జగన్ ఓవర్ టూ బెంగళూరు… విజయవాడ, జూలై 16 (న్యూస్ పల్స్) Jagan mohan reddy over to Bangalore జగన్ ఇటీవల తరచూ బెంగళూరు వెళుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒకసారి వెళ్లారు. వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. ఇప్పుడు మరోసారి వెళ్తున్నారు. వారం రోజులు పాటు అక్కడే గడపనున్నారు. ఈసారి వైద్య సేవల కోసమే ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల డోర్స్ పెరగడంతోనే ఆయన బెంగుళూరు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా షర్మిలను కట్టడి చేసేందుకే నన్న టాక్ నడుస్తోంది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియాలి. జగన్ కు పులివెందులతో పాటు బెంగళూరు, హైదరాబాదులో ప్యాలెస్ లు ఉన్నాయి. అందులో…
Read MoreTag: Eeroju news
Behind the peace episode Own party leaders | శాంతి ఎపిసోడ్ వెనుక సొంత పార్టీ నేతలు | Eeroju news
శాంతి ఎపిసోడ్ వెనుక సొంత పార్టీ నేతలు విశాఖపట్టణం, జూలై 16 (న్యూస్ పల్స్) Behind the peace episode Own party leaders విజయసాయిరెడ్డి ప్రతిష్టను సొంత పార్టీ నేతలు డ్యామేజ్ చేస్తున్నారా? మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారా? ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా? ఆయనపై తాజా ఆరోపణల వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. ఓ మహిళా అధికారిపై ఆయన భర్త చేసినఆరోపణల నేపథ్యంలో.. విజయసాయిరెడ్డి ప్రస్తావన రావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీడియాలో సైతం విస్తృత చర్చకు కారణమైంది. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.వైసీపీలో నెంబర్ 2గా ఏదిగారు విజయసాయిరెడ్డి. ఆ స్థానానికిచాలా పెద్ద పోటీ ఉంది. వైసిపి ఆవిర్భావ సమయంలో…
Read MoreMinister Balineni disappointed | బాలినేని నైరాశ్యం.. | Eeroju news
బాలినేని నైరాశ్యం.. ఒంగోలు, జూలై 16, (న్యూస్ పల్స్) Minister Balineni disappointed మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడుతారా? ఈ విషయాన్ని హై కమాండ్ కు తేల్చి చెప్పారా? అందుకే జగన్ సమీక్షల్లో బాలినేని కనిపించడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికలకు ముందు నుంచే పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు బాలినేని. ఈ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ బాలినేనిని హై కమాండ్ పెద్దగా నమ్మడం లేదు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై బాలినేని తో పాటు వైసిపి స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. బాలినేని శ్రీనివాస్…
Read Moreటీచర్ల కోసం వేడుకోలు.. | Eeroju news
టీచర్ల కోసం వేడుకోలు.. ఏలూరు, జూలై 16, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాఠశాల కోసం తాము మట్టితో షెడ్‌ను నిర్మించుకున్నామని, ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ స్పందన కోసం ఆ గిరిజన గ్రామం ఎదురు చూస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తెంగల్ బంధ గ్రామంలో 28 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో మొత్తం 136 మంది జనాభా ఉన్నారు. వీరంతా కొండదొర ఆదివాసీ గిరిజనలు, వీరు కొండ చిట్టచివర జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేదు. తెంగల్ బంధ గ్రామానికి చెందిన 26 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా గంగవరం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్నారు. అయితే రెండు వాగులు దాటుకొని, స్కూల్‌కి…
Read MoreKCR approached the Supreme Court | సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే.? | Eeroju news
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే.? హైదరాబాద్ KCR approached the Supreme Court తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌నుతెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రేపు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనున్నది. కాగా తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసార్లు నోటీసులు పంపించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ…
Read MoreRecruitment of constable posts soon | త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ | Eeroju news
త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ డీజీపీ Recruitment of constable posts soon ఎపి త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం అని ఆయన పేర్కొన్నారు. Progress will be made in the cases | కేసుల్లో పురోగతి సాధించండి | Eeroju news
Read MoreParvaneni Foundation | రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్ | Eeroju news
రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా ప్రభుత్వానికి అందజేత అమరావతి Parvaneni Foundation ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్రమాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి ఆయన తనయుడు పి.వివేక్ ఆనంద్ అంబులెన్స్ ను అందించారు. క్రిటికల్ కేర్ వైద్యంలో ఈ అంబులెన్స్ కీలకంగా పని చేస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్ సెక్రటరీ, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుమారుడు వివేక్ ఆనంద్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగుదేశం…
Read MoreFormer CM Jagan will go to Bangalore | బెంగళూరు వెళ్లనున్నమాజీ సీఎం జగన్ | Eeroju news
బెంగళూరు వెళ్లనున్నమాజీ సీఎం జగన్ విజయవాడ Former CM Jagan will go to Bangalore మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు. కాలికి ట్రీట్మెంట్ కోసం ఆయన బెంగళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది.. వారం పాటూ అక్కడే ఉంటారని చెబుతున్నారు. గత నెలలో కూడా జగన్ బెంగళఊరు వెళ్లిన సంగతి తెలిసిందే. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువశాతం పులివెందుల, బెంగళూరులోనే ఉన్నారు. ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అన్నది కూడా చూడాలి. అసెంబ్లీకి హాజరుకావడంపై ఇప్పటి…
Read MoreDouble pensions for 5650 people | 5650 మందికి డబుల్ పెన్షన్లు | Eeroju news
5650 మందికి డబుల్ పెన్షన్లు ఖమ్మం, జూలై 15 (న్యూస్ పల్స్) Double pensions for 5650 people రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్నట్లు సెర్ప్ నివేదికలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు తేలింది. గత ఎన్నికల్లో అధికార మార్పిడితో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించడం గమనార్హం.ప్రభుత్వ సర్వీసులో పని చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పొందుతున్న పెన్షన్ తో పాటు ఆసరా పెన్షన్ సైతం పొందుతున్న విడ్డూరం చోటు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతుండగా ఇందులో 3826 మంది చనిపోయారు. ఇక 1826 మంది ఇప్పటికీ…
Read MoreGhost in Karimnagar temple | కరీంనగర్ గుడిలో దెయ్యం | Eeroju news
కరీంనగర్ గుడిలో దెయ్యం కరీంనగర్, జూలై 15 (న్యూస్ పల్స్) Ghost in Karimnagar temple గుళ్లో ఏముంటుంది..? అంటే దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, అక్కడ గుళ్లో మాత్రం ఏముంటుందో తెలిస్తే మీరు అవ్వాకైపోతారు. ఆ అంధవిశ్వాసమే.. ఇప్పుడా గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది..? అదంతా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగుపెడితే కాళ్లు, చేతులు వణుకుతాయి. గుడి గంట మోగినా గుండె దడ పెరుగుతుంది. అరుపులు.. కేకలు.. పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో.. ఒకటేమిటీ ఇంకా చాలానే కనిపిస్తాయి. ఆ ఆలయం ఎక్కడో లేదు మన తెలంగాణలోనే ఉంది. ఇదిగో మనం చూస్తున్న ఈ గుడి…
Read More