రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ జనచైతన్య లేఔట్‌లో 4 పార్కుల స్థలాలకు విముక్తి మొత్తం 19,878 గజాల స్థలం కబ్జా నుంచి విడిపింపు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసిన వారికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) గట్టి షాక్ ఇచ్చింది. రాజేంద్రనగర్ పరిధిలో ఏకంగా రూ. 139 కోట్లకు పైగా విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ ఉదయం ఒక భారీ ఆపరేషన్ నిర్వహించి, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. వివరాలు: రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాలలో సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో హుడా (HUDA) ఆమోదంతో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, 2 లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ లేఅవుట్‌లో ప్రజల అవసరాల కోసం కేటాయించిన నాలుగు…
Read MoreTag: Hydra
HMDA : హెచ్ఎండీఏ (HMDA) కమిషనర్ రంగనాథ్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్తబ్ధతకు కారణాలు హైడ్రా (HYDRA) కాదు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్తబ్ధతపై రంగనాథ్ స్పష్టత మార్కెట్ నెమ్మదించడానికి హైడ్రా కారణం కాదన్న హైడ్రా కమిషనర్ పెరిగిపోయిన అన్-సోల్డ్ ఇన్వెంటరీ, తగ్గిన ఎన్నారై పెట్టుబడులే అసలు కారణం గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) తీసుకుంటున్న చర్యలే కారణమంటూ వస్తున్న ఆరోపణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గట్టిగా ఖండించారు. మార్కెట్ నెమ్మదించడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని, కేవలం తమపై నిందలు మోపడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ నెమ్మదించడానికి గల ప్రధాన కారణాలు: ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో డిమాండ్‌కు మించి సప్లై ఉందని రంగనాథ్ వివరించారు. ఈ అంశాలను ఆయన ప్రస్తావించారు: భారీ అన్-సోల్డ్ ఇన్వెంటరీ:…
Read MoreHYDRA : హైడ్రా కూల్చివేతలు: దసరా తర్వాత కొండాపూర్ బిక్షపతి నగర్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్ కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో హైడ్రా కూల్చివేతలు దసరా పండుగ ముగిసిన మరుసటి రోజే అధికారుల చర్యలు ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలంటూ ఇళ్ల తొలగింపు నగరంలో మరోసారి కూల్చివేతలు కలకలం సృష్టించాయి. దసరా పండుగ ముగిసిన మరుసటి రోజు, శనివారం తెల్లవారుజామున, కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో హైడ్రా (HYDRA) అధికారులు నిర్మాణాల తొలగింపు చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారనే కారణంతో అక్కడ ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయాన్నే భారీ పోలీసు బందోబస్తుతో హైడ్రా అధికారులు బిక్షపతి నగర్‌కు చేరుకున్నారు. బుల్డోజర్లు, ప్రొక్లెయినర్ల సహాయంతో నిర్మాణాలను వేగంగా తొలగించడం మొదలుపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కూల్చివేతలు జరుగుతున్న…
Read MoreHYDRA : ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న హైడ్రా.. ఇప్పుడు ప్రజల ప్రశంసలు అందుకుంటోంది
14 నెలల్లోనే హైడ్రా అద్భుత పనితీరు రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాల భూముల స్వాధీనం కనుమరుగైన బతుకమ్మ కుంటకు ఐదు నెలల్లోనే పునరుజ్జీవం ఒకప్పుడు తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా – HYDRA) ఇప్పుడు అదే ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కేవలం 14 నెలల కాలంలోనే ప్రభుత్వానికి చెందిన సుమారు రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాల భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి తన సత్తా చాటింది. దీంతో, మొదట్లో హైడ్రాను వ్యతిరేకించిన వారే ఇప్పుడు దాని పనితీరుకు జేజేలు పలుకుతున్నారు. హైడ్రా ఏర్పాటు, లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. ఐపీఎస్…
Read MoreHyderabad : హైదరాబాద్‌లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి… రూ.15 వేల కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం స్వాధీనం చేసుకున్న భూముల విలువ సుమారు రూ.15 వేల కోట్లు ఆక్రమణల వెనుక రాజకీయ నేతలు, రియల్టర్లు, అధికారుల హస్తం హైదరాబాద్‌లోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, గాజులరామారంలో దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు, రియల్టర్లు, కొందరు ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న ఈ అక్రమాలకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అడ్డుకట్ట వేసింది. గత ఆరు నెలలుగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా లోతైన విచారణ జరిపింది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు తీసుకుంది. గాజులరామారంలోని సర్వే నంబర్ 307 సహా ఇతర సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను, లేఅవుట్లను…
