జూలై 7 నుంచి బోనాలు… | Bonalu from July 7… | Eeroju news

జూలై 7 నుంచి బోనాలు… హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) Bonalu from July 7 : జ్యేష్ఠమాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాడమాసంలో వచ్చే మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం గోల్కొండకోటపై జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఏడాది జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5 శుక్రవారం వచ్చింది…అంటే జూలై 6 శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది.  జూలై 7  ఆషాడంలో వచ్చే మొదటి ఆదివారం రోజు భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహించిన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి…మళ్లీ గోల్గొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయి.   జూలై 7 ఆదివారం…

Read More

ముందుకు సాగని కడెం ప్రాజెక్టు పనులు | Unprogressive Kadem project works | Eeroju news

ముందుకు సాగని కడెం ప్రాజెక్టు పనులు అదిలాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) Unprogressive Kadem project works : నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఇదీ. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు.. 7.603 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 671 అడుగులకు చేరుకుంది. గత ఏడాది కడెం ప్రాజెక్టు భారీ వర్షాలకు నిండిపోయి.. గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వరద నీరు ప్రాజెక్టుపై నుండి పారింది. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోతుందని అందరు భయాందోళనకు గురయ్యారు.ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు వేరే చోట ఆశ్రయం కల్పించారు. పనిచేయని గేట్లను స్ధానిక యువకులు హ్యాండిల్ సహాయంతో ఎత్తారు. దీంతో ప్రాజెక్ట్ లో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో డ్యాం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది.…

Read More

గులాబీ నేతలకు వరుస నోటీసులు | A series of notices to rose weavers | Eeroju news

కరీంనగర్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్ ప్రభుత్వం వేసిన కమిషన్లు బీఆర్ఎస్ నేతలకు నోటీసుల మీద నోటీసులు పంపించడంతో అధికారులు షాకవుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు, అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. తాజాగా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ వంతైంది. బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులైన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. పీసీ ఘోష్‌ను తన కార్యాలయంలో విలేకరులు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అఫిడవిల్లలో ఉన్న వివరాల ఆధారంగా నోటీసులపై తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా మరోసారి తనిఖీలకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాంకేతిక అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్, త్వరలో ఉల్లంఘనలపై ఫోకస్ చేయనుంది.ముఖ్యంగా డిజైన్,…

Read More

హైదరాబాద్ రియల్ పై ప్రభావం | Impact on Hyderabad Real | Eeroju news

హైదరాబాద్ రియల్ పై ప్రభావం హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) Impact on Hyderabad Real : సౌత్ లో గుర్తింపు ఉన్న నగరం హైదరాబాద్. అన్ని వనరులు ఉన్న భాగ్యనగరం అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత మరింత వేగం పుంజుకుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. భాగ్యనగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, తదితర జిల్లాలు కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఇక్కడి స్థలాలకు కోట్లాది రూపాయల డిమాండ్లు వచ్చాయి. అయితే, ఇటీవల రాజకీయ పరిణామాలు పూర్తిగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అత్యంత ఎన్నికయ్యారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అమరావతిపై ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్…

Read More

భూముల ధరల పెంపుదలపై మధనం | Madhanam on increase in land prices | Eeroju news

హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలో 400కుపైగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా.. ఆరు గ్యారంటీలు అమలు కాలేదు. మరోవైపు మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగియడంతో సీఎం రేవంత్‌రెడ్డి హామీల అమలుపై దృష్టిపెట్టారు.ప్రస్తుతం రేవంత్‌రెడ్డి రుణమాఫీకి సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులు సమీకరణపై దృష్టిపెట్టారు. రుణమాఫీ అర్హులను గుర్తించేందుకు కండీషన్లు పెట్టారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ రేవంత్‌కు సవాల్‌గా మారింది.శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆయా శాఖల నుంచి రావాల్సిన బకాయిలు సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెంపుపైనా దృష్టి పెట్టారు. భూముల…

