Andhra Pradesh:విజయవాడ-గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది తీరంలో 34వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న అమరావతి నగరంలో ఇక విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా భాగం కానున్నాయి. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన భూములు ఎన్టీఆర్ జిల్లాలో రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాల్లో స్పోర్ట్స్ సిటీ
విజయవాడ, మే 10
విజయవాడ-గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది తీరంలో 34వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న అమరావతి నగరంలో ఇక విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా భాగం కానున్నాయి. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన భూములు ఎన్టీఆర్ జిల్లాలో రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇక ఎన్టీఆర్ జిల్లా కూడా భాగం కాబోతోంది. కృష్ణానదిలో ఉన్న లంక భూముల్ని స్పోర్ట్స్ సిటీ కోసం సమీకరించాలని భావించిన ప్రభుత్వం తాజాగా ఆ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని ఎన్టీఆర్ జిల్లాలో భూములను సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. అమరావతి పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఒకవైపు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూనే.. పనులు వేగవంతం చేయాలని చూస్తోంది. ఈనెల 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అటు తరువాత నిన్ననే క్యాబినెట్ సమావేశం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా అమరావతి రాజధానిని మున్ముందు కదిలించలేని పటిష్ట స్థితిలోకి చేర్చాలని నిర్ణయించారు. పార్లమెంట్లో గెజిట్ విడుదల చేసి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమరావతి రాజధానికి అనుసంధానంగా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగా స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి దగ్గరగా ఉన్న ఓ నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోందిఅమరావతిలో క్రీడా పరంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వంకృతనిశ్చయంతో ఉంది. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే గుర్తింపు సాధించేలా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో భూములు సేకరించేందుకు గ్రామ సభలు నిర్వహించారు. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. స్పోర్ట్స్ సిటీ కోసం ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నారు.
అంతకుముందు కృష్ణా నదిలో ఉన్న చిన్నలంక, పెదలంక దీవులను సైతం అధికారులు పరిశీలించారు. అవి వరదలకు మునిగిపోయే అవకాశం ఉండడంతో వాటిని వద్దనుకున్నారు. వాటికి దగ్గరలో ఉన్న ఈ నాలుగు గ్రామాలను తాజాగా ఎంపిక చేశారు.మూలపాడు లో ఇప్పటికే రెండు క్రికెట్ మైదానాలు ఉన్నాయి. ఈ ప్రాంతం స్పోర్ట్స్ సిటీకి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. మూలపాడు నుంచి అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అందుకే ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నట్లు సమాచారం. మూలపాడు లోనే అంతర్జాతీయ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. గురువారం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెప్పారు. త్వరలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం దిశగా అడుగులు పడనున్నాయి. ఈ స్పోర్ట్స్ సిటీతోపాటుగా అక్కడే దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఈ నాలుగు గ్రామాలు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. వాటిని అమరావతి పరిధిలోకి తేవాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
అంతకుముందే ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తాము అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ నాలుగు గ్రామాల ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చారు. స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అక్కడే ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రెండు వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాలని కూడా భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకుగాను అధ్యయనం కోసం ఇటీవల మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ టీం గుజరాత్ లోని అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించింది.విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్ని కూడా రాజధానిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.ఎన్టీఆర్ జిల్లాను కూడా అమరావతి రాజధాని పరిధిలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతి నగరానికి కనెక్టివిటీ మొత్తం విజయవాడ మీదుగానే ఉంటుంది.
హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకోడానికి విజయవాడ వరకు ప్రయాణించాల్సి వస్తోంది.రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో స్పోర్ట్స్‌సిటీ కోసం ప్రత్యేకంగా భూముల్ని కేటాయించే పరిస్థితులు లేకపోవడం ప్రత్యామ్నయాల వైపు ప్రభుత్వం దృష్టి సారించింది. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం మండలంలోని త్రిలోచనాపురం, మూలపాడు, కొటికలపూడి, జమీమాచవరం గ్రామాలను అమరావతి పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఎన్టీఆర్ జిల్లాలోని నాలుగు గ్రామాలను కూడా రాజధాని పరిధిలోకి కలిపితే కనీసం 4వేల ఎకరాలు ప్రభుత్వానికి సమకూరుతాయి. ఈ గ్రామాలు ప్రస్తుతం సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఇప్పటికే ఈ భూములకు డిమాండ్ ఉంది. తాజాగా వీటిని రాజధాని పరిధిలోకి తీసుకురావాలని స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు.
అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీ కోసం ఈ భూములను వినియోగిస్తారు. ఇబ్రహీంపట్నం మండలం లోని కొటికలపూడి, మూలపాడు, త్రిలోచనపురం, కేతనకొండ గ్రామాలను ప్రాథవికంగా భూ సమీకరణలో తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ గ్రామాల్లోని భూములను భూ సమీకరణలో ప్రభుత్వం తీసుకుని రాజధానిలో రైతులకు ఇచ్చిన ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నారు.భూ సమీకరణ కోసం రెవెన్యూ అధికారులు నాలుగు గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. భూ సమీకరణ కింద భూములు ఇవ్వడానికి రైతుల నుంచి సానుకూల స్పంద వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. రైతులు తమకు ఇచ్చే ప్యాకేజీ గురించి వివరాలు కోరారు. మరో సమావేశంలో వీటిపై స్పష్టత ఇస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు.ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ, మూలపాడు, త్రిలోచనపురం, జమీమాచవరం ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలన్నీ కృష్ణాతీరానికి సమీపంలో ఉండటం, ఇప్పటికే మూలపాడులో ఏసీఏ క్రికెట్ స్టేడియం ఉండటంతో ఈ ప్రాంతాలను అనువుగా భావిస్తున్నారు.మూలపాడు నుంచే కృష్ణానదిపై అమరావతికి ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ ఇప్పటికే నిర్ణయించింది.హైదరాబాద్ నుంచి వచ్చే వారికి అమరావతి వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం అవుతుంది. మూలపాడులో భూములు అందుబాటులో ఉండటంతో వాటి పక్కనే ఉన్న కొటికలపూడి, జమీమాచవరం, త్రిలోచనాపురం గ్రామాలను కూడా అనువైన ప్రాంతాలుగా నిర్ణయించారు.
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 5 వేల ఎకరాల వరకు అవసరం అవుతాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మూలపాడులో క్రికెట్ స్టేడియం ఉంది.దీనిని ఏసీఏ నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్పోర్ట్స్ సిటీని తొలుత భవానీ ద్వీపానికి ఎగువ ఉన్న కృష్ణానది ద్వీప ప్రాంతాలైన చినలంక, పెదలంక గ్రామాలలో ఏర్పాటు చేయాలని భావించారు. ఈ భూములను ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.
కృష్ణానదిలో ఉండే లంక భూములు వరదల్లో మునిగిపోతుంటాయి. దీనికి తోడు కృష్ణా నదికి ఎగువ రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే ఈ భూములపై ప్రభావం ఉంటుంది. దీంతో లంక భూముల్ని మినహాయించారు.
స్పోర్ట్స్ సిటీలో భాగంగా నాలుగు గ్రామాల్లో అనేక క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తారు. మూలపాడు గ్రామంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ యూనివర్శిటీలో అన్ని క్రీడలకు సంబంధించిన శిక్షణ, క్రీడా గ్రామాలు, కోచ్‌లు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా రంగానికి సంబంధించిన పరిశ్రమలు,ఇతర యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
Read more:Guntur:చర్చానీయంగా జగన్ కామెంట్స్
