Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అవినాష్ ను చుట్టముట్టేస్తున్న వివేకా కేసు.

0

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ సమయం. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజూకీ పెరిగిపోతోంది. ఈ విమర్శల దాడిలో మనకి ఎప్పటికప్పుడూ వినిపించే మాట వివేకా హత్య కేసు. మాజీ సీఎం వైఎస్ఆర్ కు స్వయానా తమ్ముడు, ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయంలో హత్య కాబడిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన వివేకా ఇంట్లోనే ఇప్పుడు అధికారం ఉండడం.. హత్య టీడీపీ హయంలో జరగడం.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ఆ హత్యను టీడీపీ కుట్రగా ఫోకస్ చేయడంతో ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చేసరికి ఎవరికి వారికి అస్త్రాలు దొరికినట్లయింది.

 

ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసు క్లైమాక్స్ కి చేరింది. క్లైమాక్స్ కి చేరిందనే మాట చాలా కాలంగా వినిపిస్తున్నా.. గడువులు విధించి కేసు దర్యాప్తు పూర్తి చేయాలనీ న్యాయస్థానాలు ఆదేశాలిచ్చినా.. ఈ కేసు ఇంకా ఇంకా సాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ కేసు సాగదీత కోసం ఓ వర్గం సర్వశక్తులూ ఒడ్డింది. ఆ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. అయితే  ఈసారి క్లైమాక్స్ కు చేరింది అంటే చేరింది అంతే. దాని వెనక కారణాలు కూడా లేకపోలేదు. నిన్న మొన్నటి వరకు ఈ కేసు సాగదీతలో కేంద్రం అంతో ఇంతో సాయపడుతోందని ఢిల్లీ నుండి గల్లీ వరకూ కోడై కూసింది.

 

విశ్లేషకుల నుండి అతి సామాన్య ప్రజల వరకూ అందరి నోటా ఈ మాటే వినిపించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు మారాల్సిన సమయం వచ్చేసింది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పాత మిత్రుల అవసరం వచ్చింది పడింది.  కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని దేశవ్యాప్తంగా బీజేపీ పాత మిత్రుల వైపు చూస్తోంది. తమతో కలిసి వచ్చే స్నేహితులకు చేయి అందించాలని బీజేపీ పెద్దలే రాష్ట్ర నాయకత్వాలకు సూచనలు, సలహాలు ఇచ్చేశారు. ఇప్పటికే జనసేనతో దోస్తీకి ఫిక్సయిపోయిన తెలుగుదేశం తాజాగా చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత ఆల్ మోస్ట్ ఇక పాత అలియన్స్ కి రాజమార్గం పడ్డట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో ఇకపై వివేకా కేసులో కేంద్రం నుండి సాయం అంటే ఎడారిలో నీటి ఊటే అవుతుంది.

ఛలో గిద్దలూరు.

అదే జరిగితే సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీకి తప్పించుకోలేని జంజాటమే అవుతుంది.సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలలో వివేకా హత్యకేసు ప్రధానమైనది  అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకోవడంతో ఆ ఎన్నికలలో వైఎస్ కుటుంబం, వైసీపీ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. అయితే  సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి అదే కేసు వైసీపీ మెడకి చుట్టుకోనుందా అంటే నిస్సందేహంగా ఔనని చెప్పవచ్చు. అప్పుడు వైసీపీకి ఈ కేసు  ఏ స్థాయిలో ఎన్నికల సమరంలో సానుభూతిని ఏరులై పారించిందో.. ఇప్పుడు టీడీపీ జగన్ మోహన్ రెడ్డిని నేరస్తుడిగా ముద్ర వేయడంలో అదే స్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతోంది.

 

ఒక్క మాటలో చెప్పాలంటే 2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు టీడీపీ రూ.వెయ్యి కోట్ల ప్రచారాన్ని ఏ విధంగా హైలెట్ చేసిందో.. ఈసారి జగన్ నేరస్థుడు అనేలా హైలెట్ చేయడం తధ్యం.నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ  రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే అటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎం జగన్ ను   దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

 

అంతేకాదు, ఈ కేసులో అవినాష్ తప్పించుకునేందుకు అప్పటి నుండి వేసిన ఎత్తులు కూడా వైసీపీకి తీరని నష్టమే అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తమ్ముడిని కాపాడేందుకు స్వయంగా సీఎంనే  అధికారాన్ని అడ్డం పెట్టుకుని చే యాల్సిందంతా చేస్తున్నారనే  ప్రచారం ప్రజలలోకి బలంగా వెళ్లిపోయింది.దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తే కనుక అందులో అవినాష్ వాటాయే సింహభాగంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జూన్ నెలాఖరునే ఈ కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. సిబిఐ అనుమానించిందే నిజమైతే.. ఆ తర్వాత ఏం జరిగినా అది జగన్ కు గ్రహపాటే!

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie