Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గుంటూరు కారం మూవీ రివ్యూ

0

హైదరాబాద్, జనవరి 12, (న్యూస్ పల్స్)
సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్ రెండు సినిమాలు తీశారు. ‘అతడు’, ‘ఖలేజా’ బాక్సాఫీస్ రిజల్ట్స్ పక్కన పెడితే… ‘అతడు’ క్లాసిక్స్ అనిపించుకుంది. ‘ఖలేజా’లో మహేష్ కామెడీ టైమింగ్ సూపర్. పన్నెండేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తుండటంతో ‘గుంటూరు కారం’ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ‘కుర్చీ మడత పెట్టి…’ సాంగ్ సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని తీసుకొచ్చింది. మహేష్ బాబు మాస్ అవతార్, డ్యాన్సుల్లో ఎనర్జీ చూసి జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. మరి, సినిమా ఎలా ఉందో చూద్దాం.జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ (ప్రకాష్ రాజ్) కుమార్తె వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతుంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటా మధు (రవిశంకర్) తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరతాడు. అయితే… తన కుమార్తెను మంత్రి చేస్తానని పార్టీ అధినేత చెబుతారు. భర్తకు విడాకులు ఇచ్చి వసుంధర రెండో పెళ్లి చేసుకోవడం, మొదటి భర్త ద్వారా కలిగిన సంతానాన్ని వదిలేసి వచ్చిన విషయాలు బయట పెడతానని కాటా మధు బెదిరించే ప్రయత్నం చేస్తాడు. దాంతో రమణ (మహేష్ బాబు)ను పిలిచి తల్లితో తనకు ఎటువంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం చేయమని తాతయ్య కోరతాడు.

హనుమాన్ మూవీ రివ్యూ

రమణ గుంటూరు కారం లాంటోడు. ఎవ్వరికీ భయపడడు. తండ్రి రాయల్ సత్యం (జయరామ్) సాఫ్ట్ అయితే… కొడుకు పక్కా మాస్. పాతికేళ్ల తర్వాత తల్లి నుంచి పిలుపు రావడంతో ఎంతో ఆశగా హైదరాబాద్ వచ్చిన రమణ… బాండ్ పేపర్స్ మీద సంతకం చేయడానికి నిరాకరిస్తాడు. అసలు రాయల్ సత్యానికి వసుంధర ఎందుకు విడాకులు ఇచ్చింది? పాతికేళ్లు కొడుకును కనీసం ఎందుకు చూడలేదు? చివరకు ఏమైంది? మధ్యలో అమ్ము (శ్రీ లీల)తో రమణ కథేంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.’గుంటూరు కారం’ ప్రచార చిత్రాలు, ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ చూసిన తర్వాత మహేష్ బాబు మాస్ అవతార్ కంటే అటువంటి మాసీ క్యారెక్టర్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్… ఎటువంటి సినిమా తీశారోననే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువైంది. థియేటర్లలో కూర్చున్న జనాలకు ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎంతో సేపు పట్టదు. మహేష్ మాస్ తప్ప స్క్రీన్ మీద కొత్త కథ, కథనం, సన్నివేశాలు కనిపించవు.త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర. అతి సాధారణమైన సన్నివేశాన్ని తన మార్క్ సంభాషణలతో అద్భుతంగా మార్చగల నేర్పు మాటల మాంత్రికుడికి మాత్రమే సాధ్యం. అయితే… ‘గుంటూరు కారం’లో అడుగడుగునా త్రివిక్రమ్ మార్క్ కనిపించడం లేదనే వెలితి ప్రేక్షకులకు కలుగుతుంది. త్రివిక్రమ్ రచన, సంభాషణల శైలిని యువ రచయితలు అనుకరిస్తూ ప్రాస కోసం పాకులాడుతున్నారు. అటువంటి త్రివిక్రమ్ నుంచి ‘కుర్చీ మడత పెట్టి…’ సాంగ్ రావడం ఒక షాక్. పోనీ, అది మాస్ అని సరిపెట్టుకుంటే… సాంగ్ చివర ‘కల్ట్ బొమ్మ ఇచ్చాం’ అని ‘వెన్నెల’ కిశోర్ చేత డైలాగ్ చెప్పారు. నక్కిలీసు గొలుసు పాటకు మహేష్, శ్రీ లీల చేత స్టెప్పులు వేయించారు. త్రివిక్రమ్ మాట రాస్తే, పాట తీస్తే వైరల్ అవ్వాలి.

