Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మణిపూర్ ఘటనలకు మోడీ బాధ్యత వహించాలి

Modi should be responsible for Manipur incidents

0
  • మణిపూర్ సీఎంను బర్తరఫ్ చేయాలి
  • సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు

మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అమానుష ఘటనలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని, ఆ రాష్ట్ర సీఎంను భర్తరఫ్ చేయాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం రోజున సీపీఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైష్ణవి గార్డెన్ లో ఎ.సి.రెడ్డి నర్సింహారెడ్డి 32వ వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభ ప్రారంభానికి ముందు స్థానిక బస్టాండ్ చౌరస్తా నుంచి డప్పు కళాకారుల ప్రదర్శన బృందంతో, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా సభాస్థలికి వెళ్లారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే అమరజీవి ఏ.సి.రెడ్డి నర్సింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏసీరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక్షంగా పాల్గొని నైజాం సర్కారుకు ఎదురొడ్డి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం మతం మత్తు రుద్ది ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగోట్టి పాలన దాగిస్తుందని విమర్శించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని పెంచుతున్నారని అన్నారు, బీజేపీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు రగిలిస్తూ ప్రజా హక్కులను, రాజ్యాంగం విలువలను కాలరాస్తూ, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

నీళ్లు నిధులు, నియామకాల లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన BRS ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన మేరకు పోడు భూముల దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలను ఇవ్వాలని, గిరిజనుల, ఆదివాసులపైన ప్రభుత్వ నిర్బంధాన్నీ ఆపివేయాలని డిమాండ్ చేశారు. ధరణిలోని లోపాలను తక్షణమే సరిచేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోహిన రైతులకు పంట నష్టపరిహారం అందించాలని తెలిపారు. అలాగే వరద ముప్పుతో అన్ని కోల్పోయి నిరాశీయులైన ప్రజలకు ఆదుకోవాలని అన్నారు. గత 24 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు మరియు పాఠశాల స్వీపర్ల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో వివిధ తరగతి ప్రజల అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారంకై రానున్న రోజుల్లో . ఏ.సి.రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, జిల్లాలలో ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడమే ఏ.సి.రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించినట్టవుతుందని ఈ సందర్బంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, జోగు ప్రకాష్ సుంచు విజేందర్ భూక్య చందు నాయక్ పోత్కనూరి ఉపేందర్, బోడ నరేందర్, పొదల నాగరాజు, చిట్యాల సోమన్న, బెల్లంకొండ వెంకటేష్, మునిగేల రమేష్, కొడెపాక యాకయ్య, అజారోద్దిన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు బోట్ల శ్రీనివాస్, సిపిఎం సీనియర్ నాయకులు గట్ల కొండల్ రెడ్డి భీమగోని చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie