Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

25న ఢిల్లీకి పొంగులేటీ, జూపల్లి.

0

అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నాగర్‌కర్నూలు, మంచిర్యాల, జోగుళాంబ గద్వాల.. జిల్లాల్లో ఇటీవలే పర్యటించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులను ప్రారంభించారు.

 

ప్రగతి నివేదన పేరుతో నిర్వహించిన బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలపై వరాల జల్లును కురిపించారు. అదే సమయంలో కాంగ్రెస్ జూలు విదిలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో చేరికలకూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసింది కాంగ్రెస్.

ఆర్ధిక రాజధానిపై గులాబీ ఫోకస్.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు పొంగులేటి. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు గానీ అక్కడ ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు. జూపల్లి కృష్ణారావు పరిస్థితీ అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ.. ఆ పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడిక మళ్లీ సొంతగూటికి చేరబోతోన్నారు జూపల్లి. పొంగులేటితో కలిసి కాంగ్రెస్ కండువాను కప్పుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు.

 

దీనికోసం వారిద్దరూ బుధవారం వేర్వేరుగా తమ అనుచరులతో భేటీ కానున్నారు. గర్ల్ ఫ్రెండ్ ను ఇలాకూడా చంపుతారా ?, మాట్లాడాలని ఆటో కుర్చోపెట్టిన ప్రియుడు? కాంగ్రెస్‌లో చేరబోతోన్న విషయాన్ని వారిద్దరూ ఈ భేటీ అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం వారిని స్వయంగా కలుస్తారని తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన దేశ రాజధానిలో రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో షర్మిల సైతం త్వరలోనే కాంగ్రెస్‌లో చేరొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మరో వివాదంలో రాజయ్య.

మారిన కాంగ్రెస్ తీరు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వలసలతో వెలవెలబోతే.. చేరికలతో బీఆర్ఎస్ కిటకిటలాడింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎన్నెళ్లు తిరిగొచ్చే మా ఇళ్లకు అన్న పాట చందంగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. గత ఎనిమిదేళ్లుగా ఎగ్జిట్ తప్ప ఎంట్రీ అన్నదే తెలియని ఆ పార్టీకి ఇప్పుడు కుప్పతెప్పలుగా  చేరికలు ఉంటున్నాయి.
ఎనిమిదేళ్లుకు పైగా పార్టీ నుంచి వెళ్లిపోయేవారే తప్ప పార్టీలోకి వస్తామంటూ తలుపుతట్టిన వారే లేదు. దానికి తోడు వరుస ఎన్నికలలో డిపాజిట్లు సైతం కోల్పోయి డీలా పడిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కోత్త జోష్ కనిపిస్తోంది.

 

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ తమదే నంటూ చెప్పుకోవడానికి కూడా ముఖం చెల్లనంతగా డీలా పడిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలి సారిగా ఆ పార్టీలో గెలుపు ధీమా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ బాబ్బాబు రండి అంటూ ప్రత్యర్థి పార్టీలలోని అసమ్మతి నేతలను కాంగ్రెస్ బతిమలాడుకునే పరిస్థితి ఉండేది.అయితే ఇప్పుడు అది రివర్స్ అయ్యింది. పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు చేరికలకు షరతులు పెట్టే స్థితిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏ షరతులు పెట్టినా సర్దుకు పోయేందుకు ఇతర పార్టీల నుంచి వస్తున్న వారు అంగీకరంచేందుకు రెడీగా ఉన్నారు.

 

ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి కూడా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలకు కారణమౌతోంది. పట్నం మహేందర్ రెడ్డి విషయమే తీసుకుంటే.. ఆయన గత ఎన్నికలలో రేవంత్ రెడ్డిని ఓడించడానికి కొడంగల్ పై పూర్తి కాన్సన్ ట్రేట్ చేశారు. రేవంత్ రెడ్డిపై తన తమ్ముడిని గెలిపించుకున్నారు.కానీ తన సొంత నియోజకవర్గంలో మాత్రం పరాజయం పాలయ్యారు. అక్కడ నుంచి విజయం సాధించిన పైలట్ రోహిత్ రెడ్డి ఆ తరువాతి పరిణామాలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) గూటికి చేరారు.   ఇప్పుడు కేసీఆర్ పైలట్ రోహిత్ రెడ్డికే వచ్చే ఎన్నికలలో టికెట్ కన్ ఫర్మ్  చేశారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

 

ఆయనలాగే బీఆర్ఎస్ లో  చాలా మంది బలమైన నేతలకు టికెట్ దక్కే అవకాశాలు లేవు. సిట్టింగులకే టికెట్లు అంటూ ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత పని చేసే వారికే అంటూ చిన్న సవరణ చేసినా.. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చి చేరిన సిట్టింగులు ధీమాగా ఉంటే.. పార్టీ కోసం కష్టపడి మాజీలుగా ఉన్న వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో కి వచ్చే వారిలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలే అధికంగా ఉంటారని అంటున్నారు. కాగా ఈ చేరికలు వచ్చే నెలలో  కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఆయన సమక్షంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  మల్లు  రవి నేతృత్వంలో రేవంత్ నియమించిన కమిటీ ఇప్పటికే కాంగ్రెస్ లో వచ్చి చేరే వారి జాబితాను సిద్ధం చేసే పనిలో ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie