Telugu states :రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వింత పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పార్టీల్లో చెల్లెళ్ల పోరు నాయకులకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. నిన్న మొన్నటి వరకూ వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డి నుంచి తిరుగుబాటు ఎదురైతే ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడు కేటీఆర్కు చెల్లెలు కవిత రూపంలో ఇంటిపోరు మొదలైంది.
తలనొప్పిగా మారుతున్న సిస్టర్స్
హైదరాబాద్, మే 31
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వింత పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పార్టీల్లో చెల్లెళ్ల పోరు నాయకులకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. నిన్న మొన్నటి వరకూ వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డి నుంచి తిరుగుబాటు ఎదురైతే ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడు కేటీఆర్కు చెల్లెలు కవిత రూపంలో ఇంటిపోరు మొదలైంది. తెలంగాణ ఉద్యమం సమయం లో “జాగృతి ” పేరుతో తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీ వన కార్యక్రమాలతో తన వంతు కృషి చేసిన కవిత ప్రస్తుతం పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ కు “డాడీ.. నీకో లేఖ ” అంటూ పార్టీలో జరుగుతున్న కొన్ని తప్పులు అని తన భావించిన అంశాలపై లేఖ రాశారు. ముందు అది ఫేక్ అని అందరూ భావించినా ఆ లేఖను తానే రాసినట్టు తర్వాత ఆమె స్పష్టం చేశారు. ఇది పార్టీలో తీవ్ర సంచలనం సృష్టించింది.కవిత లెటర్ పై మొదట్లో సాఫ్ట్ గా స్పందించిన టిఆర్ఎస్ నేతలు తర్వాత స్వరం పెంచారు. కవిత కూడా తానేమి తగ్గనట్టు గా బీఆర్ఎస్ ను బిజెపిలో కలిపేసే కుట్ర జరుగుతుందంటూ మరో బాంబు పేల్చారు.
అయితే ఇదంతా పార్టీ నాయకత్వంలో తనకు సరైన స్థానం లభించడం లేదంటూ ఆమె భావించడమే కారణం అని స్పష్టమవుతోంది. తనకు ప్రాధాన్యత తగ్గడంలో అన్న కేటీఆర్ కారణమని ఫీల్ అవడమే రీజన్ అని ఎనలిస్ట్ లు అంటున్నారు.తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న కవిత ఆరోపణలు ప్రధానంగా కేటీఆర్ ను ఉద్దేశింనే అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా కొనసాగుతోంది. ఆమె లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లినప్పుడు తనపై లేనిపోనివి చెప్పి తన తండ్రి మనసు విరిచేసారని ఆమె నమ్ముతున్నట్టు కొన్ని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దానికి నిన్న మొన్నటి వరకు ఈ చర్చ బీఆర్ఎస్ లో భవిష్యత్ నాయకత్వ చర్చ కేటీఆర్ vs హరీష్ రావు అన్నట్టు సాగేది. కానీ ఇప్పుడు సడన్గా అది కేటీఆర్ వర్సెస్ కవితగా మారిపోయింది.ప్రస్తుతం కవిత వెనక్కి రాలేనంతగా పార్టీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లిపోయారు. దానితో త్వరలోనే ఆమె సొంత పార్టీపై ప్రకటన చేయబోతున్నట్టు తెలంగాణలో చాలా బలంగా ప్రచారం జరుగుతోంది.
తండ్రి రాజకీయ వారసత్వం తనకే అంటూ బలంగా నమ్ముతున్న కేటీఆర్ కు ఒక విధంగా ఇది ఇబ్బంది తెచ్చిపెట్టి పరిణామమే.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినప్పుడు ” అన్న వదిలిన బాణం ” అంటూ పాదయాత్ర చేసిన షర్మిల తర్వాత కాలంలో నిరాదరణకు గురైన అనే అభిప్రాయంలో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు ఎలాంటి పదవి, రాజకీయ ప్రాముఖ్యత లభించలేదు. పైపెచ్చు ఆస్తులు విషయంలోనూ అన్నతో గొడవలు ఉన్నాయి. దానితో వైసీపీతో విభేదించి బయటకు వచ్చి ముందు తెలంగాణలో పార్టీ పెట్టారు. అది పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ లో చేరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా తన అన్నను ఎన్నికల్లో ఢీ కొట్టారు.2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఏదో ఒక స్థాయిలో షర్మిల కూడా కారణమని ఒక అభిప్రాయం ఉంది. ఇప్పటికీ ఆమె తన అన్నను క్షమించలేదు సరికదా తన ప్రతి ప్రెస్ మీట్ లోనూ ఏదో ఒక రకంగా తన అన్నపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లోనే ఇలా అన్నాచెల్లెళ్ల పోరు ఉందనుకుంటే.. ఇప్పుడు కేటీఆర్ vs కవిత రూపంలో తెలంగాణలోనూ కొత్త ఇంటి పోరు మొదలైంది. మరి రానున్న రోజుల్లో ఇది మరెన్ని తిరుగుతుందో చూడాలి.
Read more:Liquor case : లిక్కర్ కేసు విచారణ అసలు టార్గెట్ ఎవరు
