Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు

YS Viveka murder case

0

హైకోర్టులో భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి బెయిల్ పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్రెడ్డి, గజ్జల ఉదయ్కుమార్రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  గత జూన్ 9న సీబీఐ కోర్టు వారి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. భాస్క్ర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ  హైకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది.

Ajeya Kalam Petition అజేయ కల్లం పిటిషన్ అర్హతపై వాదనలు పూర్తి..నిర్ణయం వాయిదా వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్కు అర్హత లేదన్న రిజిస్ట్రీ అభ్యంతరంపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిగింది. తన వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు తప్పుగా నమోదు చేశారని అజేయ కల్లం పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ అర్హతపై వాదనలు పూర్తి కాగా.. నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie