Sunny Yadav : అడ్డంగా బుక్కైన సన్నీ.

bayya Sunny Yadav

Sunny Yadav :భయ్యా సన్నీ యాదవ్ .. ఈపేరు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతోంది. మీడియా ఛానెల్స్ అయితే వరుస కథనాలతో ఓ రేంజ్ లో ఉతికి ఆరేస్తున్నాయి. తెలంగాణలో నల్గొండ జిల్లాకు చెందిన ఇతను ఓ యూట్యూబర్. బైక్ రైడర్. దేశ , విదేశాలకు బైక్ పై తిరుగూ అక్కడ సంస్కృతీ సంప్రదాలను ఎక్స్ ఫ్లోర్ చేస్తూ వీడియోలు చేస్తుంటాడు.

అడ్డంగా బుక్కైన సన్నీ.

హైదరాబాద్,  జూన్ 2
భయ్యా సన్నీ యాదవ్ .. ఈపేరు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతోంది. మీడియా ఛానెల్స్ అయితే వరుస కథనాలతో ఓ రేంజ్ లో ఉతికి ఆరేస్తున్నాయి. తెలంగాణలో నల్గొండ జిల్లాకు చెందిన ఇతను ఓ యూట్యూబర్. బైక్ రైడర్. దేశ , విదేశాలకు బైక్ పై తిరుగూ అక్కడ సంస్కృతీ సంప్రదాలను ఎక్స్ ఫ్లోర్ చేస్తూ వీడియోలు చేస్తుంటాడు. అలా తీసిన వీడియోలను భయ్యా సన్నీ యాదవ్ పేరుతో ఉన్నయ్యూట్యూబ్ ఛానెల్ లో పబ్లిష్ చేస్తుంటాడు. ఈ నేపధ్యంలో ఇటీవల సన్నీ బైక్ పై పాకిస్దాన్ వెళ్లాడు. అక్కడ వివిధ ప్రాంతాలు తిరుగూ వీడియోలు చేసాడు. ఇప్పుడు ఈ పర్యటన వివాదంగా మారింది. ఎన్ ఐఏ కి అనుమానం రావడంతో సన్నీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం..హర్యానాకు చెందిన జ్యోతి మల్మోత్రాను ఇటీవల ఎన్ ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబర్ ముసుగులో దేశభద్రతకు ముప్పువాటిల్లే సమాచారం పాక్ ఉగ్రవాదులకు లీక్ చేసిందనే ఆరోపణలపై జ్యోతి మల్మోత్రా ఎన్ ఐఏ అదుపులో ఉంది. విచారణ జరుగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా అదే కోవలోకి భయ్యా సన్నీ యాదవ్ చేరారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఇటీవల బైక్ పై పాకిస్తాన్ వెళ్లిన సన్నీయాదవ్ సుమారు ఆరునెల పాటు పాకిస్తాన్ లో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ,వీడియోలు చేస్తూ ..సరిగ్గా పెహల్గామ్ దాడికి 12రోజులు ముందుగా పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం.వ్లాగర్ అన్నాక మరో దేశం వెళ్లడం తప్పులేదని అనుకోవచ్చు. కానీ సరిగ్గా ఏడు నెలల క్రితం పాకిస్తాన్ లో జకీర్ నాయక్ తో భయ్యా సన్నీ యాదవ్ ఓ సమావేశంలో పాల్గొనడం, అక్కడ జకీర్ తో వన్ టూ వన్ మాట్లడటం పెనుదుమారం రేపుతోంది. ఎందుకంటే ఈ జకీర్ నాయక్ ఓ ముస్లిం మత ప్రభోధకుడు. ఇతని ప్రసంగాలు మతాల మధ్య విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉండటంతో భారత్ ఇతనిని దేశ బహిష్కరణ చేసింది. ఇతని వీడియోలను నిషేధించింది. అంతేకాదు జకీర్ పై ఎన్ ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు సైతం ఇచ్చింది. కానీ అరెస్ట్ నుంచి తప్పించుకుని ఇతర దేశాల పౌరసత్వం సాకుగా చూపి తిరుగున్నాడు ఈ దేశ శత్రువు. అంతలా భారత్ లో ఆంక్షలు విధించిన జకీర్ తో గత ఏడాది అక్టోబర్ 28వ తేదిన పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సన్నీ యాదవ్ కలిశారు. జకీర్ ప్రసంగిస్తున్న సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో అనేక అనుమానాలు బలపడుతున్నాయి.