Read MoreMadhapur : మాదాపూర్ సున్నం చెరువు: భూగర్భ జలాలు కూడా కలుషితం
Madhapur : మాదాపూర్ సున్నం చెరువు: భూగర్భ జలాలు కూడా కలుషితం:హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లోని సున్నం చెరువు నీరు ఇటీవలి అధ్యయనంలో అత్యంత ప్రమాదకరంగా మారినట్లు వెల్లడైంది. ఈ చెరువు నీటిలో సీసం (లెడ్) పరిమితికి మించి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సున్నం చెరువుపై ‘హైడ్రా’ అధ్యయనం హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లోని సున్నం చెరువు నీరు ఇటీవలి అధ్యయనంలో అత్యంత ప్రమాదకరంగా మారినట్లు వెల్లడైంది. ఈ చెరువు నీటిలో సీసం (లెడ్) పరిమితికి మించి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా, ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు సైతం ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని ఆరు ప్రధాన చెరువుల పునరుద్ధరణకు ‘హైడ్రా’ (Hydra) సంస్థ నడుం బిగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా…
Read MoreHyderabad:ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల లెక్కలు తీస్తున్న హైడ్రా
Hyderabad:ఓఆర్ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కాలువలు, నాలాల పరిస్థితి ఏంటి..? అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తోంది.ఈ క్రమంలో ఎన్ ఆర్ ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల లెక్కలు తీస్తున్న హైడ్రా హైదరాబాద్, ఏప్రిల్ 12 ఓఆర్ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కాలువలు, నాలాల పరిస్థితి ఏంటి..? అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తోంది.ఈ క్రమంలో ఎన్ ఆర్ ఎస్ సీ…
Read MoreHyderabad:హైడ్రాకు హైకోర్టు తలంటు పెద్దవాళ్లవి మీకు కనపించవా
Hyderabad:హైడ్రాకు హైకోర్టు తలంటు పెద్దవాళ్లవి మీకు కనపించవా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పటికే వందల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే హైడ్రా పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తుందని.. డబ్బున్న బిల్డర్లను వదిలేసి పేదల ఇండ్లను కూల్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. పలు సందర్భాల్లో హైకోర్టు హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకు హైకోర్టు తలంటు పెద్దవాళ్లవి మీకు కనపించవా హైదరబాద్, మార్చి 20 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పటికే వందల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే హైడ్రా పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తుందని.. డబ్బున్న బిల్డర్లను వదిలేసి పేదల ఇండ్లను…
Read MoreHydra ; రెడీ అవుతున్న హైడ్రా యాప్
రెడీ అవుతున్న హైడ్రా యాప్ హైదరాబాద్, డిసెంబర 26, (న్యూస్ పల్స్) చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఏర్పాటైన హైడ్రా.. భవిష్యత్తు తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో నిర్మాన అనుమతితో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 27 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి సంచలనం సృష్టించిన రంగనాథ్.. పలు జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యర్థనపై ఆయన స్పష్టమైన వివరణిచ్చారు.హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎఫ్‌టీఎల్‌లో…
Read MoreHydra | రియల్ మార్కెట్ కు హైడ్రా భరోసా | Eeroju news
రియల్ మార్కెట్ కు హైడ్రా భరోసా హైదరాబాద్, నవంబర్ 21, (న్యూస్ పల్స్) Hydra హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్లంప్‌నకు కారణంగా హైడ్రా విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా భయంతో ఇళ్లు కొనాలనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి హైడ్రా చట్టవిరుద్దమన ఒక్క బిల్డింగ్ ను కూడా కూల్చలేదు.ఇంకా చెప్పాలంటే ప్లాన్లు వంటి వాటి జోలికి కూడా వెళ్లలేదు. చెరువు స్థలాల్లో,.. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అనుమతులు లేని భవనాలనే కూల్చారు. బడా బాబుల ఫామ్ హౌస్‌లను కూల్చివేసిన తర్వాత మాకూ ఓ హైడ్రా కావాలని జిల్లాల నుంచి పొరుగురాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత హైడ్రాపై జరిగిన ప్రచారం వేరు. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు వేచి చూడాలనే భావనకు వచ్చారు.…
Read More