Telangana : రైతులకు నెలనెలా 3 వేలు పెన్షన్ స్కీమ్

Monthly pension scheme of Rs 3,000 for farmers

Telangana : కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకాలు కొన్ని నేరుగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. మరి కొన్ని పథకాలు రైతులకు వృద్ధాప్యంలో అవసరమైన రక్షణగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఒక అద్భుతమైన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.

రైతులకు నెలనెలా 3 వేలు పెన్షన్ స్కీమ్

హైదరాబాద్, జూన్ 3
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకాలు కొన్ని నేరుగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. మరి కొన్ని పథకాలు రైతులకు వృద్ధాప్యంలో అవసరమైన రక్షణగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఒక అద్భుతమైన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులందరికీ ప్రతినెలా ఈ పథకం కింద ₹3,000 పెన్షన్ వస్తుంది. 60 ఏళ్ల వయసు పైబడిన రైతులందరూ కూడా ప్రతి నెల కేంద్రం అందిస్తున్న ఈ పెన్షన్ అందుకోవచ్చు. రైతులకు వృద్ధాప్యంలో ఇది ఒక ఆర్థిక భరోసాగా అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న ఈ ప్రత్యేక పెన్షన్ పథకానికి ఇప్పటివరకు దేశంలో లక్షలాది మంది రైతులు ప్రారంభించారు. అయితే ఈ పథకంలో కొన్ని ముఖ్యమైన అర్హతలు కూడా ఉన్నాయి. కనీసం 18 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. గరిష్టంగా 40 ఏళ్లు. మీరు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో ఎంత త్వరగా చేరినట్లయితే మీరు అంత తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఈ పథకంలో 18 ఏళ్ల వయసులో చేరినట్లయితే నెలకు మీరు చాలా తక్కువగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 40 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో ఈ పథకంలో చేరితే మీరు నెలకు రూ.220 చెల్లించాలి. ఒకవేళ మీరు 30 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరినట్లయితే మీరు కనీసం రూ.110 చెల్లిస్తే చాలు. మీకు 60 ఏళ్ల వయసు వచ్చేవరకు మీరు ప్రతి నెల ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి. మీకు 60 ఏళ్ళు నిండిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ప్రతినెలా మీకు రూ.3000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది.అంటే మీ ఖాతాలో ఏడాదికి రూ.36,000 వస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రమాణికమైన స్కీం కావడంతో మీకు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ పథకంలో మీరు చేరాలంటే తప్పనిసరిగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన నిధి యోజన లిస్టులో మీ పేరు ఉండాలి. ప్రభుత్వం నుంచి మీరు ఇప్పటికే రైతుగా గుర్తింపు పొందిన వాళ్లు అయి ఉండాలి. ఈ లిస్టులో మీ పేరు లేకపోతే మీరు ఈ పథకంలో చేరడం కుదరదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రత్యేక పథకం కేవలం చిన్నస్థాయి రైతుల కోసం రూపొందించబడింది.

Read more:YSRCP : సంచలనాలు బయటపెట్టిన వైసిపి మాజీ ఎమ్మెల్యే!

Related posts

Leave a Comment