Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆత్మకూరులో వాసవి క్లబ్ సేవలు ప్రారంభం

0

ఆత్మకూరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రైవేటు కల్యాణ మండపంలో వాసవి క్లబ్ ను నూతనంగా ప్రారంభించారు. ఆర్యవైశ్యుల్లో యూనిటీని తీసుకొని రావడం వాసవి క్లబ్ యొక్క ప్రధాన ఉద్దేశం అని వాసవి క్లబ్ చార్టర్  ప్రెసిడెంట్ వీఎన్ నున్నా సంతోష్ కుమార్ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో వాసవి క్లబ్ యూనిటీ ఆత్మకూరు క్లబ్ ను ఆ క్లబ్ యొక్క  ఐ ఈ సి ఆఫీసర్ శబరిష్ గుప్తా, జిల్లా గవర్నర్ పేర్ల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా  వాసవి క్లబ్ అఫీషియల్స్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా ఆత్మకూరు ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. గతంలో నిర్వహించిన  వివిధ సేవా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం వాసవి క్లబ్ యూనిటీ ఆత్మకూరు క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం చేత  క్లబ్ అఫీషియల్స్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

గులాబీ గూటికి జగ్గారెడ్డి..?

ఈ సందర్భంగా ఆత్మకూరు వాసవి క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ వీఎన్ నున్నా సంతోష్ కుమార్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా పేదలకు సేవ చేయడం, ఆర్యవైశ్యుల్లో యూనిటీని పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో  ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజియన్ టు చైర్మన్ సాయిరాం, జోన్ చైర్మన్ సునీత, రీజియన్ సెక్రెటరీ హరిబాబు, ఆత్మకూరు వాసవి క్లబ్ జనరల్ సెక్రెటరీ మిట్టా సుధాకర్, ట్రెజరర్ డాక్టర్ మెంటా వెంకట సందీప్,  వాసవి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie