సంక్షిప్త వార్తలు:05-05-2025:యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సర్వీస్ రోడ్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, దీంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు గురై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, అట్టి అక్రమ కట్టడం దర్గా పై చర్యలు తీసుకోవాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో కు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి వినతిపత్రం అందజేసిన . ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి,దూడల భిక్షం, బిజెపి నాయకులు పాల్గొన్నారు
జస్టీస్ ప్రియదర్శిని భౌతిక కాయానికి సీఎం రేవంత్ నివాళులు
హైదరాబాద్
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ ప్రియదర్శిని భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష

హైదరాబాద్
మిస్ వరల్డ్ -2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హజరయ్యారు..
బస్సులో కల్లు తీసుకెళ్లనీయడం లేదని మహిళ గొడవ

నల్గోండ
ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లనీయడం లేదని నల్గొండ జిల్లాలో ఓ మహిళ బస్సు కు అడ్డంగా నిలబడి హంగామా చేసింది. నకిరేకల్ నుండి కట్టంగూర్ మీదుగా నల్గొండ కు వెళుతున్న ఎక్సప్రెస్ బస్సు ను రోడ్డుపై నిలిపి బస్సును వీడియో తీస్తూ, బస్సులో కల్లు తీసుకుపోవద్దని రూల్ చెప్పింది ఎవడు అంటూ బస్సును అడ్డుకుంది.. సొషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవడం తో నెటిజన్లు ఔరా అంటున్నారు..
సర్వీసు రోడ్డులో అక్రమ నిర్మాణాలు
బీజేపీ ధర్నా

చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సర్వీస్ రోడ్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, దీంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు గురై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, అట్టి అక్రమ కట్టడం దర్గా పై చర్యలు తీసుకోవాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో కు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి వినతిపత్రం అందజేసిన . ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి,దూడల భిక్షం, బిజెపి నాయకులు పాల్గొన్నారు.గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై గ్రీన్ ఫీల్డ్ హైవేలు మరియు ఎక్స్ ప్రెస్ రహదారులు నిర్మించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది కానీ విజయవాడ టు హైదరాబాదుకు
వెళ్లే జాతీయ రహదారి 65 పై సర్వీస్ రోడ్లో అడ్డంగా ప్రార్థనా మందిరాలు నిర్వహిస్తున్న కానీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి నిమ్మకు నీరు ఎత్తకుండా వ్యవహరిస్తున్నారు వీరి వ్యవహార శైలి చౌటుప్పల్ పట్టణంలో ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని సుమారు 114 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించిన తర్వాత అనుమతులు వచ్చిన తర్వాత దాని అలైన్మెంట్ ఈ దర్గా కోసం అలైన్మెంట్ మార్చారు మొదట ఎలాగైతే అనుమతులు ఇచ్చారో దాని ప్రకారమే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ఒక వర్గం కోసం ఎదురు చూడకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా రహదారులు నిర్మించాలని కోరారు..
ఆటోను ఢీకొన్న బొలెరో.. ఇద్దరు మహిళలు మృతి

విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో రాంగ్ రూట్లో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఘటన ప్రదేశంలో మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను అంబులెన్స్ లో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
