AP : కడప గడపలో పట్టు కోసం ప్లాన్

The organization of Mahanadu in Kadapa was acceptable to everyone, from party national president Chandrababu Naidu to the common TDP worker.

AP :పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి సామాన్య టీడీపీ కార్యకర్త వరకూ అందరికీ ఆమోదయోగ్యంగా నిలిచింది కడపలో మహానాడు నిర్వహణ. ఇదే వేడుకలో చిన్నబాబు లోకేష్ ను ప్రమోట్ చేస్తారని వార్తలు వస్తుండగా..మహానాడు వేదికను ఫిక్స్ చేసిన లోకేష్ పార్టీలో అందరి అభిమానాలు అందుకుంటున్నారు.

కడప గడపలో పట్టు కోసం ప్లాన్

కడప, మే 28
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి సామాన్య టీడీపీ కార్యకర్త వరకూ అందరికీ ఆమోదయోగ్యంగా నిలిచింది కడపలో మహానాడు నిర్వహణ. ఇదే వేడుకలో చిన్నబాబు లోకేష్ ను ప్రమోట్ చేస్తారని వార్తలు వస్తుండగా..మహానాడు వేదికను ఫిక్స్ చేసిన లోకేష్ పార్టీలో అందరి అభిమానాలు అందుకుంటున్నారు.తెలుగుదేశం  పార్టీ పండుగ మహానాడుకు రంగం సిద్ధమైంది. కడప జిల్లాలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప నగరం ఎటుచూసినా పసుపే కనిపిస్తోంది. 250 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మహానాడు నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి కడపలో మహానాడు నిర్వహణకు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి కడపలో మహానాడును నిర్వహించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలోచన చేసింది మాత్రం ఒకే ఒకరు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న తెలుగుదేశం పార్టీకి చిరస్మరణీయమైన గుర్తుగా ప్రత్యర్థి అడ్డాలో మహానాడును నిర్వహిద్దామని యువనేత నారా లోకేష్ ప్రతిపాదన చేశారు. రాయలసీమ.. అందునా వైఎస్ కుటుంబ అడ్డా కావడంతో ఎన్నెన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నారా లోకేష్ ప్రతిపాదనకు జై కొట్టింది టీడీపీ హై కమాండ్. లోకేష్ ప్రతిపాదనకు పార్టీ శ్రేణుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది.

దాని ఫలితమే పసుపుమయమైన కడన నగరం. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి సామాన్య టీడీపీ కార్యకర్త వరకూ అందరికీ ఆమోదయోగ్యంగా నిలిచింది కడపలో మహానాడు నిర్వహణ. ఇదే వేడుకలో చిన్నబాబు లోకేష్ ను ప్రమోట్ చేస్తారని వార్తలు వస్తుండగా..మహానాడు వేదికను ఫిక్స్ చేసిన లోకేష్ పార్టీలో అందరి అభిమానాలు అందుకుంటున్నారు.నారా లోకేష్ ఒక నాయకుడే అని ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. ఆయనకు అంత సీన్ లేదులే అని ఎగతాళి చేశారు. రాజకీయంగా పనికి రారంటూ ముద్ర వేశారు. వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు .బాడీ షేమింగ్ పై మాట్లాడిన వారు ఉన్నారు. నారా లోకేష్ ను టార్గెట్ చేసుకోవడానికి వందలాది సోషల్ మీడియా సైన్యం.. అంతకు మించి నేతల గణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కానీ అన్నింటినీ అధిగమించారు. సవాళ్లను ఎదుర్కొన్నారు. తనను తాను నిరూపించుకున్నారు. సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు. రాళ్లను పూలుగా మార్చుకొని నిలబడ్డారు. పోయిన చోటే వెతుక్కొని పోరాటం చేసి అనుకున్నది సాధించారు. అయితే 2014 నుంచి 2019 మధ్య లోకేష్ అలుపెరగకుండా శ్రమించారు. అన్నింటికీ మించి తెలుగుదేశం పార్టీని ఏకతాటిపైకి తేగలిగారు.

పార్టీని కష్టకాలంలో తన పాదయాత్రతో నిలబెట్టారు. తండ్రి చంద్రబాబు అరెస్టుతో పార్టీని నిర్వీర్యం చేయాలన్న ప్రత్యర్థి అంచనాలను తారుమారు చేశారు. ఏకంగా ప్రత్యర్థి ఇలాకాలో టీడీపీ కూటమి విజయాన్ని శాసించారు. దానిని దశాబ్దాల కాలం సుస్థిరం చేసుకునేందుకే కడపలో మహానాడు నిర్వహించాలని ప్రతిపాదన చేశారు లోకేష్. దానికి పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు కడపలో మహానాడు మూడు రోజుల పాటు జరగనుంది.రాయలసీమ  అంటే వైఎస్సార్ కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ అంటే రాయలసీమ అన్నట్టు పరిస్థితి ఉండేది. అంతలా ఉండేది ప్రాంతీయ అభిమానం. 2014 ఎన్నికల్లో రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ దే పైచేయి. టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్థానాలు సాధించింది. 2019లో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి నందమూరి బాలక్రిష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. ఇటువంటి క్లిష్ణ పరిస్థితుల్లో రాయలసీమపై ఫోకస్ పెంచారు లోకేష్. తన సుదీర్ఘ పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు. దారిపొడవునా వైసీపీ ప్రభుత్వంతో పాటు శ్రేణుల నుంచి అభ్యంతరాలు, ప్రతిఘటనలు ఎదురైనా బలంగా నిలబడ్డారు. వివాద రహితంగా, గాంధేయవాదంతో తాను పాదయాత్రను పూర్తిచేశారు.

ప్రజలతో మమేకమయ్యారు. పాదయాత్రకు ఎదురైన అడ్డంకులను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే రాయలసీమ స్వరూపమే మారిపోతుందని హామీ ఇచ్చారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో రాయలసీమకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పారిశ్రామికీకరణకు రాయలసీమ సరైన భవిత అని టీడీపీ కూటమి ప్రభుత్వం సంకేతాలు పంపుతుండడంతో రాయలసీమలో టీడీపీ మరింత బలపడేలా ఉంది.కడపలో మహానాడును నిర్వహించడం ద్వారా ప్రత్యర్థికి సరైన సవాల్ పంపాలని నారా లోకేష్ భావించారు. అదే సమయంలో పార్టీలో యువరక్తం ఎక్కించాలని భావిస్తున్నారు. అందుకు మహానాడు కూడా వేదిక కానుంది. పార్టీలో వరుసగా మూడుసార్లు పార్టీ పదవులు చేపట్టిన వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలని ప్రతిపాదన పెట్టిన లోకేష్ సంచలనానికి తెరలేపారు. అందులో భాగంగానే ఈసారి లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని అంతా భావిస్తున్నారు. అయితే మరో నాలుగు దశాబ్దాలకుగాను టీడీపీ ఉనికి చాటుకునేలా బలమైన నాయకత్వానికి దిశ నిర్దేశం చేసేలా మహానాడు తీర్మానాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అందుకే కడప వేదికగా భవిష్యత్ నిర్దేశం చేస్తే బాగుంటుందనే నారా లోకేష్ ఇక్కడే మహానాడును ఫిక్స్ చేశారు. అయితే ఈ నిర్ణయం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరుస్తోంది.

Read more:AP : టీడీపీ టచ్ లోకి మరో ఎంపీ

Related posts

Leave a Comment