Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

 ఒకే వేదికపై  మోడీ చంద్రబాబు, పవన్

0

గుంటూరు, మార్చి 12 (న్యూస్ పల్స్)
ఏపీ రాజకీయాల్లో 2014 సీన్ రిపీట్ కాబోతుంది. మళ్లీ ఒకే వేదికపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిలకలూరిపేటలో పాల్గొన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేటలోని బొప్పుడి ఆంజనేయస్వామి గుడి పక్కన సుమారు 150 ఎకరాల్లో ఈ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పరిశీలించారు.టీడీపీ, జనసేన ఎన్డీఏలో చేరడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ అందరినీ కలుపుకుని, రాజకీయాలకు బలమైన వేదికగా మారుతోందన్నారు. మోదీ నాయకత్వంపై నమ్మకంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో చేరాయని అమిత్ షా తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నామన్నారు. వీరితో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను వేగవంతం చేస్తుందన్నారు.

ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుపై జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజనతో దశాబ్ద కాలంగా రాజకీయ సంక్షోభం, అర్ధ దశాబ్దం వైసీపీ ప్రభుత్వ విధానాలతో అవినీతి, ఇసుక, విలువైన ఖనిజాల వంటి సహజ వనరుల దోపిడీ మద్యం మాఫియా, దేవాలయాలను అపవిత్రం చేయడం, టీటీడీని ఏటీఎంగా మార్చడం, బెదిరింపులు, సామాజిక, ఆర్థిక రాజకీయ గందరగోళం, ప్రతిపక్ష నాయకులు వారి పార్టీ కేడర్‌పై భౌతిక దాడులు, న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం, వ్యాపారులు , పారిశ్రామికవేత్తలను బెదిరించడం, ఎర్రచందనం స్మగ్లింగ్, 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యం, దళితులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పొత్తుతో వైసీపీ ఓటమి లాంఛనమైందన్నారు. ప్రధాని మోదీ డైనమిక్, డేరింగ్ విజనరీ నాయకత్వంతో వైసీపీ అరాచకాలు ముగుస్తున్నాయన్నారు.బీజేపీ-టీడీపీ-జేఎస్పీ పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీని భాగస్వామ్యం చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు అని తెలిపారు.

ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో పని చేయడానికి, ఏపీ ప్రజల కష్టాలు, బాధలను అంతం చేయడానికి మేమంతా ఎదురుచూస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కేవలం పొత్తు మాత్రమే కాదని, ఏపీ ప్రజలకు, దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్న ముగ్గురు నేతల మధ్య భాగస్వామ్యం అని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలు తమకు సేవ చేసేందుకు చరిత్రాత్మక ఆదేశంతో ఈ కూటమిని ఆశీర్వదిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలకాలని కోరుకుంటున్నామన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie