Rushikonda | రుషికొండ రహస్యాలు…. | Eeroju news

Rushikonda

రుషికొండ రహస్యాలు…. విశాఖపట్టణం, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Rushikonda ఏపీలో ఎన్నికలు పేదోడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధమని.. ప్రచారం సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పదేపదే పేర్కొన్నారు. అలాంటాయన తిరిగి అధికారంలోకి వస్తానన్న ధీమాతో విశాఖ రుషికొండపై నివాసానికి నిర్మింపచేసుకున్న ప్యాలెస్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కూటమి ప్రభుత్వానికి ఇప్పుడది వైట్ ఎలిఫెంట్‌లా మారింది. దాని నిర్మాణానికి రుషికొండపై కూలగొట్టిన కాటేజీలు.. అప్పట్లో అసలు ఏం జరిగిందన్న దానిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే ఆ ఎంక్వయిరీ టీమ్‌లో ఉన్న అధికారులు ఇంకా వైసీపీ విధేయత ప్రదర్శిస్తుండటంతో.. నిజాలు మరుగున పడిపోతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేసుకోవాలో? ఎలా వినియోగించుకోవాలో? కూటమి సర్కారుకు అంతుపట్టడం లేదు సుమారు 560కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా…

Read More

Sankranti Special Trains | సంక్రాంతికి మరిన్ని రైళ్లు…. | Eeroju news

సంక్రాంతికి మరిన్ని రైళ్లు....

సంక్రాంతికి మరిన్ని రైళ్లు…. హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Sankranti Special Trains సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాన్ ఏంటి? సంక్రాంతికి రైళ్లకు కోచ్‌లను పెంచుతుందా? లేకుంటే స్పెషల్‌ రైళ్లను ఏర్పాటు చేస్తుందా? ప్రత్యేకంగా రైళ్లు వేస్తే.. గమ్యస్థానం చేరుకోవడానికి మరింత ఆలస్యమవుతుందా? దీనిపై సౌత్ సెంట్రల్ రైల్వే దృష్టి సారించింది.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతి పెద్ద ఫెస్టివల్ సంక్రాంతి. ఎక్కడున్నా ఫెస్టివల్ సమయానికి సొంతూళ్లకు వెళ్తారు. బెంగుళూరు, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి లక్షలాది ఏపీకి వెళ్తుంటారు. ఒక్క తెలంగాణ నుంచి సంక్రాంతికి ఏపీకి దాదాపు 15 లక్షల మంది వెళ్తారన్నది అధికారిక లెక్క. నాలుగు నెలల కిందట రైళ్లకు రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. జనవరి 10 నుంచి 13 వరకు ఏ రైలు రిజర్వేషన్ చూసినా రిగ్రెట్ అని కనిపిస్తోంది. ఇక వెయిటింగ్…

Read More

YS Jagan vs Anil Kumar | అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. | Eeroju news

అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్..

అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. నెల్లూరు, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) YS Jagan vs Anil Kumar   సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. వరుసగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లను మారుస్తున్నారు. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇప్పటి దాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని నెల్లూరు సిటీ ఇన్చార్జ్‌గా షిఫ్ట్ చేశారు. దాంతో వైసీపీలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా తయారైంది. రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి చవి చూశాక లోపాలను సరిదిద్దుకునే పనిలో పడింది. రానున్న కాలంలో…

Read More

Indrakiladri mustabu for Dussehra | దసరాకు ఇంద్రకీలాద్రి ముస్తాబు | Eeroju news

దసరాకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

దసరాకు ఇంద్రకీలాద్రి ముస్తాబు విజయవాడ, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Indrakiladri mustabu for Dussehra దసరా వచ్చేస్తుంది. అందులోనూ విజయవాడ దుర్గ గుడిలో జరిగే దసరా వేడుకలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఫేమస్. అయితే ఇటీవల విజయవాడ నగరం మొత్తం వరదలతో ఇబ్బంది పడడంతో ఈసారి దసరా వేడుకలు గతంలోలా జరుగుతాయా లేదా అమ్మవారి వైభవాన్ని ఈ ఏడాది చూడగలమా లేదా అని భక్తులు సందేహించారు. కానీ ఈసారి కూడా దుర్గ గుడిలో దసరాను ఎంతో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అక్టోబర్ 3 నుంచి 12 వరకూ దసరా నవరాత్రులు జరుగుతాయని దుర్గగుడి కమిటీ తెలిపింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు…

Read More

Telangana | ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్ | Eeroju news

ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్

ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Telangana కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మాటల తూటాలు ఎలా పేలుతాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వార్ వన్ సైడ్ కాదు.. టూ సైడ్.. అనేలా ఉంటాయి.. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సవాళ్లు ఎలా ఉంటాయో ఇంకా చెప్పాల్సిన పనే ఉండదు.. ప్రస్తుతం వాళ్లిద్దరి మధ్యనే మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.. ఏ విషయం పైనేనా.. వాళ్లిద్దరూ హోరాహోరీగా సవాళ్లు చేసుకుంటుంటారు.. ప్రస్తుతం కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు విపరీతమైన భాషలో విరుచుపడుతున్నారు. ప్రతిరోజు ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ కూడా నడుస్తుంది. అసెంబ్లీలోనూ అదే కొట్లాట.. రాజకీయంగానే అదే పొట్లాట.. రాజకీయంగా రెండు విభిన్న…

Read More

Tirupati Laddu | తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా | Eeroju news

Tirupati Laddu

తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా తిరుమల, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Tirupati Laddu తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ప్రస్తుతం అన్ని మీడియా సంస్థల్లో చర్చ నడుస్తోంది. కొంతమంది చంద్రబాబు వ్యాఖ్యలపై ఆరోపణలు చేస్తుండగా.. మరోవైపు వైసీపీ హయాంలో జరిగింది వాస్తవమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ తరుణంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 50 ఏళ్తుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని జగన్ రెడ్డి ఎందుకు ఉన్నట్లు ఉండి తొలగించాడో ఇప్పుడు అర్ధమైందా ? అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలకు…

Read More

Kethireddy | జనసేన గూటికి కేతిరెడ్డి, విడుదల | Eeroju news

Kethireddy

జనసేన గూటికి కేతిరెడ్డి, విడుదల విజయవాడ, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Kethireddy ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటపడేందుకు లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను ఇప్పటికే పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఉదయభాను ఎన్నికలకు ముందే పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది కానీ ఎక్కడా సీటు లభించే అవకాశం లేకపోవడంతో వైసీపీలోనే కొనసాగారు. జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. వైసీపీ నేతల నుంచి జనసేన పార్టీకి చాలా ఎంక్వయిరీలు వస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు…

Read More

Ration card | అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు | Eeroju news

అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు

అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు నల్గోండ, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Ration card రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూత‌న రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు రెండో తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేదానిపై క‌స‌ర‌త్తు చర్చించారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు…

Read More

Telangana | 15 ఏళ్ల వాహానాలు దాటితే…వాహానాలు ఇక స్క్రాపే.. | Eeroju news

Telangana

15 ఏళ్ల వాహానాలు దాటితే…వాహానాలు ఇక స్క్రాపే.. హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణలో 15ఏళ్లు దాటిన వాహనాలను తక్కు కింద మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నియత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలు తెలంగాణ 30 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే 15 ఏళ్లు నిండిన 20 లక్షల వాహనాలు ఉన్నాయి. వాటిలో 17 లక్షల బైకులు, 3.5 లక్షల కార్లతో పాటు లక్ష గూడ్స్ క్యారేజీలు, 20,000 ఆటోలు ఉన్నాయి,2025, జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రమాదకరమైన మరియు కాలుష్యకారక వాహనాలను స్క్రాప్‌కు పంపాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు….అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్‌ అయితే… ఆ వాహనాలకు…

Read More

CPS employees | సీపీఎస్ కోసం ఉద్యోగుల ఒత్తిడి | Eeroju news

CPS employees

సీపీఎస్ కోసం ఉద్యోగుల ఒత్తిడి హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్) CPS employees కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ విధానం.. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందనే వాదనలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తరువాత.. వారికి రావాల్సిన భృతి అందటం ప్రశ్నార్ధకంగా మారింది. 2004 సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సీపీఎస్ విధానాన్ని ఉపాధ్యాయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి.. అమలు బాధ్యతను ఇచ్చికంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. జీవో ఎంఎస్ నెంబర్ 653, 654, 655 ద్వారా అమలు చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత.. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని తమ నిర్ణయాన్ని అడిగింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం జీవో…

Read More