విశాఖ నుంచి మొదలు… | Starting from Visakha… | Eeroju news

విశాఖపట్టణం, జూన్ 15, (న్యూస్ పల్స్) అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‎పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి. టీడీపీ నగరంలో బాగా బలపడింది. అయినా రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జీవీఎంసీలో జెండా ఎగురవేయకపోతే బాగోదని అప్పటి వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ విజయసాయి రెడ్డి ఆ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జీవీఎంసీకి…

Read More

విజయనగరంలో సగం మంది మహిళా నేతలే | In Vizianagaram half of the leaders are women | Eeroju news

విజయనగరం, జూన్ 15, (న్యూస్ పల్స్) చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం. కానీ ఇప్పుడు మాత్రం ఆ జిల్లాను మహిళలు సమర్థవంతంగా పాలిస్తున్నారు. ఈ జిల్లాకు జిల్లా కలెక్టర్ గా జి.నాగలక్ష్మి ఉండగా, జిల్లా ఎస్పీగా ఎమ్. దీపిక పాటిల్ ఉన్నారు. వీరిద్దరి సమర్ధవంతమైన పాలనలో జిల్లా ఎన్నికలను ఒంటి చేత్తో…

Read More

ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పేర్ల మార్పులు… | Name changes in the first cabinet meeting… | Eeroju news

విజయవాడ, జూన్ 15, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులుగా పలువురు బాధ్యతలు స్వీకరించారు. వీరికి శుక్రవారం శాఖలను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు…

Read More

వైసీపీ పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే | All the posts of YCP are for that social group| Eeroju news

గుంటూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి,  రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ నియమించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశం అయిన తర్వాత జగన్ చేసిన ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే మూడు పదవులు ఒకే వర్గానికి నిర్మోహమాటంగా కేటాయించారు. సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు. వైసీపీకి లోక్ సభలో నలుగురు మాత్రమే ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు, ఒకరు ఎస్సీ, మరొకర ఎస్టీ. అదే రాజ్యసభలో మాత్రం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారు. మరో ఆరుగురు నలుగురు బీసీ, ఒకరు ఎస్సీ, మరొకరు గుజరాత్…

Read More

పవన్ కళ్యాణ్ కు భారీ ప్రాధాన్యం, గౌరవం | Pawan Kalyan is given huge importance and respect | Eeroju news

విజయవాడ, జూన్ 15,(న్యూస్ పల్స్) జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం  హోదా కల్పించారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన డిప్యూటీ సీఎం అని ప్రమాణం చేయలేదు. కేబినెట్ మంత్రిగానే ప్రమాణం చేశారు. కానీ ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి  ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారు.. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. కానీ రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రులు తమ డిప్యూటీలను పెట్టుకోవచ్చు. వైసీపీ హయాంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వారికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఏమీ లభించలేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. డిప్యూటీ సీఎం అంటే.. మంత్రులందరిలో కెల్లా ప్రథముడు అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం…

Read More

ట్రిపుల్ ఐటి ఛాన్స్ లర్ ను అడ్డుకున్న ఉద్యోగులు | Employees who obstructed the triple IT chancellor | Eeroju news

నూజివీడు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆర్జీయుకేటీ ఛాన్స్ లర్  కేసి రెడ్డిని ఉద్యోగులుఅడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హాయాంలో యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందంటూ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఛాన్స్ లర్ వాహానాన్ని అడ్డుకుని, క్యాంపస్ లోకి రానివ్వకుండా గోబ్యాక్ నినాదాలతో ట్రిపుల్ ఐటీ గేట్లు వద్ద స్టాఫ్ బైఠాయించారు. ఆరు సంవత్సరాల నుండి జీతాలు పెంచకుండా, ఉద్యోగుల జీవితాలు నాశనం చేశారంటూ ప్లకార్డులతో క్యాంపస్ లో ఆందోళనకు దిగారు.

Read More

బాబు, పవన్ చిత్రపటాలకు పాలభిషేకం | Palabhishekam for the pictures of Babu and Pawan | Eeroju news

అవనిగడ్డ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విళయతాండవం చేస్తున్న తరుణంలో ఆర్ధికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేయడంతో అవనిగడ్డ రాజీవ్ గాంధీ చౌక్ లో డీఎస్సీ నిరుద్యోగులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఎప్పుడు డీఎస్సీ ప్రకటిస్తారా, తమ జీవితాలలో ఎప్పుడు వెలుగులు నింపుతారా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు…

Read More

వాట్ నెక్స్ట్… చంద్రబాబు… | What next… Chandrababu… | Eeroju news

గుంటూరు, జూన్ 14, (న్యూస్ పల్స్) నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసేశారు. ఎక్కువ టైమ్ తీసుకోకుండా తన మంత్రివర్గ కూర్పును కూడా కంప్లీట్ చేసేశారు. ఎలాంటి పంచాయితీలు లేకుండా ఈ విషయాన్ని తెగ్గొట్టేశారు చంద్రబాబు. బంపర్ విక్టరీని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయిపోయింది.. సంబరాల సమయం ముగిసింది. మరి వాట్ నెక్ట్స్‌? చంద్రబాబు ఎలాంటి రాష్ట్రాన్ని లీడ్ చేయబోతున్నారు? ఆయన ముందున్న సవాళ్లేంటి? ఇచ్చిన హామీల అమలు సంగతేంటి?మధ్యలో పదేళ్ల తేడా ఉంది. కానీ రాష్ట్రం మాత్రం అప్పుడెలా ఉందో.. ఇప్పుడలానే ఉందన్న ప్రచారం ఉంది. రాజధాని లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు. ఇందులో మొదటి టర్మ్‌లో చంద్రబాబు కనుసన్నల్లోనే పాలన జరిగింది. నెక్ట్స్‌ టర్మ్‌లో జగన్‌ రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన కేవలం సంక్షేమ పథకాలపైనే ఫోకస్ చేశారు తప్ప.. అభివృద్ధి చేసింది ఏం…

Read More

మోడీలో మార్పు మంచిదేనా… | Is change in Modi good? | Eeroju news

విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిపోయారు. ఒకప్పటి మోడీ వేరు.. ఇప్పుడు మోదీ వేరు. అప్పటి మోదీ ఎలా ఉండేవారు.. మోదీని ఇలా ఎప్పుడు చూసి ఉండరు. నిజానికి ఆయన ఏదైనా బహిరంగ సభల్లో పాల్గొంటే చాలా సీరియస్‌గా ఉంటారు. అందరికి వందనాలు చేసి.. చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోతారు. కానీ చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపించారు. ఆయన చాలా యాక్టివ్‌గా కనిపించారు. వేదికపై అటు, ఇటూ తిరుగుతూ కనిపించారు. చంద్రబాబుతో ఫస్ట్‌ నుంచి లాస్ట్ వరకు ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఆఖరికి కార్యక్రమం ముగిసిన తర్వాత అయితే మోదీ ఓ చిన్న పిల్లాడిలా మారిపోయారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. చిరంజీవితో ఓ ఫోటో దిగాలని కోరారు. దీనికి ఓకే చెప్పిన మోదీ.. పవన్‌ వెళ్లి మోదీని…

Read More

ప్రైవేట్ పాఠశాలలో అనధికార పుస్తకాలు సీజ్ | Seize unauthorized books in private school | Eeroju news

టెక్కలి శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలోని “ఇన్ ఫాంట్ జీసస్” స్కూల్లో గురువారం విద్యా శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టెక్కలి డిప్యూటీ డీఈఓ పీ.విలియమ్స్, ఎంఈఓ డీ.తులసీరావు లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 1 నుంచి 10వ తరగతులకు సంబంధించి ప్రైవేట్ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నోటుపుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించి సీజ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read More