Visakhapatnam :పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదుల నుంచి దాడులు ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన నగరాలతో పాటు వీరప్రాంతాలపై దృష్టి పెట్టాయి.
సాగర తీరంపై నిఘా
పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదుల నుంచి దాడులు ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన నగరాలతో పాటు వీరప్రాంతాలపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా విశాఖ నగరం పై దృష్టి సారించింది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు ఉంది. సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరు గడించిన విశాఖ ఉన్నది సముద్ర తీర ప్రాంతంలోనే. అందుకే ఉగ్రదాడులకు అవకాశం చాలా ఎక్కువ. అందుకే కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అడుగడుగునా నిఘా పెంచింది.ప్రస్తుతం విశాఖ నగరాన్నిపోలీసులు జల్లెడ పడుతున్నారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోదాలు జరుపుతున్నారు. విశాఖలో అణువణువు గాలిస్తున్నారు.
నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖ నగరవ్యాప్తంగా పోలీస్ తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానితులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. విశాఖలో ప్రతి కూడలి వద్ద పోలీసుల పహారా పెరిగింది. ప్రయాణికులపై అనుమానం వస్తే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వారి ప్రయాణ వివరాలను తెలుసుకుంటున్నారు.అయితే విశాఖ నగరంపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడానికి గత అనుభవాలు ఒక కారణం. 1971లో విశాఖ టార్గెట్ గా పాకిస్తాన్ జలాంతర్గామితో దాడి చేసింది. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సున్నితమైన ప్రదేశాలలో నిఘా పెంచడమే కాదు.. పోలీసులు నగరాన్ని పహారా కాస్తున్నారు. దేశ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉంది. విశాఖ నగరంలోని పోర్టు ఏరియాతో పాటు సముద్ర తీర ప్రాంతం పై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు.సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం విశాఖ సొంతం. నార్త్ కోస్టల్ ఏరియా గా విశాఖకు పేరు ఉంది. సు విశాలమైన పోర్టు ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఉన్నాయి. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు ఉంది. అందుకే పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్రం హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో విశాఖ నగరంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అందుకే సర్వత్రా నగరవాసుల్లో ఆందోళన నెలకొంది.
Read more:Yoga : 5 లక్షల మందితో యోగా ఈవెంట్
