Nizamabad : మరో హైవే విస్తరణకు మోక్షం

Another highway expansion is a salvation

Nizamabad : తెలంగాణలో మరో హైవే విస్తరణకు మోక్షం లభించింది. నిజామాబాద్‌- జగ్దల్‌పూర్‌ జాతీయ రహదారి (NH-63) విస్తరణ పనులకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు లభించాయి. దీంతో ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారంపై కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లగా.. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరో హైవే విస్తరణకు మోక్షం

నిజామాబాద్, జూన్ 3
తెలంగాణలో మరో హైవే విస్తరణకు మోక్షం లభించింది. నిజామాబాద్‌– జగ్దల్‌పూర్‌ జాతీయ రహదారి (NH-63) విస్తరణ పనులకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు లభించాయి. దీంతో ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారంపై కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లగా.. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇది ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల మీదుగా మంచిర్యాల వద్దనున్న క్యాతన్‌పల్లి వరకు కొనసాగుతుంది.2016లో కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు కింద గ్రీన్‌ ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రాయపట్నం గోదావరి వంతెనకు సమాంతరంగా కొత్తపల్లి వద్ద మరో నూతన వారధిని నిర్మించనున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ  జనావాసాలకు దూరంగా.. కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూముల గుండా సాధ్యమైనంత తక్కువ భూసేకరణతో ఈ విస్తరణ పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది.

గత ఏడాది అక్టోబరులో  శాటిలైట్ సర్వే నిర్వహించింది. అనంతరం నిజామాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు రైతులతో సమావేశమై భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు.జిల్లాలో 30 గ్రామాల్లోని 240 మంది రైతుల నుంచి సుమారు 250 హెక్టార్ల భూమిని సేకరించారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌ నుంచి వెల్గటూర్‌ మండలం స్తంభంపల్లి వరకు భూసేకరణ దాదాపు పూర్తయింది. భూములు కోల్పోతున్న రైతులు, భూముల వివరాలతో పాటు తుది అవార్డుల ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో నష్ట పరిహారం జమ కానుంది. గత నెలలో ధర్మపురి మండలంలో కొందరు రైతులు తమ వ్యవసాయ బావులు నమోదు కాలేదని కలెక్టరుకు ఫిర్యాదు చేయగా.. రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి వాటిని నమోదు చేశారు. ఈ రహదారి నిర్మాణం పట్టణాలను తాకకుండా బైపాస్‌లతోనే ముందుకు సాగనుంది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు జగిత్యాల మీదుగా నిర్మించే ఈ రహదారికి కేంద్రం రూ.2,529 కోట్లు కేటాయించింది. మొత్తం 125 కి.మీ పొడవునా గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డును నిర్మించనున్నారు. త్వరలోనే తుది అవార్డును ప్రకటించి.. టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రహదారి పూర్తయితే నిజామాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది, ఇది ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

Read more:Secunderabad : సికింద్రాబాద్ కు సమ్మర్ ట్రైన్స్

Related posts

Leave a Comment