Hyderabad:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచింది. ఈ తరుణంలో, పాలనలో సమర్థత, స్థిరత్వం సాధించేందుకు తన కార్యాలయం (సీఎంవో)ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్, ప్రభుత్వ యంత్రాంగంలో క్రమంగా మార్పులు చేస్తూ, తనదైన టీమ్‌ను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎంవోలో కీలక అధికారుల బదిలీలు, నియామకాలతో పాటు శాఖల పునర్విభజన చేపట్టారు.
తన మార్క్ అధికారులపై రేవంత్ గురి
హైదరాబాద్, మే 2
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచింది. ఈ తరుణంలో, పాలనలో సమర్థత, స్థిరత్వం సాధించేందుకు తన కార్యాలయం (సీఎంవో)ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్, ప్రభుత్వ యంత్రాంగంలో క్రమంగా మార్పులు చేస్తూ, తనదైన టీమ్‌ను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎంవోలో కీలక అధికారుల బదిలీలు, నియామకాలతో పాటు శాఖల పునర్విభజన చేపట్టారు.తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏఆడదిన్నర గడిచింది. 18 నెలల పాలనలో అధికారులపై ఇప్పటికీ పట్టు సాధించలేదు. అధికారుల నుంచి కూడా పెద్దగా సహకారం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈతరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి సీఎంవోలో సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఏప్రిల్ 27న 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంవో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన సంగీత సత్యనారాయణను వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా నియమించారు. ఆమె గతంలో వైద్యం, స్త్రీ-శిశు సంక్షేమం, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలను పర్యవేక్షించారు. అలాగే, పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ను సీఎంవోలోకి తీసుకొచ్చి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధి వంటి కీలక బాధ్యతలు అప్పగించారు.
ఈ చర్య రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించినది.సీఎం కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన మూడు నెలల్లో రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన అటవీ, వ్యవసాయం, పశుసంవర్ధక, రవాణా, పంచాయతీరాజ్ శాఖలను చూస్తున్నారు. షానవాజ్ ఖాసిమ్‌ను ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. ఆసక్తికరంగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జేఈవోగా సుదీర్ఘకాలం పనిచేసిన కేఎస్ శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించారు. రిటైరైన ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తమ పదవుల్లో కొనసాగుతారు. ఈ అధికారులు సీఎం సన్నిహిత బృందంగా కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మార్పులతో సీఎంవో సమర్థవంతమైన పాలనకు బలమైన పునాది వేస్తోందిరేవంత్ రెడ్డి సీఎంవో ప్రక్షాళన ద్వారా పాలనలో సమర్థత, పారదర్శకతను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. కీలక బదిలీలు, అనుభవజ్ఞుల నియామకాలతో తెలంగాణ పాలన యంత్రాంగం మరింత బలపడనుంది.
