Engineering colleges : తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు SC/ST విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ B క్యాటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) మరియు C క్యాటగిరీ (NRI కోటా) సీట్లను కోట్లకు విక్రయిస్తున్న దారుణమైన పరిస్థితిపై బీజేపీ గిరిజన మోర్చా మరియు దళిత మోర్చా నేడు తీవ్ర స్థాయిలో ధర్నా చేపట్టారు.
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించని నిర్వాహకులు
కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్టి/ఎస్టి మోర్చా డిమాండ్
హైదరాబాద్ జూన్ 3
తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు SC/ST విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ B క్యాటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) మరియు C క్యాటగిరీ (NRI కోటా) సీట్లను కోట్లకు విక్రయిస్తున్న దారుణమైన పరిస్థితిపై బీజేపీ గిరిజన మోర్చా మరియు దళిత మోర్చా నేడు తీవ్ర స్థాయిలో ధర్నా చేపట్టారు. విద్యను వ్యాపారంగా మార్చిన ఈ ప్రైవేట్ కళాశాలలపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా. కళ్యాణ్ నాయక్ మరియు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి. బాలకిష్టారెడ్డిని కలిసారు. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు SC/ST విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయకుండా సీట్లను డబ్బుకు అమ్ముకుంటున్న తీరును వినతి పత్రం లో వెల్లడించారు. రూ.10 నుండి 15 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తూ, కనీస నిబంధనలను పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేసారు..CBIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,2.
అనురాగ్ యూనివర్సిటీ,3. మల్లారెడ్డి యూనివర్సిటీ,4. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల,5. CVR ఇంజనీరింగ్ కళాశాల,6. గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల,7. MVSR ఇంజినీరింగ్ కళాశాల,8. ఏస్ ఇంజనీరింగ్ కళాశాల,9. శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాల,10. వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల,11. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల,12. గోకరాజు గంగరాజు ఇంజినీరింగ్ కళాశాల,13. గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల,14. విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల,15. బివి రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ,16. VNR విజ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,17. నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలోసీరియస్ రిజర్వేషన్ ఉల్లంఘనలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉందని పేర్కొన్నారు. విద్యను వ్యాపారంగా మలచి, పేద, తక్కువ వనరులున్న SC/ST విద్యార్థులను అణగదొక్కే ఈ వ్యవస్థను తక్షణమే ఆపకపోతే, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపీ ST, SC మోర్చాలు శ్రీకారం చుడతాయని నేతలు హెచ్చరించారు.
Read more:సంక్షిప్త వార్తలు : 03-06-2025
