Andhra Pradesh:ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. మే 15 నుంచి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.
మే 15 నుంచి టీచర్ల ట్రాన్సఫర్స్
విజయవాడ, మే 12
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. మే 15 నుంచి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.ఏపీలో ఉపాధ్యాయులకు ఈ ఏడాది బదిలీల చట్టం ప్రకారం తొలిసారి నిర్వహించనున్నారు. బదిలీ చట్టాన్ని అంధులైన ఉపాధ్యాయులు హైకోర్టులో సవాలు చేశారు. వారి బదిలీలపై స్టేటస్‌కో విధించింది. ఆ పోస్టులను మినహాయించి, మిగిలిన వాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.ఉపాధ్యాయులు బదిలీల కోసం ఆప్షన్స్ పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తారు. కోర్టు తీర్పుకు లోబడి ఆ తర్వాత అంధులైన ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తారుఉపాధ్యాయుల బదిలీలకు మే 15 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు.
బదిలీల్లో భాగంగా ప్రధానోపాధ్యాయులను మొదట బదిలీ చేస్తారు. ఆ తర్వాత ఖాళీ అయిన స్థానాలు, కొత్తగా అవసరమయ్యే వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు.స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో ఖాళీల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు.ఈ పోస్టుల అవసరం తక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.బదిలీల్లో భాగంగా ఎస్జీటీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తారు. సబ్జెక్టు టీచర్లకు ఆదర్శ పాఠశాలల హెడ్ మాస్టార్లుగా అవకాశం ఇస్తారు.ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్‌ను విద్యాశాఖ సిద్ధం చేసింది. జీఓ-117కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పోస్టులను హేతుబద్ధీకరణ పూర్తిచేశారు.ఈ ఏడాది బదిలీలను ఆన్లైన్లోనే నిర్వహిస్తారు.
మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు, అయిదేళ్ల సర్వీసు పూర్తయిన హెచ్ఎంలకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది.ఉపాధ్యాయులుగా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ సర్వీసు పూర్తయినా ఆప్షన్లను నమోదు చేయకపోతే బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు వారిని బదిలీ చేస్తారు.ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకే పాయింట్లు ఉంటే సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ తర్వాత వయసును పరిశీలిస్తారు.అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు నెలకు ఒకటి చొప్పున గరిష్ఠంగా 10 మైనస్ పాయింట్లు ఉంటాయి.ఖాళీల గుర్తించేది ఇలా… మే 31 నాటికి పదవీ విరమణ చేసిన పోస్టులతో సహా ఖాళీలను భర్తీకి ప్రాతిపదికగా తీసుకుంటారు. ఏడాదికి మించి అనధికారికంగా గైర్హాజరైన టీచర్ల స్థానాలతో పాటు ఉన్నత చదువుల కోసం టీచర్లు సెలవులు తీసుకుంటే వాటిని ఖాళీగా చూపుతారు.
Read more:Tirupati:చిత్తూరు జల్లా నేతల్లో దడే దడ
