Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎలక్టోరల్ బాండ్ల జారీకి ఆమోదం.

0

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల జారీకి ఆమోదం తెలిపింది. దీంతో రాబోయే రెండు నెలల్లోనే ఆయా రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. అయితే రాజకీయ విరాళాలకు సంబంధించిన విషయంలో పారదర్శకత తీసుకురావడంతో పాటు.. క్యాష్ డొనేషన్లను అరికట్టడం కోసమే ఈ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 29 అధికృత బ్యాంకు శాఖల ద్వారా జూలై 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ బాండ్లను విక్రయించనున్నట్లు తెలిపింది.

యూఎస్, చైనాలతో పోటీ పడుతున్న హెచ్ డీ ఎఫ్ సీ.

లక్నో, బెంగళూరు, డెహ్రాడూన్, గాంధీనగర్, చెన్నై, ముంబయి వటి తదితర నగరాల్లో ఉన్న ఈ బ్యాంకు శాఖల ద్వారా ఈ ఎలక్టోరల్ బాండ్లను విక్రయించనున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే జారీ చేసిన నాటి నుంచి కేవల 15 రోజుల వరకు మాత్రమే ఈ బాండ్లు చెల్లుబాటులో ఉంటాయి. ఒకవేళ 15 రోజు తర్వాత డిపాజిట్ చేసినా అవి చెల్లుబాటు కావు. అయితే 2018 మార్చి 1 నుంచి 10 వ తేది మధ్య ఎలక్టోరల్ బాండ్లను జారీ చేశారు. దేశ పౌరులు, దేశంలో ఉండే కంపెనీలు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో 1 శాతం కంటే ఎక్కువ శాతం పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie