ట్రిపుల్ ఐటి ఛాన్స్ లర్ ను అడ్డుకున్న ఉద్యోగులు | Employees who obstructed the triple IT chancellor | Eeroju news

నూజివీడు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆర్జీయుకేటీ ఛాన్స్ లర్  కేసి రెడ్డిని ఉద్యోగులుఅడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హాయాంలో యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందంటూ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఛాన్స్ లర్ వాహానాన్ని అడ్డుకుని, క్యాంపస్ లోకి రానివ్వకుండా గోబ్యాక్ నినాదాలతో ట్రిపుల్ ఐటీ గేట్లు వద్ద స్టాఫ్ బైఠాయించారు. ఆరు సంవత్సరాల నుండి జీతాలు పెంచకుండా, ఉద్యోగుల జీవితాలు నాశనం చేశారంటూ ప్లకార్డులతో క్యాంపస్ లో ఆందోళనకు దిగారు.

Read More

బాబు, పవన్ చిత్రపటాలకు పాలభిషేకం | Palabhishekam for the pictures of Babu and Pawan | Eeroju news

అవనిగడ్డ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విళయతాండవం చేస్తున్న తరుణంలో ఆర్ధికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేయడంతో అవనిగడ్డ రాజీవ్ గాంధీ చౌక్ లో డీఎస్సీ నిరుద్యోగులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఎప్పుడు డీఎస్సీ ప్రకటిస్తారా, తమ జీవితాలలో ఎప్పుడు వెలుగులు నింపుతారా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు…

Read More

చిరుత దాడి | Leopard attack | Eeroju news

పరిగి చిరుత దాడిలో వ్యక్తి గాయపడ్డ ఘటన గురువారం రాత్రి వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం  కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తి పెంటల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ  గ్రామ సమీపంలో గిరిజన ఆశ్రమ పాఠశాల వెనకాల బహిర్భూమి కోసం వెళ్లిన శేఖర్ చెయ్యి పై చిరుత దాడి చెయ్యడంతో రక్త గాయాలు కావడం జరిగిందని అన్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. చిరుత అడవిలోకి వెళ్లినట్లు తెలిపాడు బాదితుడు శేఖర్. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత ఆనవాళ్లను గుర్తించి బోన్ లో బంధించి తీసుకువెళ్లాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Read More

మహిళా శక్తి పథకం..ఆరంభం | Mahila Shakti Scheme..start | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్‎లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎస్. ఇప్పటికే, అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్…

Read More

ఇక 4 వైపుల నుంచి నారాయణుడి దర్శనం | Darshan of Narayan from 4 sides | Eeroju news

పూరీ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఇక నలు దిక్కుల వ్యాపించిన నారాయణుడిని, నాలుగు ద్వారాల నుంచి వచ్చి భక్తితో నమస్కరించుకోవచ్చు.ఒడిశాలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. తన ఎన్నికల హామీని నెరవేర్చుకుంది.  పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ సర్కార్‌, ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పూరీ జగన్నాథ ఆలయంలో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కొవిడ్‌ టైమ్‌లో అప్పటి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, వీటిలో మూడింటిని మూసివేశారు. వాటిని అప్పటినుంచి తెరవలేదు. మూతపడ్డ ప్రవేశ ద్వారాలు.. ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎట్టకేలకు ఈ ద్వారాలను బీజేపీ సర్కార్‌ ఓపెన్‌ చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ,…

