కడియం శ్రీహరిలో ఊహించని మార్పు వరంగల్, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Unexpected change in Kadiam Srihari మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలో ఊహించని విధంగా మార్పు వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కడియం శ్రీహరి కనుసైగలు, ఫోన్లతోనే అధికారులతో పనులను చేయించేవారు. కానీ కొద్ది రోజులుగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కడియం శ్రీహరి రాజకీయ జీవితంలో ఆధిపత్యాన్ని కొనసాగించారు తప్ప. ఏ రోజు అధికారుల వద్దకు వెళ్లలేదు. ప్రజా సమస్యలు పరిష్కారం, పనుల కోసం అధికారులకు ఫోన్ చేయడం, లేదంటే ఇంటికి రప్పించుకునేవారు. జిల్లాల్లో కేంద్రంలోనే ఉండి తన మార్క్ చాటుకొనేవారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ఉంటే తప్ప నియోజకవర్గానికి పెద్దగా వెళ్లేవారు…
Read MoreTag: Eeroju news
MLA Madhavaram Krishna Rao’s response to stray dog attack | వీధి కుక్క దాడిపై ఎమ్మెల్యే మాధవరం స్పందన | Eeroju news
వీధి కుక్క దాడిపై ఎమ్మెల్యే మాధవరం స్పందన కూకట్ పల్లి MLA Madhavaram Krishna Rao’s response to stray dog attack బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ట్యూషన్ కి వెళ్తున్న చిన్నారులను వీధి కుక్క దాడి చేసిన ఘటన పైన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. డివిజన్ పరిధిలో గాయపడిన 24 మంది బాధితుల కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. రోజురోజుకు పిల్లల పైన కుక్కల దాడి పెరిగిపోతుందని వీధి కుక్కలను పట్టుకొని వెళ్లేవారు వాటిని ఏం చేస్తున్నారో తెలియడం లేదని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వదిలి వెళ్లడంతో అవి ప్రజల పైన దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ…
Read More7 thousand people retired in one day… | ఒక్క రోజే 7 వేల మంది రిటైర్మెంట్… | Eeroju news
ఒక్క రోజే 7 వేల మంది రిటైర్మెంట్… నెల్లూరు, ఆగస్టు 2(న్యూస్ పల్స్) 7 thousand people retired in one day… జులై 31 ఒక్క రోజులోనే దాదాపు ఏడు వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించడానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం రెండేళ్ల నిర్బంధ సర్వీస్ పొడిగింపు అమలు చేశారు. ఉద్యోగులు స్వచ్ఛంధ పదవీ విరమణ చేసినా రెండేళ్ల తర్వాతే పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తామని నిబంధన విధించారు. జులై 31 కావడంతో ఒకేసారి భారీగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. గత జనవరి నుంచి ఉద్యోగుల పదవీ విరమణ మొదలైనా ఇంత భారీ సంఖ్యలో రిటైర్మెంట్‌లు కావడం ఇదే తొలిసారి. 2022లో తీవ్ర ఆర్థిక…
Read MoreAnother fire test for YCP | వైసీపీకి మరో అగ్ని పరీక్ష | Eeroju news
వైసీపీకి మరో అగ్ని పరీక్ష విశాఖపట్టణం, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Another fire test for YCP అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రెండు నెలల్లోనే వైసీపీ అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతోంది. అదే విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నిక. జనసేనలో చేరడంతో ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ మీద అనర్హతా వేటు వేశారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన జరుగుతుంది. విశాఖ స్థానిక సంస్థల ఓటర్లలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి.…
Read MoreDharmana Brothers | ధర్మాన బ్రదర్స్ రాజకీయ సన్యాసం | Eeroju news
ధర్మాన బ్రదర్స్ రాజకీయ సన్యాసం శ్రీకాకుళం, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Dharmana Brothers శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ధర్మాన సోదరులు పొలిటికల్ రిటైర్మెంట్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరపున పోటీ చేసి ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇద్దరూ మంత్రులుగా చేశారు. మొదట ధర్మాన కృష్ణదాసు.. తర్వాత ధర్మాన ప్రసాదరావు మంత్రులుగా చేశారు. ఇద్దరూ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ కారణంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. వారి వారి నియోజకవర్గాల్లో వైసీపీ కార్యక్రమాలు చేపట్టడం లేదు. జగన్ తో సమావేశాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో కృష్ణదాసు కంటే సీనియర్. ఆయన 1989లో మొదటి సారి నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా నాలుగు సార్లు గెలిచారు. మూడు…
Read MoreFree sand that has become a farce | ప్రహసనంగా మారిన ఉచిత ఇసుక | Eeroju news
ప్రహసనంగా మారిన ఉచిత ఇసుక గుంటూరు, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Free sand that has become a farce ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా ఇసుక విక్రయాల్లో అమలు చేసిన విధానాలతో నిర్మాణ రంగం కుదేలైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విక్రయాలను నిలిపివేసి ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 43 మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో జనాలకు మాత్రం ఏ మాత్రం ప్రయోజనం దక్కడం లేదు. పట్టణాలు, నగరాల్లో ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం రాలేదు. గత మే నుంచి ఒకే రకమైన ధరలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పాలసీలో ఉన్న లోపభూయిష్టమైన విధానాలే దీనికి అసలు కారణంగా కనిపిస్తోంది. కృష్ణానదికి పొరుగున ఉన్న విజయవాడ వంటి…
Read MoreMeeting with Collectors and SPs | కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం | Eeroju news
కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ప్రాధాన్యాలు, లక్ష్యాలు పై యాక్షన్ ప్లాన్ విజయవాడ, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Meeting with Collectors and SPs ఆగస్ట్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశం ఈనెల 5వ తేది ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రెండో రోజు ఆరో తేదీ కలెక్టర్లతోపాటు పోలీస్ సూపరిండెంట్‌లను కలిపి అడ్రస్ చేయనుంది సర్కార్. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలు వివరించే ఈ కీలక సమావేశానికి కలెక్టర్లు, ఎస్పీలతో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కలెక్టర్లతో సమావేశం అవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు లక్ష్యాలను వివరించి వాటిని చేరేందుకు అవసరమైన మెకానిజంపై…
Read MoreTarget Revanth… | టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు | Eeroju news
టార్గెట్ రేవంత్… మారుతున్న సమీకరణాలు హైదరాబాద్, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Target Revanth… తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు చేరికలతో జోష్ మీద ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక కెసిఆర్ పార్టీ నిర్వీర్యమే అన్నంత రేంజ్ లో రాజకీయం నడిచింది. కోలుకోలేని దెబ్బ తగిలిందని..కెసిఆర్ కోలుకోవడం కష్టమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో తిరిగి చేరికలు పెరగడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియక అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని సరికొత్త రాజకీయ క్రీడకు తెర తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులకు గేట్లు…
Read MoreJanasena MLAs are on duty | జనసేన ఎమ్మెల్యేలే ఆన్ డ్యూటీ | Eeroju news
జనసేన ఎమ్మెల్యేలే ఆన్ డ్యూటీ విజయవాడ, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Janasena MLAs are on duty ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన. పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచింది ఆ పార్టీ. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా సరైన విజయం దక్కలేదు. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. రాజకీయ ప్రత్యర్థుల హేళనకు,అవమానాలకు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే గత ఐదేళ్లుగా పార్టీని నిర్మాణాత్మకంగా నడిపి అధికారంలోకి తీసుకు రాగలిగారు పవన్. అయితే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రకటించారు. ఇందుకు ప్రత్యేకమైన…
Read MoreFight in Karnataka Congress… | కర్ణాటక కాంగ్రెస్ లో పోరు… | Eeroju news
కర్ణాటక కాంగ్రెస్ లో పోరు… బెంగళూరు, ఆగస్టు 2, (న్యూస్ పల్స్) Fight in Karnataka Congress… ముడా స్కాం, వాల్మీకీ కార్పొరేషన్ కుంభకోణంతో కర్నాటక కాంగ్రెస్‌లో చిక్కుల్లో పడింది. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ముడా స్కాంపై సీఎం సిద్దరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇవ్వడంపై కర్నాటక కేబినెట్ చర్చించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే భూకేటాయింపులు జరిగాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కర్నాటక కాంగ్రెస్‌లో మళ్లీ కల్లోలం మొదలయ్యింది. కర్నాటక స్కామ్‌లకు కేంద్రబిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై ముడా భూకుంభకోణం ఆరోపణలు రావడంతో పాటు , వాల్మీకి కార్పొరేషన్‌లో వందల కోట్ల స్కాంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే…
Read More