విజయవాడ, జూన్ 15, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులుగా పలువురు బాధ్యతలు స్వీకరించారు. వీరికి శుక్రవారం శాఖలను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు…
Read MoreTag: AP News
పవన్ కళ్యాణ్ కు భారీ ప్రాధాన్యం, గౌరవం | Pawan Kalyan is given huge importance and respect | Eeroju news
విజయవాడ, జూన్ 15,(న్యూస్ పల్స్) జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన డిప్యూటీ సీఎం అని ప్రమాణం చేయలేదు. కేబినెట్ మంత్రిగానే ప్రమాణం చేశారు. కానీ ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారు.. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. కానీ రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రులు తమ డిప్యూటీలను పెట్టుకోవచ్చు. వైసీపీ హయాంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వారికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఏమీ లభించలేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. డిప్యూటీ సీఎం అంటే.. మంత్రులందరిలో కెల్లా ప్రథముడు అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం…
Read Moreట్రిపుల్ ఐటి ఛాన్స్ లర్ ను అడ్డుకున్న ఉద్యోగులు | Employees who obstructed the triple IT chancellor | Eeroju news
నూజివీడు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆర్జీయుకేటీ ఛాన్స్ లర్ కేసి రెడ్డిని ఉద్యోగులుఅడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హాయాంలో యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందంటూ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఛాన్స్ లర్ వాహానాన్ని అడ్డుకుని, క్యాంపస్ లోకి రానివ్వకుండా గోబ్యాక్ నినాదాలతో ట్రిపుల్ ఐటీ గేట్లు వద్ద స్టాఫ్ బైఠాయించారు. ఆరు సంవత్సరాల నుండి జీతాలు పెంచకుండా, ఉద్యోగుల జీవితాలు నాశనం చేశారంటూ ప్లకార్డులతో క్యాంపస్ లో ఆందోళనకు దిగారు.
Read Moreబాబు, పవన్ చిత్రపటాలకు పాలభిషేకం | Palabhishekam for the pictures of Babu and Pawan | Eeroju news
అవనిగడ్డ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విళయతాండవం చేస్తున్న తరుణంలో ఆర్ధికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేయడంతో అవనిగడ్డ రాజీవ్ గాంధీ చౌక్ లో డీఎస్సీ నిరుద్యోగులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఎప్పుడు డీఎస్సీ ప్రకటిస్తారా, తమ జీవితాలలో ఎప్పుడు వెలుగులు నింపుతారా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు…
Read Moreవాట్ నెక్స్ట్… చంద్రబాబు… | What next… Chandrababu… | Eeroju news
గుంటూరు, జూన్ 14, (న్యూస్ పల్స్) నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసేశారు. ఎక్కువ టైమ్ తీసుకోకుండా తన మంత్రివర్గ కూర్పును కూడా కంప్లీట్ చేసేశారు. ఎలాంటి పంచాయితీలు లేకుండా ఈ విషయాన్ని తెగ్గొట్టేశారు చంద్రబాబు. బంపర్ విక్టరీని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయిపోయింది.. సంబరాల సమయం ముగిసింది. మరి వాట్ నెక్ట్స్? చంద్రబాబు ఎలాంటి రాష్ట్రాన్ని లీడ్ చేయబోతున్నారు? ఆయన ముందున్న సవాళ్లేంటి? ఇచ్చిన హామీల అమలు సంగతేంటి?మధ్యలో పదేళ్ల తేడా ఉంది. కానీ రాష్ట్రం మాత్రం అప్పుడెలా ఉందో.. ఇప్పుడలానే ఉందన్న ప్రచారం ఉంది. రాజధాని లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు. ఇందులో మొదటి టర్మ్‌లో చంద్రబాబు కనుసన్నల్లోనే పాలన జరిగింది. నెక్ట్స్ టర్మ్‌లో జగన్ రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన కేవలం సంక్షేమ పథకాలపైనే ఫోకస్ చేశారు తప్ప.. అభివృద్ధి చేసింది ఏం…
Read Moreమోడీలో మార్పు మంచిదేనా… | Is change in Modi good? | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిపోయారు. ఒకప్పటి మోడీ వేరు.. ఇప్పుడు మోదీ వేరు. అప్పటి మోదీ ఎలా ఉండేవారు.. మోదీని ఇలా ఎప్పుడు చూసి ఉండరు. నిజానికి ఆయన ఏదైనా బహిరంగ సభల్లో పాల్గొంటే చాలా సీరియస్‌గా ఉంటారు. అందరికి వందనాలు చేసి.. చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోతారు. కానీ చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపించారు. ఆయన చాలా యాక్టివ్‌గా కనిపించారు. వేదికపై అటు, ఇటూ తిరుగుతూ కనిపించారు. చంద్రబాబుతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఆఖరికి కార్యక్రమం ముగిసిన తర్వాత అయితే మోదీ ఓ చిన్న పిల్లాడిలా మారిపోయారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చిరంజీవితో ఓ ఫోటో దిగాలని కోరారు. దీనికి ఓకే చెప్పిన మోదీ.. పవన్ వెళ్లి మోదీని…
Read Moreకొండపల్లికి 40, ఫరూ్ఖ్ కు 74 | 40 for Kondapalli, 74 for Farooq | Eeroju news
కర్నూలు, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. యువకులు, సీనియర్లు సమ్మిళితంగా రాష్ట్ర మంత్రివర్గం కూర్పు ఉంది. క్యాబినెట్లో కొండపల్లి శ్రీనివాస్ అత్యంత చిన్న వయసు. ఆయనకు 40 సంవత్సరాల వయసు కాగా.. ఎన్ఎండి ఫరూక్ అత్యంత పెద్దవారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. సామాజిక సమతూకంతో పాటు యువతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సీనియార్టీ కి సైతం పెద్దపీట వేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయసు పరంగా ఎన్ ఎం డి ఫరూక్ అందరికంటే పెద్దవారుగా నిలిచారు. టిడిపిలో ఆయన సీనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. అందుకే ఆయనకు గౌరవించి మైనారిటీ కోట కింద పదవి ఇచ్చారు చంద్రబాబు. విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే…
Read Moreప్రైవేటీకరణ చేస్తారా… ఆపేస్తారా… | Will Privatization… Stop… | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 14, (న్యూస్ పల్స్) విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను..2021లో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించడంతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు, వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పటినుంచి అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారింది విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశం. అయితే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా ముందడుగే వేసింది కేంద్రం ప్రభుత్వం.అయిదేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సొంత గనులు లేకపోవడంతో…
Read Moreఅప్పులపై శ్వేత పత్రం… | White Paper on Debt… | Eeroju news
విజయవాడ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది. వైసీపీ హయాంలో లక్షల కోట్ల అప్పులు చేశారని అనేక సార్లు ఆరోపించారు. అసలైన వివరాలు బయట పెట్టడం లేదని గవర్నర్‌కు అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేశారు. పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఇంత వరకూ పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పూర్తి స్థాయి లెక్కలను బయట పెట్టేందుకు సిద్దమయింది. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రతీ వారం రెండు నుంచి నాలుగువేల కోట్ల వరకూ అప్పు తీసుకు వస్తోంది. యభై రోజుల్లోనే పాతిక వేల కోట్ల వరకూ…
Read Moreనిర్మించిన కొద్ది రోజులకే బీటలు వారిన రోడ్డు. | The road was covered with dirt within a few days of its construction. | Eeroju news
డుంబ్రిగుడ మండలంలో నూతనంగా నిర్మించిన 516 ఈ హైవే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే బీటలు వారుతుండడంతోపాటు బిల్లాపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్డు దిగిపోతుండడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లాపుట్టు, కించుమండ మధ్యలో ఇటీవల నిర్మించిన హైవే రోడ్డు బీటలు వారగా , బిల్లాపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్డు దిగబడుతుంది. దీన్ని గమనించకుండా వాహనదారులు ప్రయాణిస్తూ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని వాహనదారులు అంటున్నారు. నిర్మించిన కొద్ది రోజులకే రోడ్డు బీటలు వారుతుండడంతో నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పలువురు అంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read More