Read More

వాట్ నెక్స్ట్… చంద్రబాబు… | What next… Chandrababu… | Eeroju news

గుంటూరు, జూన్ 14, (న్యూస్ పల్స్) నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసేశారు. ఎక్కువ టైమ్ తీసుకోకుండా తన మంత్రివర్గ కూర్పును కూడా కంప్లీట్ చేసేశారు. ఎలాంటి పంచాయితీలు లేకుండా ఈ విషయాన్ని తెగ్గొట్టేశారు చంద్రబాబు. బంపర్ విక్టరీని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయిపోయింది.. సంబరాల సమయం ముగిసింది. మరి వాట్ నెక్ట్స్‌? చంద్రబాబు ఎలాంటి రాష్ట్రాన్ని లీడ్ చేయబోతున్నారు? ఆయన ముందున్న సవాళ్లేంటి? ఇచ్చిన హామీల అమలు సంగతేంటి?మధ్యలో పదేళ్ల తేడా ఉంది. కానీ రాష్ట్రం మాత్రం అప్పుడెలా ఉందో.. ఇప్పుడలానే ఉందన్న ప్రచారం ఉంది. రాజధాని లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు. ఇందులో మొదటి టర్మ్‌లో చంద్రబాబు కనుసన్నల్లోనే పాలన జరిగింది. నెక్ట్స్‌ టర్మ్‌లో జగన్‌ రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన కేవలం సంక్షేమ పథకాలపైనే ఫోకస్ చేశారు తప్ప.. అభివృద్ధి చేసింది ఏం…

Read More

మోడీలో మార్పు మంచిదేనా… | Is change in Modi good? | Eeroju news

విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిపోయారు. ఒకప్పటి మోడీ వేరు.. ఇప్పుడు మోదీ వేరు. అప్పటి మోదీ ఎలా ఉండేవారు.. మోదీని ఇలా ఎప్పుడు చూసి ఉండరు. నిజానికి ఆయన ఏదైనా బహిరంగ సభల్లో పాల్గొంటే చాలా సీరియస్‌గా ఉంటారు. అందరికి వందనాలు చేసి.. చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోతారు. కానీ చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపించారు. ఆయన చాలా యాక్టివ్‌గా కనిపించారు. వేదికపై అటు, ఇటూ తిరుగుతూ కనిపించారు. చంద్రబాబుతో ఫస్ట్‌ నుంచి లాస్ట్ వరకు ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఆఖరికి కార్యక్రమం ముగిసిన తర్వాత అయితే మోదీ ఓ చిన్న పిల్లాడిలా మారిపోయారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. చిరంజీవితో ఓ ఫోటో దిగాలని కోరారు. దీనికి ఓకే చెప్పిన మోదీ.. పవన్‌ వెళ్లి మోదీని…

Read More

ప్రైవేట్ పాఠశాలలో అనధికార పుస్తకాలు సీజ్ | Seize unauthorized books in private school | Eeroju news

టెక్కలి శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలోని “ఇన్ ఫాంట్ జీసస్” స్కూల్లో గురువారం విద్యా శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టెక్కలి డిప్యూటీ డీఈఓ పీ.విలియమ్స్, ఎంఈఓ డీ.తులసీరావు లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 1 నుంచి 10వ తరగతులకు సంబంధించి ప్రైవేట్ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నోటుపుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించి సీజ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read More

ఫామ్ ఆయిల్ ద్వారా అధిక లాభం | High profit through farm oil | Eeroju news

పెద్దపల్లి రైతులు ఫామ్ ఆయిల్ పంట ద్వారా  అధిక లాభం పొందవచ్చని, ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, విదేశాల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి లో జిల్లా ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరైన రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చునని, ఈ పంట ద్వారా రైతులకు తాలు, కట్టింగ్ వంటి సమస్యలు లేవని, ప్రభుత్వం ప్రొచ్చహకంగా సబ్సిడీ అందిస్తుందని, ఈ పంటకు సంబందించిన విత్తనాలు, మలేషియా నుండి దిగుమతి చేసుకుని రైతులకు సబ్సిడీ గా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడ త్వరలో ప్రభుత్వం సహకారంతో కంపెనీని ప్రారంభిస్తామని అన్నారు.…

Read More

ఇంకా సీఎం కేసీఆరే… | And CM KCR… | Eeroju news

భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  చర్ల మండలం పులిగుండాల గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడి నిర్వకం ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా ఇంకా ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి ఉన్నట్లుగానే బడిబాట కార్యక్రమంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పాఠశాల గోడకి కట్టడమే కాకుండా ఊరంతా మరో ఫ్లెక్సీతో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించటంతో ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పులి గుండాల గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలో  అధికారంలో ఉన్న ప్రభుత్వమేంటో విద్యాశాఖ మంత్రెవరో, ముఖ్యమంత్రేవరో తెలియని ఈ టీచర్లు మా బిడ్డలకు ఏం చదువులు చెప్పి మా భవిష్యత్  మార్చుతారని ఇలాంటి టీచర్లను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు…

Read More