Andhra Pradesh :రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అమరావతి రాజధాని ప్రాంతంలో నలభై ఒక్క సంస్థలకు 300 ఎకరాలు పైగా కేటాయించినా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని పనులను పక్కన పెట్టడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు ముందుకు రాలేదు.
కేంద్ర సంస్థల పనులు ఎప్పుడు..
41 సంస్థలు..300 ఎకరాలు
గుంటూరు, మే 16
రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అమరావతి రాజధాని ప్రాంతంలో నలభై ఒక్క సంస్థలకు 300 ఎకరాలు పైగా కేటాయించినా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని పనులను పక్కన పెట్టడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు ముందుకు రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది గడుస్తున్నా, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాజధాని పనులకు శంకుస్థాపనచేసినప్పటికీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటి నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై మరోసారి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. నేరుగా ఆ యా సంస్థలకు లేఖ రాయాలని భావిస్తుంది.ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని భావిస్తుంది. సత్వరమే కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం పనులు ప్రారంభించకపోతే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది.
అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించాలంటే వాటికి పరిపాలన సంబంధమైన అనుమతులు ఇవ్వాలి. నిధులు కూడా కేటాయించాలి. అందుకే జాప్యం జరుగుతుందని కూడా కొందరు సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని కూటమి పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఆయాకేంద్ర ప్రభుత్వ సంస్థలకు వెళ్లి పనుల పురోగతిని గురించి ప్రశ్నిస్తున్నారని తెలిసింది.రాజధాని అమరావతిలోని తుళ్లూరు, రాయపూడి తదితర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం స్థలాలను కేటాయించింది.కొన్ని స్థ నిర్మాణాలు నిలిచిపోయినవి కూడా ఉన్నాయి. రాయపూడి పరిధిలోని జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు కేటాయించిన రెండు ఎకరాలు స్థలం, ప్రహరీ గోడల వరకే పరిమితమైంది. ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కార్యాలయం భవన నిర్మాణ పనులు కూడా అరకొరగా సాగుతున్నాయి.
రాజధాని ప్రాంతంలో మొత్తం 114 ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వం 1,277 ఎకరాలను కేటాయించింది. అందులో 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలు, కార్యాలయాలకు 300 ఎకరాలు కేటాయించింది. స్థలాలు కేటాయించి తొమ్మిదేళ్లు పైగానే అయినా ఇంత వరకూపనులు ప్రారంభించకపోవడంపై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అమరావతి నిర్మాణాలతో పాటు వీటి పనులను కూడా వీలయినంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలుకోరుతున్నారు. రిజర్వ్ బ్యాంక్, సిఏజి, సిబిఐ, నేవీ, ఆర్మీ, పోస్టల్ , ప్రభుత్వ బ్యాంకులు, ఎల్ఐసి, ఆయిల్ సంస్థలు, హడ్కో, ఫ్యాషన్ టెక్నాలజీ, కేంద్రీయ విద్యాలయాలు, పలు సాంకేతిక సంస్థలకు స్థలాలు కేటాయించినా నిర్మాణాలు చేపట్టకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి
Read more:Andhra pardesh : మాటల్లో సరే.. చేతలేవి
