Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తీవ్రవాదులకు సహకరిస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవాలి యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌

0

ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 16

సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా ఎంతో నష్టపోయామని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ అన్నారు. తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా, పాక్‌ పేర్లను ప్రస్తావించకుండానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూప్‌లు సరిహద్దుల గుండా అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్నాయని.. ఇందులో డ్రోన్లు సైతం ఉన్నాయన్నారు. టెర్రరిస్టు గ్రూప్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బట్టి వారికి ఎవరు సహాయం అందిస్తున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు.ఏ దేశం సహాయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను సేకరించలేరన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉన్నాయన్నారు. నేరాలకు పాల్పడడమే కాకుండా.. కరెన్సీని నకిలీ చేయడం, చెలామణి చేయడం, ఆయుధాలు, మాదకద్రవ్యాలు, సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ఇతర మార్గాలను సరఫరా చేయడం వంటి మార్గాల ద్వారా హాని కలిగిస్తున్నారన్నారు.తీవ్రవాద గ్రూపులు, వారికి మద్దతిచ్చే వారిపై ఐక్యరాజ్యసమితి ఏ మాత్రం సహనం చూపించొద్దని ఆమె కోరారు.

ఉగ్రవాదులు హింసను కొనసాగించేందుకు ఆయుధాలను అందించడం ద్వారానే అతిపెద్ద సహాయాన్ని అందజేస్తున్నామన్నారు.కౌన్సిల్ తీవ్రవాద అంశాల పట్ల, వారికి మద్దతిచ్చే వారి పట్ల ఏమాత్రం సహనం చూపకపోవడం చాలా ముఖ్యమన్నారు. సరిహద్దు ఉగ్రవాదం, అక్రమ ఆయుధాలను ఉపయోగించి ఉగ్రవాద గ్రూపులు చేస్తున్న హింసతో భారతదేశం ఇబ్బంది పడుతుందన్నారు. ఉగ్రవాదులకు చిన్నపాటి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అందించడం వల్ల కలిగే నష్టాలను భారత్‌కు తెలుసునన్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో పెరుగుతున్న ఆయుధాలు చూస్తుంటే ఏ దేశం సహాయం లేకుండా వాళ్లు విజృంభించలేరని అర్థమవుతోంది. డైవర్షన్ పాయింట్లు, ట్రాఫికింగ్ మార్గాలను గుర్తించేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని నొక్కి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie