జూలై 24న కేంద్ర బడ్జెట్… | Union budget on July 24… | Eeroju news

న్యూఢిల్లీ, జూన్ 15, (న్యూస్ పల్స్) హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జులై 22న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కాకుండా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కసరత్తులో భాగంగా నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ‘ఓటాన్ అకౌంట్’ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇది ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఎన్నికల తర్వాత…

Read More

సినిమాలపై నీలిమబ్బులు | Blue clouds on movies | Eeroju news

కాకినాడ, జూన్ 15, (న్యూస్ పల్స్) పవన్ సినిమాలు చేయరా? ఫుల్ టైం రాజకీయాలు చేస్తారా? ఇప్పుడు ఆసక్తికర చర్చ ఇదే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కు చంద్రబాబు కీలక శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, పర్యావరణం, అటవీ శాఖ బాధ్యతలను పవన్ కు అప్పగించారు. ఆపై డిప్యూటీ సీఎం. పవన్ కు దక్కిన శాఖలన్నీ కీలకమే. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలి. రివ్యూలు జరపాలి. అందుకే ఇప్పుడు పవన్ సినీ కెరీర్ పై అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం పెండింగ్ సినిమాలు పూర్తి చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో పవన్ కీలక శాఖలను ఎలా నిర్వహిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోందిసంక్రాంతి నుంచి పవన్ సినిమాలు ముందుకు కదల్లేదు. వారాహి యాత్రతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొన్నారు. దీంతో…

Read More

నారాయణ, కేశవ్ లదే బాధ్యతంతా | Narayana and Keshav are all responsible | Eeroju news

నెల్లూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల శాఖలు ఖరారు అయ్యాయి. ఇక పాలన ప్రారంభించడమే తరువాయి అన్న చందంగా ఉంది. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల మేరకు కీలక ఐదు పైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి తొలి సంతకం చేశారు. సామాజిక పింఛన్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి ఫైళ్ళపై చంద్రబాబు సంతకం చేశారు. ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో కీలకమైనవిగా భావిస్తున్నారు.అయితే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలన్నది ప్రజల అభిమతం. కేవలం సంక్షేమం మాత్రమే అమలు చేసిన జగన్ ను ప్రజలు తిరస్కరించారు. ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కావాలి, ఆపై ఉద్యోగ,…

Read More

వైసీపీకి దూరమైన బీసీలు… | BCs away from YCP… | Eeroju news

వైసీపీకి దూరమైన బీసీలు… ఏలూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) BCs away from YCP : ఏపీలో ప్రతిపక్ష వైసీపీ మొదటిలోనే ప్రశ్నించే గొప్ప అవకాశాన్ని వదులుకుంది. 2019 ఎన్నికల్లో బీసీలు వైసీపీకి సపోర్టు చేశారు. దీంతో.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, మొన్నటి ఎన్నికల్లో మాత్రం అదే బీసీలు కూటమికే జై కొట్టారు. దాని ఫలితమే.. వైసీపీ ఘోర ఓటమి. ఏపీలోనే బీసీ జనాభా ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు బీసీ స్లోగన్స్ బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కులగణన చేయాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ గట్టిగా ఈ డిమాండ్ చేసింది కాబట్టే.. దేశవ్యాప్తంగా బలపడింది. కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ లైట్ తీసుకుంది కాబట్టే.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.బీసీ నినాదాలు బలంగా వినిపిస్తున్న సమయంలో జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. పార్లమెంట్‌లో జగన్…

