సంక్షిప్త వార్తలు:05-05-2025:సాక్షి పేపర్ పైన వైసీపీ నాయకుల పైన చర్యలను తీసుకునేందుకు ఎంతవరకు అయినా వెళ్తానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు.కల్వర్టు పైన కబ్జాలతో వైసిపి నాయకులు పైన చర్యలను తప్పకుండా తీసుకుంటామనీ తెలిపిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి … సాక్షి పేపర్ అమ్మడు పోకుంటే సాక్షి పేపర్ పై నా ఫోటోను వేసుకోనే అనుమతిని ఇస్తానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు.నగరంలో బ్రిడ్జిలను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం… కడప ఎమ్మెల్యేగా నా బాధ్యత కాదని అన్నారు.
దేవాలయ మాన్యపు భూములను పరిరక్షించండి
సి.బెళగల్ మండలం బ్రాహ్మణ దొడ్డి మజార గ్రామమైన మారం దొడ్డి గ్రామం నందు పురాతనం నుండి ఆలయములకు మాన్యపు భూములు కలవు. గ్రామంలోని ఆంజనేయస్వామికి 24 ఎకరాలు, శివాలయమునకు 24 ఎకరాలు, చెన్నకేశవ స్వామి కి 28 ఎకరాల మాన్యపు భూములు కలవని, ఈ భూములకు కొన్నిచోట్ల సరిహద్దులు అన్యక్రాంతమునకు గురి అయ్యాయని, కావున మా మీద దయవుంచి మారందొడ్డి గ్రామంలో జరగబోయే రీసర్వే నందు సర్వే నంబర్ 474లో 13 ఎకరాల 75 సెంట్లు, సర్వే నంబర్243, 2ఎలో
7 ఏకరాల 65 సెంట్లు, సర్వే నంబర్ 243,2బి లో 5ఎకరాల 16 సెంట్లు, సర్వే నంబర్ 18, 30లో 7ఎకరాల 44 సెంట్లు సదరు వ్యవసాయ భూమికి సంబంధించిన సరిహద్దులు ఏర్పాటు చేయాలని మారందొడ్డి గ్రామస్తులు సోమవారం తహసిల్దార్ పురుషోత్తముడుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మారందొడ్డి గ్రామస్తులు రుక్మండ, పాండు, రాఘవేంద్ర, సోమన్న, విక్రమార్కుడు తదితరులు ఉన్నారు.
వైసీపీ నేతలతో జగన్ టెలికాన్ఫరెన్స్

అమరావతి
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సోమవారం నాడు వైకాపా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను వైసీపీ నేతలు పరామర్శించాలి. వర్షాలపై సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం వుంది. మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అకాల వర్షాలతో మరింత నష్టపోయారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అయన అన్నారు.
వాంబే ఇళ్లపై జేసీబీలు పంపిన కార్పోరేటర్

అమరావతి
వాంబే స్కీం పేదల ఇళ్లపై పబ్లిసిటీ కార్పొరేటర్ పీతల మూర్తి ప్రతాపం చూపించారు. ఒక్కో ఇంటి వారు తనను ప్రసన్నం చేసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రసన్నం చేసుకోకపోతే గృహాలు కూల్చేస్తానని బెదిరింపులు. పిఠాపురం కాలనీలో 2014లో రజకులకు వాంబే గృహాలు ఇచ్చారు. అప్పుడు తాను అధికారంలో లేనని ఇప్పుడు తనకు చూడాల్సిందేనని డిమాండ్ చేసారు. ఇప్పటికే జెసిబి తో టౌన్ ప్లానింగ్ సిబ్బందిని పంపించి గోడ కూల్చి కార్పొరేటర్ బెదిరించారు. బాధితులు టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అడ్డుకున్నారు. కార్పొరేటర్కు సాటిస్ ఫై చేస్తేనే కూల్చివేతలు ఆగుతాయని టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమాధానిమిస్తున్నారు. …
కడప ఎమ్మెల్యే కార్యాలయం సాక్షి పేపర్ పై ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాట్ కామెంట్స్

కడప
సాక్షి పేపర్ పైన వైసీపీ నాయకుల పైన చర్యలను తీసుకునేందుకు ఎంతవరకు అయినా వెళ్తానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు.కల్వర్టు పైన కబ్జాలతో వైసిపి నాయకులు పైన చర్యలను తప్పకుండా తీసుకుంటామనీ తెలిపిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి … సాక్షి పేపర్ అమ్మడు పోకుంటే సాక్షి పేపర్ పై నా ఫోటోను వేసుకోనే అనుమతిని ఇస్తానని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు.నగరంలో బ్రిడ్జిలను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం… కడప ఎమ్మెల్యేగా నా బాధ్యత కాదని అన్నారు.రద్దు చేసిన బ్రిడ్జిలను అప్రూవల్ చేయడానికి ఎంతో కృషి చేశామన్నారు.పాత కడప చెరువును ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారని సాక్షి పేపర్లో రావడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు.
పార్కులన్నీ ఆధూనికస్తాం

నెల్లూరు
ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ పార్కుల అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందని పట్టణ, పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు.నెల్లూరులో తిక్కన పార్క్‌లో ప్లే, జిమ్ ఎక్విప్‌మెంట్‌ను ప్రారంభించారు. 2018లోనే 100 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందని కామెంట్ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, పిల్లల ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరించి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు.
ఓవర్ హెడ్ ట్యాంక్ పంప్ హౌస్ ను ప్రారంభించిన కలెక్టర్

తిరుపతి
తిరుపతి రూరల్ మండలం పరిధిలోని గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పునరుద్ధరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ,చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి పాల్గోన్నారు.గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పంప్ హౌస్ ను ప్రారంభించారు.గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్య ఉన్నా గత వైసిపి పాలకులు పట్టించు కోలేదన్న స్థానికులు … కూటమి ప్రభుత్వం వచ్చిన నప్పటినుండి ప్రజా సమస్యలు తీరుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఎమ్మెల్యే చొరవతో ఆరు పంచాయతీలలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం అయింది.
రాష్ట్రవ్యాప్తంగా 700 తృప్తి క్యాంటీన్లు

నెల్లూరు
పేద మహిళలకు చేయూతనిచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 700 తృప్తి క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు.నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను మెప్మా ఎండి తేజ్ భరత్ తో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు.
