ఏపీఎఫ్ డీసీ పోస్టు రగడ… విజయవాడ, జూలై 13 (న్యూస్ పల్స్) Gopalakrishna Dwivedi APF DC Post Ragada ఏపీలో ప్రభుత్వ అధికారుల నియామకాలే వివాదాస్పదంగా మారాయనుకుంటే నామినేటెడ్ పదవుల వ్యవహారంపై కూడా చర్చగా మారింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు గడిచింది. కొత్త ప్రభుత్వం కుదురుకునే క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగులు జరుగుతున్నాయి. ఈ కసరత్తే ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్ వ్యవహారాలపై ఇప్పటికే రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. కీలక నియామకాల్లో ఇంటెలిజెన్స్ వైఫల్యంతో పాటు కొందరు అధికారుల పాత్రపై సందేహాలు వ్యక్తమయ్యాయి. గోపాలకృష్ణ ద్వివేది వంటి అధికారులకు పోస్టింగ్ ఇచ్చి తర్వాత జిఏడిలో రిపోర్ట్ చేయాలని మరో జీవో జారీ చేశారు. అధికారుల పోస్టింగ్ కసరత్తు పూర్తి కాకముందే నామినేటెడ్ పదవుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఐదేళ్లు…
Read MoreTag: Eeroju news
Pulasa craze fish is not normal | పులస క్రేజ్… మాములుగా లేదుగా | Eeroju news
పులస క్రేజ్… మాములుగా లేదుగా 2 కేజీల పులస – రూ. 24 వేలు… కాకినాడ, జూలై 13 (న్యూస్ పల్స్) Pulasa craze fish is not normal రెండు కేజీల చేప ధర ఎంతుంటాది…! మహా అయితే 300 లేదా 400 ఉంటుంది. కానీ రెండు కేజీల చేప ఏకంగా రూ.24 వేలంట…! నిజమే రెండు కేజీల చేప ధర ఏకంగా రూ.24 వేల ధర పలికింది. అది మామూల చేప కాదు… పులస చేప. కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో చేపల వేటలో మత్స్యకారులకు చిక్కింది. ఆ మత్స్యకారుల పంట పండింది.గోదావరి వరదల సమయంలో మాత్రమే అరుదుగా దొరికే పులస చేప శుక్రవారం కోనసీమ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. దీంతో ఆ మత్స్యకారుల ముఖాల్లో ఆనందం అంతుపట్టని విధంగా ఉంది సంతోషంతో…
Read MoreA big boost for AP | ఏపీకి పెద్ద బూస్ట్… | Eeroju news
ఏపీకి పెద్ద బూస్ట్… విజయవాడ, జూలై 13 (న్యూస్ పల్స్) A big boost for AP ఏపీలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఐదు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రూ. 60వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. కేంద్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఎ) ప్రభుత్వంలో కీలక మిత్రుడుగా చంద్రబాబు రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్ ) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెట్రోలియం రిఫైనరీ కోసం ఏపీలో మూడు ప్రధాన ప్రదేశాలపై చర్చించారు. వీటిలో శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నం…
Read MoreChandrababu Focus on Visakha | విశాఖపై చంద్రబాబు ఫోకస్ | Eeroju news
విశాఖపై చంద్రబాబు ఫోకస్ విశాఖపట్టణం, జూలై 13, (న్యూస్ పల్స్) Chandrababu Focus on Visakha మహా విశాఖ నగరం… తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక నగరం.. సిటీ ఆఫ్ డెస్టినీగా చెప్పే ఈ సాగర నగరం రాజకీయంగా ఎంతో ప్రధానం. ఉత్తరాంధ్రలో కీలక నగరం… రాష్ట్రానికి ఆయువు పట్టు. అందుకే ఈ నగరాన్ని గత ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా చేసుకుంది. అదే సమయంలో విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చి విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆలోచన. గత, ప్రస్తుత ప్రభుత్వాలు వేటికవే విశాఖలో తమ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవాలని చూసినా, విశాఖ వాసులు మాత్రం చంద్రబాబు బ్రాండ్‌కే పట్టం కడుతున్నారు. అందుకే చంద్రబాబు ఎప్పుడూ విశాఖను తన మానస పుత్రికగా భావిస్తుంటారు.ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు.. సరిగ్గా నెల రోజుల తర్వాత…
Read MoreDuring Jagan’s tenure the cabinet was a dummy | జగన్ హయాంలో క్యాబినెట్ డమ్మీ | Eeroju news
జగన్ హయాంలో క్యాబినెట్ డమ్మీ విజయవాడ, జూలై 13 (న్యూస్ పల్స్) During Jagan’s tenure the cabinet was a dummy ఒక ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవాలంటే యంత్రాంగమే కాదు.. మంత్రులు కూడా కీలకమే. మంత్రులు తమకు అప్పగించిన శాఖలపనితీరును సక్రమంగా నిర్వర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ దురదృష్టవశాత్తు గత ఐదేళ్లలో మంత్రులు డమ్మీలుగా మారారు అన్న విమర్శ ఉంది. ఉమ్మడి ఏపీతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ లో డమ్మీ క్యాబినెట్ గా వైసీపీ మంత్రులకు ఆ పేరు ఉంది. గత ఐదేళ్ల కాలంలో తమ సొంత శాఖలపై సమీక్షించిన వారు అతి కొద్ది మంది మాత్రమే. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు లాంటి మంత్రులే తమ శాఖలపై సమీక్షలు నిర్వహించగలిగారు. కానీ మిగతా ఏ ఒక్కరు సమీక్షించిన దాఖలాలు లేవు.…
Read MoreYCP MLCs inclined to join TDP | టిడిపిలో చేరేందుకు వైసిపి ఎమ్మెల్సీల మొగ్గు | Eeroju news
టిడిపిలో చేరేందుకు వైసిపి ఎమ్మెల్సీల మొగ్గు విజయవాడ, జూలై 13 (న్యూస్ పల్స్) YCP MLCs inclined to join TDP రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీతో కొనసాగుతోంది. శాసనసభలో ఏ బిల్లు అయినా సులభంగా పాస్ చేసుకునే బలం కూటమికి ఉంది. గత ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన వైసీపీ దారుణ పరాభవంతో 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే, వైసీపీకి శాసనమండలిలో మాత్రం బలం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కీలక బిల్లులను పాస్ చేయించుకోవాలంటే శాసన మండలిలో కూడా ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో అధికార కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది తప్పదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి…
Read MoreKavitha’s bail just then | కవితకు బెయిల్… అప్పుడేనా | Eeroju news
కవితకు బెయిల్… అప్పుడేనా హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Kavitha’s bail just then తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారాగార వాసం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో అరెస్టు చేసింది. తర్వాత ఢిల్లీకి తరలించి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. కోర్టు రిమాండ్ విధించడంతో నాలుగు నెలలుగా తీహార్ జైల్లో ఉంటుంది.అరెస్టై ఐదు నెలలు కావస్తున్న ఆమెకు ఇంతవరకు బెయిల్ దొరకలేదు. కవిత పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ప్రతీసారి దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వ్యతిరేకిస్తున్నాయి. చార్జిషీటు దాఖలు చేసినా కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులకు విన్నవిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో న్యాయమూర్తులు…
Read MoreDoes KTR have amnesia | కేటీఆర్ కు మతిమరుపు ఉందా | Eeroju news
కేటీఆర్ కు మతిమరుపు ఉందా హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Does KTR have amnesia కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత.. మాజీ మంత్రి. పదేళ్ల పాటు ఆయన రాష్ట్రానికి ఆయన సేవలందించారు. అమెరికాలో చదువుకున్నారు.. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఇన్నీ అర్హతలున్న కేటీఆర్‌కు కాస్త కామన్‌సెన్స్‌తో పాటు.. జ్ఞాపకశక్తి తక్కువనిపిస్తోంది. ఫస్ట్ కేటీఆర్ రీసెంట్‌గా చేసిన ఓ ట్వీట్‌ను చూద్దాం. ట్వీట్ సారాంశం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల ప్రభుత్వ భూములను ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెడుతోంది. వీటి విలువ రూ.20 వేల కోట్లు.. వీటిని తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల నిధులను సమీకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారిని 100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కోకాపేట, రాయదుర్గం…
Read MoreExtortion of Hyderabad workers’ money | కార్మికుల సొమ్ము దర్జాగా దోపిడీ! | Eeroju news
కార్మికుల సొమ్ము దర్జాగా దోపిడీ! హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Extortion of Hyderabad workers’ money బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫర్ బోర్డు (బీఓసీడబ్ల్యూడబ్ల్యూ) యాక్ట్ 1996 ప్రకారం, ఏదైనా భవనం నిర్మాణంలో ఉంటే, ఒక శాతం సెస్‌ను వెల్ఫేర్ బోర్డుకు బదులాయించాలి. తెలంగాణలో ఏటా రూ.500 కోట్ల వరకు కార్మికుల కటుంబాలకు ఖర్చు పెట్టేందుకు ఆ ఆదాయం సమకూరుతుంటుంది. అయితే, ఇదే అదునుగా కార్మికుల సొమ్ముని దర్జాగా దోచేశారు. అందుకు రక్త పరీక్షల స్కీమ్ వెనుక జరిగిన స్కామ్ ఉదాహరణ. బయటకు అన్నీ పక్కాగా కనిపించినా, అనేక లొసుగులతో కొట్లాది రూపాయలు కొల్లగొట్టారు. డిజిటల్ ఇండియా స్కీమ్‌ని వాడుకుంటూ కొత్త పంథాలో స్కామ్‌కు తెరతీశారు. నవంబర్ 14, 2022. జీవో 20ని బీఓసీడబ్ల్యూడబ్ల్యూకి హెల్త్ స్ర్కీనింగ్ స్కీమ్ అంటూ తీసుకొచ్చారు.…
Read MoreWhat is Mallareddy’s master plan? | మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ | Eeroju news
మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ హైదరాబాద్, జూలై 12 (న్యూస్ పల్స్) What is Mallareddy’s master plan? తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే నేత మాజీ మంత్రి మల్లారెడ్డి. మాస్ మల్లన్నగా అందరూ ముద్దుగా పిలుచుకునే మల్లారెడ్డి తన రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పాలని నిర్ణయించుకున్నారట. స్వతహాగా వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేతగా బాగా ఫేమస్ అయ్యారు. ఇక 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. మల్లారెడ్డి అంటేనే ఓ బ్రాండ్‌గా అందరికీ గుర్తిండిపోయారు. 2014లో తొలిసారిగా మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి… ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరి… రాష్ట్రమంత్రి కూడా అయిపోయారు.ఇక గత ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా, బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డికి కష్టాలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా…
Read More