Read More

పాలన… ప్రక్షాళన… | Reign… Purge… | Eeroju news

తిరుమల, జూన్ 15, (న్యూస్ పల్స్) పాలన మొదలైంది.. ప్రక్షాళన షురూ అయ్యింది. అది కూడా కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధానమైన తిరుమల నుంచి నాలుగోసారి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకోగానే ఆయన ఆ ఏడుకొండవాడిని దర్శించుకున్నారు. భక్తి భావం అలా ముగియగానే.. ఆయనలోని పాలకుడు నిద్రలేచాడు. ఐదేళ్లలో ఏదీ సరిగా జరగలేదు. అన్నింటిలో అరాచకం.. అవినీతి.. ఏదీ సక్రమంగా లేదు.. పాలకుడు తరహాలో అధికారులు కూడా తయారయ్యారు. ఇక మారాలి.. ప్రక్షాళన జరగాలి. ఇక ముందు కూడా ఇలానే ముందుకు సాగుతుందంటే ఇక నడవదు. ఏపీ నయా సీఎం చంద్రబాబు నాయుడు థాట్స్ ఇలా ఉన్నాయి. అందుకే ఆ తిరుమలేశుడి దర్శనం ముగియగానే ఫస్ట్ ఫోకస్ తిరుమల తిరుపతి దేవస్థానంపైనే పెట్టారు.నిజానికి వైసీపీ పాలనలో తిరుమల కొండపై అనేక అంశాలు వివాదస్పదమయ్యాయి. అన్యమత ప్రచారం కావొచ్చు..…

Read More

విశాఖ నుంచి మొదలు… | Starting from Visakha… | Eeroju news

విశాఖపట్టణం, జూన్ 15, (న్యూస్ పల్స్) అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‎పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి. టీడీపీ నగరంలో బాగా బలపడింది. అయినా రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జీవీఎంసీలో జెండా ఎగురవేయకపోతే బాగోదని అప్పటి వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ విజయసాయి రెడ్డి ఆ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జీవీఎంసీకి…

Read More

విజయనగరంలో సగం మంది మహిళా నేతలే | In Vizianagaram half of the leaders are women | Eeroju news

విజయనగరం, జూన్ 15, (న్యూస్ పల్స్) చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం. కానీ ఇప్పుడు మాత్రం ఆ జిల్లాను మహిళలు సమర్థవంతంగా పాలిస్తున్నారు. ఈ జిల్లాకు జిల్లా కలెక్టర్ గా జి.నాగలక్ష్మి ఉండగా, జిల్లా ఎస్పీగా ఎమ్. దీపిక పాటిల్ ఉన్నారు. వీరిద్దరి సమర్ధవంతమైన పాలనలో జిల్లా ఎన్నికలను ఒంటి చేత్తో…

Read More

ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పేర్ల మార్పులు… | Name changes in the first cabinet meeting… | Eeroju news

విజయవాడ, జూన్ 15, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులుగా పలువురు బాధ్యతలు స్వీకరించారు. వీరికి శుక్రవారం శాఖలను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు…

Read More

వైసీపీ పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే | All the posts of YCP are for that social group| Eeroju news

గుంటూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి,  రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ నియమించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశం అయిన తర్వాత జగన్ చేసిన ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే మూడు పదవులు ఒకే వర్గానికి నిర్మోహమాటంగా కేటాయించారు. సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు. వైసీపీకి లోక్ సభలో నలుగురు మాత్రమే ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు, ఒకరు ఎస్సీ, మరొకర ఎస్టీ. అదే రాజ్యసభలో మాత్రం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారు. మరో ఆరుగురు నలుగురు బీసీ, ఒకరు ఎస్సీ, మరొకరు గుజరాత్…

Read More

పవన్ కళ్యాణ్ కు భారీ ప్రాధాన్యం, గౌరవం | Pawan Kalyan is given huge importance and respect | Eeroju news

విజయవాడ, జూన్ 15,(న్యూస్ పల్స్) జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం  హోదా కల్పించారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన డిప్యూటీ సీఎం అని ప్రమాణం చేయలేదు. కేబినెట్ మంత్రిగానే ప్రమాణం చేశారు. కానీ ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి  ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారు.. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. కానీ రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రులు తమ డిప్యూటీలను పెట్టుకోవచ్చు. వైసీపీ హయాంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వారికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఏమీ లభించలేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. డిప్యూటీ సీఎం అంటే.. మంత్రులందరిలో కెల్లా ప్రథముడు అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం…

Read More