జకీర్ సమావేశంలో సన్నీయాదవ్ జకీర్ ను ఓ ప్రశ్న అడుగుతాడు. హిందూ ధర్మం ప్రపంచానికి చాలా ఇచ్చింది. యోగా పేరుతో పిట్ నెస్, ఆయుర్వేదంతో ఆరోగ్యం, వేదా ద్వారా జ్జానాన్ని ఇస్తోంది. మరి మీ ఖురాన్ ప్రపంచానికి ఏం ఇస్తుంది..? అనే ప్రశ్న జకీర్ ను అడుగుతాడు సన్నీ యాదవ్. జకీర్ మాట్లడుతూ.. మీ హిందువుల్లో ఎంతమంది యోగా చేస్తున్నారు అని సన్సీని ప్రశ్నిస్తాడు. 1లేదా 2శాతం ఉంటారని సన్నీ సమాధానం చెబుతాడు. జకీర్ మాట్లడుతూ.. మా ముస్లింలు రోజులో ఐదుసార్లు ఖురాన్ చుదువుతారంటూ మొదలు పెట్టి ఖురాన్ ప్రసిద్ది గురించి, హిందూ ధర్మంతో పోల్చుతూ అవహేళన చేసేలా మాట్లడతాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.జకీర్ సమావేశంలో సన్నీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జకీర్ సమవేశం అంటే ప్రత్యేకంగా ఓ మతానికి చెందిన అంతరంగిక సమావేశంలా ఉంటుంది. అతి కొద్దిమందిని మాత్రమే జకీర్ తో మాట్లడేందుకు అనుమతిస్తారు.

సమావేశానికి ఇతర మతస్దులను రానివ్వరు. ఈ నేపధ్యంలో సన్నీ ఎలా ఈ సమావేశంలోనికి వెళ్లగలిగాడు. నేరుగా జకీర్ ను ప్రశ్నించాడంటే ఆ ప్రశ్నల వెనుక ఎవరున్నారు..? ఒక్కడుగా అంత సహసం చేయలేడు. అంతలా నమ్మకంగా ఉన్నాడంటే సన్నీ యాదవ్ వారికి ఏం సహకరిస్తున్నాడు. ఇవే అనుమానాలు ఈరోజు ఎన్ ఐఏ అదుపులో సన్నీ యాదవ్ విచారణ ఎదుర్కొనే పరిస్దితికి తీసుకొచ్చాయి.సన్నీ యాదవ్ ను ఎన్ ఐఏ అదుపులోకి తీసుకున్న తరువాత సన్నీ తండ్రి మీడియాతో మాట్లడుతూ ఫిబ్రవరి నెలలో నా కొడుకు సన్నీ పాకిస్తాన్ వెళ్లాడు. నెలన్నర మాత్రమే ఉండి మార్చిలో ఇండియా వచ్చేశాడని చెబుతున్నాడు. ఫిబ్రవరిలో వెళితే అక్టోబర్ లో జకీర్ తో సమావేశంలో ఎలా సన్నీ పాల్గొన్నాడు..? ఇదిలా చెన్నైలో తన స్నేహితుడు చెర్రీ మాట్లడుతూ సన్నీ యాదవ్ నన్ను కలవడానికే చెన్నై వచ్చాడని ,తప్పుడు ప్రచారం చేయొద్దంటూ , నిన్న ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈరోజు జకీర్ వీడియో వైరల్ కావడంతో, తాను పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేసేశాడు చెర్రీ. ఇలా ఎందుకు చేశాడు. ఇవే అనేక అనుమానాలకు తావిస్తోంది. జ్యోతి మల్హోత్రాలా సన్నీ కూడా పాక్ తీవ్రవాదులతో చేతులు కలిపాడా, లేక కాకతాళియంగా ఇవన్నీ జరిగాయా అనేది ఎన్ ఐఏ విచారణలోనే తేలాల్సి ఉంది.

Read more:Turkey : టర్కీ ఆర్థికం..అతలాకుతలం

Related posts

Leave a Comment