Devara Movie Updates దేవరపై పెరుగుతున్న ఆశలు

అంతే గానీ డిజిటల్ మీడియాలో వైరల్ కంటెంట్ త్రివిక్రమ్ సినిమాల్లో ఉండటం ఏంటి? అని అభిమానులు ఫీలయ్యే సందర్భాలు అవి.’గుంటూరు కారం’ కథ, కథనాల్లో కొత్తదనం లేదనేది పక్కన పెడితే… ఆ కథలో అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాల ఛాయలు కనిపించాయి. కథలో బలం లేకపోవడంతో త్రివిక్రమ్ పెన్ కూడా పెద్దగా కదల్లేదు. సంభాషణల్లో ఆయన శైలి కనిపించలేదు. ‘కుర్చీ మడత పెట్టి…’, ‘నక్కిలీసు గొలుసు’ పాటల్లో మహేష్ బాబు డ్యాన్సులు బాగా చేశారు. తమన్ నుంచి ప్రేక్షకులు ఇంకా మంచి పాటలు ఆశించారు. రీ రికార్డింగ్ కూడా! బహుశా… కథలో విషయం తక్కువ కావడంతో సంగీతం మీద ప్రభావం చూపించినట్టు ఉంది. ఫైట్స్ ఓకే. ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి… మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సూపర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఖర్చుకు వెనగడుగు వేయలేదు.’గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ చెప్పినట్లు… రమణ పాత్రకు మహేష్ వందకు 200 శాతం న్యాయం చేశారు. పాటల్లో డ్యాన్స్ ఇరగదీయడమే కాదు… డైలాగ్ డెలివరీలోనూ కొత్త మహేష్‌ బాబును చూపించారు. అంత మాసీ క్యారెక్టర్‌లోనూ సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. శ్రీ లీల డ్యాన్స్ కుమ్మేశారు. లంగా ఓణీలు, చీరల్లో మరింత అందంగా కనిపించారు. మీనాక్షి చౌదరి పాత్ర పరిధి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు.త్రివిక్రమ్ సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి.

 

రమ్యకృష్ణ నటించడంతో వసుంధర పాత్రకు హుందాతనం వచ్చింది. మొదటి సాదాసీదాగా ఉన్నా… ఆమె నటన ప్రెస్ మీట్, క్లైమాక్స్‌ సీన్లను నిలబెట్టింది. ప్రకాష్ రాజ్ గెటప్ & యాక్టింగ్ రిజిస్టర్ అవుతాయి. ఆయన చక్కగా చేశారు. జయరామ్, రావు రమేష్, ఈశ్వరి రావు, మురళీ శర్మ, రఘుబాబు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు. జగపతి బాబును సరిగా వాడుకోలేదు. సునీల్ ఒక్క సన్నివేశానికి పరిమితం అయ్యారు. వెన్నెల కిశోర్ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తుంది. బాబ్జిగా అజయ్ కనిపించేది రెండు మూడు సీన్లు అయినప్పటికీ… కడుపుబ్బా నవ్విస్తారు. త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్ అజయ్ క్యారెక్టర్‌లో కనిపించింది. అజయ్ ఘోష్ సీన్స్ కూడా!’గుంటూరు కారం’లో మమకారం లేదు… హీరో నటనలో ఘాటు తప్ప! మహేష్ బాబు ఎనర్జీ, ఆ మాస్ క్యారెక్టరైజేషన్ సూపర్! మిర్చిలో ఘాటు డ్యాన్సుల్లో చూపించారు. అయితే, త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది. ఒక్క సీనులోనూ ఎమోషన్ వర్కవుట్ కాలేదు. కామెడీ అనుకున్నంత లేదు. హై ఇచ్చే మూమెంట్స్ అసలే లేవు. మహేష్ బాబు వీరాభిమానులను సైతం డిజప్పాయింట్ చేసే చిత్రమిది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie