సంక్షిప్త వార్తలు : 02-06-2025

brife news

సంక్షిప్త వార్తలు : 02-06-2025:రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా చౌకధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు.  ఇది పురోగమన విధానం. పేదలకు సక్రమంగా నిత్యావసరాలు అందేలా చూడాలనే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.

ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం

విజయవాడ
రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా చౌకధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు.  ఇది పురోగమన విధానం. పేదలకు సక్రమంగా నిత్యావసరాలు అందేలా చూడాలనే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. గత ప్రభుత్వంలో తొలిరోజు సగటున 11 లక్షల మంది రేషన్ తీసుకోగా.. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 18.87 లక్షల కుటుంబాలు రేషన్ అందుకున్నాయి.

ఎప్పుడు వస్తుందో తెలియని రేషన్ వాహనాల కంటే షాపుల వద్దకు వెళ్లడమే ప్రజలు సౌకర్యంగా భావిస్తున్నారనేందుకు ఇది నిదర్శనం. ఇక పనులు మానుకుని రేషన్ వాహనాల కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదు. 15 రోజుల వరకు షాపుల్లో రేషన్ పొందవచ్చు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దకే అందించనున్నారు. భవిష్యత్ లోనూ ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నారా లోకేష్ అన్నారు.

మహిళపై యువకుల దాడి

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. మహిళపై లైంగిక దాడి

కుప్పం
కుప్పంలో అనూమనుష ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా పై  యువకులు విచక్షరహితంగా దాడికి పాల్పడ్డారు. శాంతిపురం మండలంలోని జీడగుట్ల గ్రామంలో ఘటన జరిగింది. బాధిత మహిళ యువకులపై  పోలీసులకు పిర్యాదు చేసింది.  దాడి గల పూర్తి కారణాలు దర్యాప్తు తెలియాల్సి ఉంది..

టీడీపీ ఖాతాలోకి తిరువూరు పంచాయతీ

తిరువూరు పంచాయతీ టీడీపీ కైవసం - ఛైర్‌పర్సన్​గా నిర్మల

తిరువూరు
తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. నగర పంచాయతీ ఛైర్మన్గా కొలికిపోగు నిర్మల ఎన్నిక అయ్యారు. నిర్మలకు మద్దతుగా కొలికిపూడి శ్రీనివాసరావు సహా 11 మంది టీడీపీ కౌన్సిలర్లు నిలిచారు. వైసీపీ తరపున  9 మంది కౌన్సిలర్లు హజరయ్యారు.

డోర్నకల్ లో  ఉద్రిక్తత
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట

బీఆర్‌ఎస్‌ నాయకులపై కాంగ్రెస్‌ దాడి-Namasthe Telangana

మహబూబాబాద్
డోర్నకల్ పట్టణం లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  గాంధీ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకార్యక్రమం ఏర్పాటు చేశారు,  కార్యక్రమం పక్కనుండే బీఆర్ఎస్  పార్టీ  ర్యాలీగా వెళ్లారు. దీంతో రెండు  పార్టీల మధ్య ఉధృత వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ డోర్నకల్ మండల కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ర్యాలీ నిర్వహించారు. తమ ర్యాలీకి పోలీసులు సహకరించలేదని అసన్నం వ్యక్తం చేశారు

అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి: హరీష్ రావు  

బిఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది: హరీష్ రావు - Mana Telangana

హైదరాబాద్ జూన్ 2
అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అగ్రగామి అని మాజీ మంత్రి హరీష్ రావు   విమర్శించారు. అభివృద్ధిలో మాజీ సిఎం కెసిఆర్ అగ్రగామి అని అన్నారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి   అందాల పోటీలపై రివ్యూ చేశారు తప్ప..రైతుల ధాన్యంపై మాత్రం రివ్యూ చేయలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు..మహిళలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కెసిఆర్ ఆనవాళ్లను ఎవరూ చెరిపివేయలేరని హరీష్ రావు పేర్కొన్నారు.

Related posts

Leave a Comment