Amaravati :అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ. 3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి సంబంధించి ఎల్-1 టెండర్లను ఖరారు చేసినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
3,673 కోట్లతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణం
విజయవాడ, జూన్ 3
అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ. 3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి సంబంధించి ఎల్-1 టెండర్లను ఖరారు చేసినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ. 3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి సంబంధించి ఎల్-1 టెండర్లను ఖరారు చేసినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 48వ సీఆర్‌డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
జీఏడీ టవర్: రూ. 882 కోట్లతో నిర్మించే ఈ టవర్‌ను ఎన్.సి.సి. దక్కించుకుంది.
1.హెచ్.ఓ.డి. టవర్-1 & 2: రూ. 1,487 కోట్లతో నిర్మించే ఈ టవర్ల బాధ్యతను షాపూర్జీ అండ్ పల్లంజీ సంస్థకు అప్పగించారు.
2.హెచ్.ఓ.డి. టవర్-3 & 4: రూ. 1,304 కోట్లతో నిర్మించే ఈ టవర్ల నిర్మాణాన్ని ఎల్ అండ్ టి కంపెనీ చేపడుతుంది.
3.ఈ కంపెనీలు త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభిస్తాయని మంత్రి నారాయణ చెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం, పరిపాలన అంతా ఒకే చోట జరిగేలా ఈ ఐదు టవర్లను నిర్మిస్తున్నారు. 2014−19 మధ్య రూపొందించిన డిజైన్ల ప్రకారమే ఈ టవర్ల పనులు కొనసాగుతాయి.
4.రెండో దశ ల్యాండ్ పూలింగ్: 40 వేల ఎకరాలకు సన్నాహాలు
5.అమరావతి అభివృద్ధిలో భాగంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దాదాపు 40,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
6.భూమి అవసరం దేనికి?
7.హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం తరహాలో అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం.
8.2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్.
9.మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరం.
మొత్తంగా, ఈ ప్రాజెక్టులకు సుమారు 10,000 ఎకరాల భూమి అవసరమని మంత్రి తెలిపారు. భూసేకరణ లేదా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించాలా అనే దానిపై గ్రామసభలు నిర్వహిస్తున్నారు. రైతులు ల్యాండ్ పూలింగ్‌కే మొగ్గు చూపుతున్నారని, ఇప్పటికే దాదాపు 36,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని మంత్రి వెల్లడించారు.ప్రస్తుతం అమల్లో ఉన్న ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం 217 చ.కి.మీ.కే అనుమతి ఉంది. ఈ పరిధిని మరింత పెంచేందుకు అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది విద్య, ఆరోగ్య సంస్థల రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.రానున్న మూడు సంవత్సరాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని, రెండో దశ ల్యాండ్ పూలింగ్‌ను కూడా పూర్తి చేసి అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Read more:Nagababu : నాగబాబుకు అడగడుగునా అడ్డంకులు
