AP : ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై సర్వే

Survey on fee reimbursement

AP :ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై సర్వే చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యార్థులు తమ ఫీజు చెల్లింపు రసీదులు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఫీజు చెల్లిస్తే ఆ డబ్బులు విద్యార్థి లేదా తల్లి జాయింట్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై సర్వే

విజయవాడ, మే 28
ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై సర్వే చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యార్థులు తమ ఫీజు చెల్లింపు రసీదులు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఫీజు చెల్లిస్తే ఆ డబ్బులు విద్యార్థి లేదా తల్లి జాయింట్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై సర్వే ప్రారంభించింది. కాలేజీల్లో ఫీజు బకాయిలు చెల్లించిన వారు, చెల్లించని వారు తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ థంబ్ వేయాల్సి ఉంటుంది. ఫీజు చెల్లిస్తే ఆ రసీదులను సచివాలయాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.2023-24 విద్యాసంవత్సరంలో ఒక టర్మ్ ఫీజు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన టర్మ్స్ ఫీజులు విడుదల చేయాల్సి ఉంది. ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది.

2023-24 విద్యాసంవత్సరం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది.విద్యార్థుల బకాయిల సమస్యను పరిష్కరించేందుకు….గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది. 2023-24 విద్యా సంవత్సరానికి కాలేజీలకు ఫీజు చెల్లించిన వారికి నగదు తిరిగి అందించేందుకు సర్వే చేపట్టింది.గతంలో విద్యార్థులు కాలేజీలకు ఫీజు చెల్లించినప్పటికీ తమకు ఎటువంటి రీయింబర్స్మెంట్ రాలేదని వాపోతున్నారు. దీంతో గతంలో ఫీజు చెల్లించిన వారికి తిరిగి పేమెంట్ నేరుగా విద్యార్థి తల్లి లేదా జాయింట్ అకౌంట్ లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

ఫీజు చెల్లించకపోతే..ఆ బకాయిలను కాలేజీ ఖాతాల్లో, ఫీజు చెల్లిస్తే ఆ నగదును విద్యార్థుల లేదా వారి తల్లి ఖాతాల్లో జమ చేయనున్నారు.ఇందుకోసం జ్ఞానభూమి యాప్‌లో ఓ ప్రత్యేక ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీంతో పాటు సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థులు లేదా వారి తల్లులు గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శించి ఫీజు చెల్లింపు రసీదులు ఉంటే సమర్పించి బయోమెట్రిక్ వేయాలి.విద్యార్థి కాలేజీకి చెల్లింపు ఫీజు వివరాలు, రసీదులు, చెల్లింపు తేదీ… సచివాలయ ఉద్యోగులకు సమర్పించారు. వారు తమ లాగిన్ లో వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాలు సమర్పించిన తర్వాత విద్యార్థి లేదా వారి తల్లి బయోమెట్రిక్ వేసి ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఫీజు రసీదులు లేకపోతే కాలేజీలను సంప్రదించి నకిలీ కాపీలు పొందవచ్చు.రీయింబర్స్మెంట్ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం బకాయిలను సకాలంలో విడుదల చేయనుంది. ఫీజు కట్టేస్తే నగదు విద్యార్థి తల్లి లేదా జాయింట్ అకౌంట్ లో జమ చేస్తారు. ఫీజు చెల్లించకపోతే ఆ బకాయిలు కాలేజీ ఖాతాలో జమ చేస్తారు.

Read more:AP : కొడాలికి బిగ్ షాక్

Related posts

Leave a Comment