికవర్గాన్ని కూడా వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు వరకూ పవన్ కల్యాణ్ లో కనిపించని సనాతన ధర్మం ఇప్పుడు ఒక్కసారిగా కనిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ ఘటనలు జరిగాయా? కదా? అన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం లేదు.అప్పుడు రామతీర్థంలో రథం తగలపడటం వంటి ఘటనలు జరిగినా పవన్ కల్యాణ్ కు అప్పుడు…

Read More

Varahi Declaration | వారాహి డిక్లరేషన్.. ప్లస్సా… మైనస్సా… | Eeroju news

వారాహి డిక్లరేషన్.. ప్లస్సా... మైనస్సా...

వారాహి డిక్లరేషన్.. ప్లస్సా… మైనస్సా… తిరుపతి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Varahi Declaration జనసేనాని జనం మెచ్చిన సేనాని అయ్యారు. ఇప్పుడు హైందవ సేనానిగా మారుతున్నారు. నిష్టగా దీక్షలు చేస్తూ హైందవ ధర్మం కోసం పోరాటం అంటూ.. బీజేపీని మించిన ఎజెండాతో దూసుకెళ్తున్నారు. తిరుమల లడ్డూ ఇష్యూలో పవన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు లడ్డూ వివాదాన్ని ఎంత వరకు అడ్రస్ చేయాలో అంతే ప్రస్తావించి..తర్వాత సైలెంట్గా ఉండిపోయారు. ఒకవేళ మాట్లాడినా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని చెప్పారే తప్ప..ఇతర మతాల ప్రస్తావన తేలేదు.పవన్ కల్యాణ్ మాత్రం లడ్డూ ఇష్యూను పీక్స్‌కు తీసుకెళ్లారు. ఇతర మతాల విషయంలో ఇలాగే జరిగితే ఊరుకుంటారా..సనాతన ధర్మం మీద మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. పాయశ్చిత దీక్ష చేసి..తర్వాత వారాహి డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు సనాతన ధర్మ…

Read More

Chandrababu VS Kiran Kumar | చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ | Eeroju news

చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ తిరుపతి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Chandrababu VS Kiran Kumar ఒకరేమో ప్రస్తుత సీఎం.. మరొకరు మాజీ సీఎం.. వీరిద్దరూ కలిశారు.. మాట్లాడుకున్నారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు ఏమి మాట్లాడుకున్నారు.. ఏ విషయంపై చర్చించారన్నది మాత్రం బయటకు రాని పరిస్థితి. వీరి కలయిక వెనుక ఏదైనా అంతరార్థం ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బాబు భేటీ కానున్నారు. ఈ సంధర్భంగా రాజకీయ పరమైన అంశాలపై చర్చ సాగనుండగా.. రాష్ట్రానికి సంబంధించిన…

Read More

Changes in inter education | ఇంటర్ విద్యలో మార్పులు | Eeroju news

ఇంటర్ విద్యలో మార్పులు

ఇంటర్ విద్యలో మార్పులు విజయవాడ, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Changes in inter education ఏపీ ఇంటర్ విద్యలో మార్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సంస్కరణలను తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవలే విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా ఇదే విషయం చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అడుగులు పడే అవకాశం ఉంది.ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త నిర్ణయాలను అమలు చేయాలని భావిస్తోంది. పరీక్షల విధానంతో పాటు సిలబస్ ను కూడా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను కూడా తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.…

Read More

Tomato Price | రూ.80కి చేరిన టమాటా | Eeroju news

రూ.80కి చేరిన టమాటా

రూ.80కి చేరిన టమాటా రాజమండ్రి, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Tomato Price టమాటా ధరలు ఒక్కసారిగా సెంచరీ కొట్టేస్తోంది. ఎక్కడ చూసీన 80 రూపాయ కంటే తక్కువకు కిలో టమాటా దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు 50రూపాయల్లోపు ధర పలికే టమాటా ఇప్పుడు ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. కొనేందుకు వెళ్తున్న వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉన్న వాటినోత సరిపెట్టుకుంటున్నారు. అసలే పండగ సీజన్ ఆపై ధర పెరిగిపోవడంతో ఏం తినాలని వాపోతున్నారు. టమాటా లేనిదే దాదాపు ఎవరింట్లో కూడా వంట పూర్తి కాదు. వెజ్‌ ఆర్‌ నాన్‌వెజ్ ఏం వండినా టమాటా ఉంటే ఆ వంటకానికి అదనపు రుచి వస్తుంది. కుటుంబానికి సరిపడేలా వంటకం పూర్తి అవుతుంది.ఇప్పుడు టమాటో వందకు చేరుకోవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. కొందరు చింతపండును వినియోగిస్తుంటే మరికొందరు నిమ్మకాయలతో సరిపెట్టుకుంటున్నారు.…

Read More

Devaragattu | దేవరగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం | Eeroju news

దేవరగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం

దేవరగట్టు కర్రల సంబరాలకు సర్వం సిద్ధం కర్నూలు, అక్టోబరు 7, (న్యూస్ పల్స్) Devaragattu దసరా పండుగ సందర్భంగా దేవరగట్టు కర్రల సంబరానికి భక్తులు సిద్ధమవుతున్నారు. ఆలూరు నియోజకవర్గం లోని దేవరగట్టులో ప్రత్యేక విజయదశమి పండుగ రోజు మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా జరిగే సంప్రదాయ సమరమే కర్రల సమరం. దీనినే స్థానికంగా బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవానికి ఆంధ్రతో పాటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి జరుపుకునే ఉత్సవమే సమరమే కర్రల సమరం బన్నీ ఉత్సవం గా పిలుస్తారు. ఈ కర్రల సంబరానికి కొంతమంది మద్యం సేవించి వస్తుండటంతో కర్రలు తిప్ప లేక,.. కర్రల చివర్లో ఉండే ఇనుప…

Read More