Andhra Pradesh:కలకలం రేపుతున్న సర్వే

Praveen Pullata made a sensational tweet about the performance of MLAs in the coalition government.

Andhra Pradesh:ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతోంది. ప్రభుత్వం పాలనతో పాటు సంక్షేమ పథకాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు నేరుగా ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావడం లేదు.

కలకలం రేపుతున్న సర్వే

విజయవాడ, ఏప్రిల్ 30
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతోంది. ప్రభుత్వం పాలనతో పాటు సంక్షేమ పథకాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు నేరుగా ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావడం లేదు. తాజాగా విలువడిన ఓ సర్వే ఈ విషయాన్ని చెబుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసారి కూటమి కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని చెప్పిన సర్వే నిపుణుల్లో ప్రవీణ్ పుల్లట ఒకరు. ఆయన చెప్పిన అంచనాలు ఎన్నికల్లో దాదాపు నిజమయ్యాయి. దీంతో కూటమి ఘనవిజయం సాధించింది. అయితే ఇప్పుడు అదే ప్రవీణ్ పుల్లట కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరుపై సంచలన ట్వీట్ చేశారుకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చాలామంది పనితీరు ఆశాజనకంగా లేదని ఇప్పటికే పలుమార్లు ట్వీట్ల రూపంలో తన సర్వే అంశాలను వెల్లడించారు ప్రవీణ్ పుల్లట. అయితే తాజా గణాంకాల ప్రకారం ఈసారి 41 మంది కూటమి ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్ రాదని.. వచ్చినా ఓడిపోతారని సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు.

దీంతో ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న తరుణంలో మరిన్ని సంచలన విషయాలు బయటపెడతానంటూ ప్రవీణ్ పుల్లట మరో ట్వీట్ చేశారు. 92 శాతం వన్ టైం ఎమ్మెల్యేలు మొదటిసారి.. చివరిసారి అంటూ మరో కామెంట్ కూడా పెట్టారు. అయితే ఇది ఎవరి గురించి అన్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే ప్రవీణ్ పుల్లట త్వరలో మరిన్ని అంశాలు బయట పెడతారా? లేకుంటే హింట్స్ తో సరి పెడతారా? అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.ఏపీలో కూటమిఅంతులేని మెజారిటీతో గెలిచింది. 164 అసెంబ్లీ సీట్లతో ఏకపక్ష విజయం సాధించింది. అయితే ప్రభుత్వం ప్రజల అంచనాలకు చేరుకోలేకపోతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం, అటు పాలన సైతం సజావుగా సాగకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వం పై అసంతృప్తి ఉంది. కానీ ఏడాది పాలన కూడా పూర్తి కాకపోవడంతో అది వ్యతిరేకత కు టర్న్ కాలేదు.

అయితే ఎన్నికలకు ముందు కూటమికి అనుకూలంగా ఉండే ప్రవీణ్ పుల్లట సర్వే.. ఇప్పుడు వ్యతిరేకంగా మారడం మాత్రం మూడు పార్టీల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదన్న విమర్శలు వస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు కఠిన చర్యలకు ఉపక్రమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది2024 ఎన్నికల్లో చాలామంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. దాదాపు 80 నుంచి 100 మంది కొత్తగా ఎన్నికైన వారే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ప్రజలు బాధ్యతతో ఈ విజయాన్ని కట్టబెట్టారని.. దీనిని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎమ్మెల్యే పై ఉందని తేల్చి చెప్పారు. అటు తర్వాత కూడా వర్క్ షాపులు నిర్వహించి మరి చాలా అంశాలపై గట్టిగానే హెచ్చరికలు పంపారు. అయినా సరే కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు. మరి ఈ సర్వే తోనైనా జాగ్రత్త పడతారా? లేదా? అన్నది తెలియాలి.

Read more:సంక్షిప్త వార్తలు:04-29-2025

Related posts

Leave a Comment