Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏప్రియల్ 17వ శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల కళ్యాణోత్సవం

0

శ్రీశైలం
ఈ నెల 17న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో సీతారామచంద్రస్వామివార్ల కల్యాణోత్సవం జరిపించబడుతుంది.ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం నుండి సీతారాముల వారికి, ఆ తరువాత అంజనేయస్వామి వారికి విశేష పూజాధికాలు జరిపించబడుతాయి. తరువాత ఉదయం గం.9.30 నుండి సీతారాముల కల్యాణోత్సవం జరిపించబడుతుంది.ఈ కళ్యాణమహోత్సవంలో ముందుగా లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించబడుతుంది. తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడుతుంది.అనంతరం వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవచనం జరిపించబడుతుంది. ఆ తరువాత కంకణపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతపూణ, యజ్ఞోపనీతధారణ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, గౌరీపూజ, మాంగల్య పూజ, శ్రీ సీతాదేవి వారికి మాంగల్యధారణ తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలలో సంప్రదాయ బద్దంగా సీతారామ కల్యాణం జరిపించబడుతుంది. కల్యాణోత్సవం తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయబడుతాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie