Vijayawada | మాకెప్పుడు పదవులు | Eeroju news

మాకెప్పుడు పదవులు

మాకెప్పుడు పదవులు విజయవాడ, నవంబర్ 12, (న్యూస్ పల్స్) Vijayawada రెండు విడతల్లో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అయిపోయింది. పోస్టులు ఈన్నీ ఫిలప్‌ అయిపోయాయి. ఇక అదృష్టం ఎప్పుడు తమ తలుపు తడుతుందోనని ఊహల్లో తేలియాడిపోతున్నారట. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నదెవరు.? ఎమ్మెల్సీ కోసమే పట్టుబడుతున్న లీడర్లు ఎవరు.?ప్రభుత్వం వచ్చింది హ్యాపీగా ఫీల్ అయ్యామ్. టంపింగ్‌ మెజార్టీతో గెలిచాం..జోష్‌ మీదున్నాం. కానీ మాకు పదవేది సార్. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. మీడియాలో గొంతు చించుకుని అరిచాం. సీటు ఇవ్వలేమంటే అర్థం చేసుకున్నామ్. మాకెప్పుడు సార్ పదవి యోగం దక్కేది అంటూ..ఏపీలో టీడీపీ నేతలు వేయి కళ్లలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేపట్టింది కూటమి సర్కార్. ఇందులో టీడీపీ నేతలకు పెద్ద సంఖ్యలోనే పదవులు వచ్చాయి. అయితే ఇంకా కొందరు…

Read More

AP News | 18న టీటీడీ పాలక మండలి సమావేశం | Eeroju news

18న టీటీడీ పాలక మండలి సమావేశం

18న టీటీడీ పాలక మండలి సమావేశం తిరుమల, నవంబర్ 12, (న్యూస్ పల్స్) AP News తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న పాల‌క మండ‌లి తొలి స‌మావేశం ఈనెల 18న జ‌ర‌గ‌నుంది. ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రగబోయే ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. అందుకు సంబంధించి అధికారులు క‌స‌ర‌త్తు ప్రారంభించారు.ఈనెల 18న ఉద‌యం 10.15 గంట‌ల‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టీటీడీ బోర్డు స‌మావేశం కానుంది. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారాన్ని చేప‌ట్టిన‌ దాదాపు ఐదు నెల‌ల త‌రువాత ఏర్ప‌డిన టీటీడీ బోర్డు తొలి స‌మావేశం కావ‌డంతో.. ప్రాధాన్య‌త‌ సంత‌రించుకుంది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించి తీర్మానాలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ఈ సమావేశం కోసం అధికారులు అజెండా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి జరగనున్న కొత్త బోర్డు సమావేశంలో ప్రధానంగా కొనుగోళ్లు,…

Read More

YCP | సోషల్ మీడియా కేసులతో వైసీపీ కార్యకర్తల ఇబ్బందులు | Eeroju news

సోషల్ మీడియా కేసులతో వైసీపీ కార్యకర్తల ఇబ్బందులు

సోషల్ మీడియా కేసులతో వైసీపీ కార్యకర్తల ఇబ్బందులు విజయవాడ, నవంబర్ 12, (న్యూస్ పల్స్) YCP ఏపీలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు తీవ్ ఒత్తిడికి గురవుతున్నాయి.సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల్లో మార్ఫింగ్‌లు, బూతులు ఉంటే ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. కుటుంబాలను దూషిస్తూ ఐదేళ్ల పాటు వారు సేఫ్ గా ఉన్నారు.నిజానికి ఇలాంటి వారిలో అత్యధిక మంది ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్ నుంచో.. మరో ప్రభుత్వ వ్యవస్థ నుంచో జీతాలు తీసుకుంటూ వచ్చారు. అలా జీతాలు తీసుకుంటూ అప్పట్లో పెట్టిన పోస్టులే ఇప్పుడు అరెస్టులకు కారణం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వైసీపీ సోషల్ మీడియాను వ్యవస్థీకృత మాఫియాగా చెబుతోంది. దేశ విదేశాల్లో ఉన్న వారికి డబ్బులు ఇచ్చి మరీ పోస్టులు పెట్టిస్తున్నారని అంటున్నారు. గతంలో న్యాయమూర్తులపై పోస్టులు పెట్టింది కూడా వీరేనని..అలాగే.. టీడీపీ, బీజేపీ, జనసేన అగ్రనేతలు..…

Read More

KCR survey results | కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ… | Eeroju news

కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ...

కేసీఆర్ సర్వే రిజల్ట్స్ ఎక్కడ… వరంగల్, నవంబర్ 11, (న్యూస్ పల్స్) KCR survey results ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పేరిట తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. కులాలవారీగా.. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి స్థితిగతులపై ఈ సర్వేలో సమాచారాన్ని సేకరించనుంది. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. అయితే, అందుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌరులకు సంబంధించి కులాలవారీగా సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, వివిధ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరచడమే కులగణన ముఖ్య…

Read More

Onion rates hike | ఉల్లి… లొల్లి… | Eeroju news

ఉల్లి... లొల్లి...

ఉల్లి… లొల్లి… ముంబై, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Onion rates hike కొంత కాలంగా నిత్యవసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే అత్తెసరు ఆదాయంతో ఈసురోమంటూ కుటుంబాన్ని ఈదే సామాన్యుడు ఈ పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాడు. బియ్యం, పప్పు, ఉప్పుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనికి తోడు నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు పంటలు కూడా వరునుడు ఎత్తుకుపోయాడు. దీంతో నిత్యవసర సరుకుల ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ పక్క పెరిగిన ధరలతో అల్లాడిపోతుంటే.. మరోవైపు టమాట, ఉల్లి ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి. వారం క్రితం కాస్త పర్లేదు అనేంతగా రూ. వందకు 4 కేజీల వరకు విక్రయించిన వ్యాపారులు హఠాత్తుగా ధరలు పెంచేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పైకెగబాకాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు…

Read More

KCR & Revanth Reddy | రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్.. | Eeroju news

రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్..

రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్.. హైదరాబాద్, నవంబర్ 11, (న్యూస్ పల్స్) KCR & Revanth Reddy కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను ఫీల్డులోకి వస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. భూపాలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తప్పకుండా వస్తానని వారికి హామీ ఇచ్చారు.చాలా కాలం తరువాత కేసీఆర్ ఫొటో పేపర్లలో కనిపించింది. కేసీఆర్ మాటలు మీడియాలో వినిపించాయి. కేసీఆర్ వ్యాఖ్యలు పేపర్లలో ప్రచురితమయ్యాయి. కొన్ని నెలల తరువాత కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్లు వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో ఆయన అభిమానుల్లో సంతోషం కనిపించింది. నిన్న పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే.. ఒకప్పుడు సింహంలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే కేసీఆర్‌ను నిన్న చాటుమాటుగా వీడియో తీస్తూ పోస్ట్ చేశారు. అయితే.. ఎవరో…

Read More

AP News | ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్… | Eeroju news

ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్...

ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్… గుంటూరు, నవంబర్ 11, (న్యూస్ పల్స్) AP News అధికార టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. అటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం, దారుణమైన పోస్టింగ్ పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, దారుణమైన ప్రచారం, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన పోస్టులపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత కూడా తాము సైతం బాధితులమేనని.. అందుకే వీటిని సీరియస్ గా తీసుకుని, బాధ్యుతలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది.సోషల్ మీడియాలో మురికి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు.. చర్యలు తప్పవు.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు మొదలవుతున్నాయి. ఇప్పటికే…

Read More

Arogyasri | 15 లక్షల మందికి ఆరోగ్య సేవలు | Eeroju news

15 లక్షల మందికి ఆరోగ్య సేవలు

15 లక్షల మందికి ఆరోగ్య సేవలు విజయవాడ, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Arogyasri అమరావతి అభివృద్ధికి సంబంధించి రోజుకో అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే కొత్త రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకల ఈఎస్‌ఐ సెకండరీ కేర్‌ ఆసుపత్రి, 150 పడకల సూపర్‌ స్పెషాలిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా సమ్మతి తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి.. విభజన తర్వాత తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో అమరావతిలో ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. జాతీయ…

Read More

TDP | కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి | Eeroju news

కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి

కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి అనంతపురం, తిరుపతి, నవంబర్ 11, (న్యూస్ పల్స్) TDP రాయలసీమ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా రెపరెపలాడ్సిందేనంటూ తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. ముందుగా బావబామ్మర్దులు తమ నియోజకవర్గాల్లో అంతా సెట్‌ చేసి పెట్టారు. ఏ టైమ్‌లోనైనా పీఠం తమ వశం చేసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు సెగ్మెంట్‌లోని కుప్పం మున్సిపాలిటీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. ఛైర్మన్‌ పీఠం కోసం టీడీపీ..తమ సీటును నిలబెట్టుకునేందుకు వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. 19 చోట్ల వైసీపీ, ఆరుచోట్ల టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ మారిపోయాయి. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అందులో నుంచి మరో కౌన్సిలర్‌ తిరిగి వైసీపీకి లోకి వెళ్లారు.…

Read More

Nagarjuna Sagar | ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ | Eeroju news

ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ

ఏడాది తర్వాత మళ్లీ సాగర్ పై ఘర్షణ గుంటూరు, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Nagarjuna Sagar ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నాగార్జున సాగర్ వివాదం నెలకొంది. తెలంగాణ అధికారులు కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు ప్రయత్నించగా, ఏపీ అధికారుల వారిని అడ్డుకున్నారు. దీంతో మరోసారి సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. గతేడాది సరిగ్గా నవంబర్ లోనే సాగర్ పై ఘర్షణ తలెత్తింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరోసారి ‘నాగార్జున సాగర్ వివాదం’ రాజుకుంది. గత ఏడాది సరిగ్గా నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మళ్లీ నవంబర్ లోనే సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కుడి కాల్వ వాటర్‌ రీడింగ్‌ నమోదు వివాదానికి దారితీసింది. వాటర్ రీడింగ్…

Read More