Read More

కారును కాపాడుకొనేది ఎలా | How to maintain a car | Eeroju news

హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) ఓడలు బండ్లు అవుతాయి.. బండు ఓడలు అవుతాయి అన్నది సమెత. ఈ సామెత తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. పదేళ్లు తెలంగాణలో నంబర్‌వన్‌గా, తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ.. ఆరు నెలల క్రితం ఓటరు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడమే ప్రశ్నార్థకమైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కారు స్పీడ్‌కు బ్రేకులు వేయగా.. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు.. కారును పంక్చర్‌ చేసింది. పదేళ్లు తెలంగాణకు తాను ప్రభువును అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్‌ అతని కుటుంబాన్ని ప్రజాస్వామ్యంతో తమకున్న ఓటు అనే ఆయుధంతో కిందకు దించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నేతల్లో అహంకారం తగ్గలేదు. ఇదే తరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన స్కామ్‌లు, కుంభకోణాలను…

Read More

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి హోంమంత్రి అనిత | Violence against women should be feared Home Minister Anita | Eeroju news

Festive atmosphere across the state

అమరావతి రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.   తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు.  మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని ఆమె తెలిపారు. మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు.   లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు. పోలీసులు ప్రజల కోసం చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. పోలీసు శాఖను కిందిస్థాయి…

Read More

కుప్పకూలుతున్న కొడాలి సామ్రాజ్యం | The Collapsing Kodali Empire | Eeroju news

విజయవాడ, జూన్ 15, (న్యూస్ పల్స్) మొన్నటి వరకు గుడివాడ నా అడ్డా అన్నారు కొడాలి నాని. దమ్ముంటే గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా తన బొచ్చు కూడా పీకలేరని ఎద్దేవా చేసేవారు. గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్ ను తాకలేరని కూడా సవాల్ చేసేవారు. గత ఐదు సార్లు గెలిచేసరికి కొడాలి నాని లో ఈ ధీమా కనిపించేది. కానీ ఆయన ఆరో ప్రయత్నం దెబ్బతింది. గుడివాడ నుంచి ఓటమి ఎదురైంది. దీంతో అక్కడ సీన్ మారింది. కొడాలి నాని గడ్డం గ్యాంగ్ ఆగడాలకు చెక్ పడింది. వారి ఆధీనంలో ఉన్న భూములు ఒక్కొక్కటి బాధితుల చేతుల్లోకి తిరిగి వస్తున్నాయి.2004 నుంచి కొడాలి నాని గుడివాడలో గెలుస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. టిడిపి…

Read More

పరిపాలనపై పట్టు సాధించని రేవంత్ | Revanth who has not mastered the administration | Eeroju news

హైదరాబాద్, జూన్ 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో పరిపాలన ఇంకా  గాడిన పడలేదు.  ప్రభుత్వం ఇంకా కిందా మీదా పడుతోంది. ప్రతీ విషయంలోనూ వివాదాస్పదమవుతోంది. మద్యం బ్రాండ్ల విషయంలో ఏం జరిగిందో అంతా గందరగోళంగా మారిపోయింది.  అధికారంలోకి వచ్చిన తర్వాతే పాఠ్యపుస్తకాలు ప్రింటింగ్ చేసినా.. అందులో సీఎం కేసీఆర్ అంటూ పేజీలు ముద్రించారు. అవి పంపిణీకి వచ్చే వరకూ ఎవరూ గుర్తించలేదు. మరో వైపు గత ప్రభుత్వంలో అవినీతి పై జరుగుతున్న విచారణల్లో ఒకరు ముందు.. మరొకరు వెనక్కి లాగుతున్నారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పూర్తి పట్టు లేదన్న అభిప్రాయం కలుగుతుంది. అదే నిజమని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటే ఓ వ్యక్తి కాదు. వ్యవస్థ. మొత్తం…

Read More

టీటీడీకి కొత్త ఈవో నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు | Appointment of new EO for TTD, Govt orders | Eeroju news

తిరుమల, జూన్ 15, (న్యూస్ పల్స్) తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించింది. తాజాగా టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.టీటీడీ ఈవోను మార్చుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జే శ్యామల రావు 1997కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఈయన్ను దేవాదాయ శాఖలోని రెవెన్యూ విభాగానికి బదిలీ చేస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించింది. వెంటనే ఇప్పటివరకూ ఉన్న ఈవో ఏవీ ధర్మారెడ్డిని రిలీవ్ చేసింది.…

Read More