Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అమిత్ షా అమాయకుడు.. బొత్స కితాబు.

0

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమాయకుడని.. ఆయన ఏదేదో మాట్లాడరని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం కుంభకోణాల మయమని ..  అమిత్ షా విశాఖలో చేసిన విమర్శలపై బొత్స స్పందించారు. అమిత్ షా  అమాయకుడు  ఏదేదో  మాట్లాడతాడు.. బీజేపీ  కి  ఉన్న  ఓట్  బాంక్  ఎంత అని మీడియా  ప్రతినిధుల్ని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్నే అమిత్ షా మాట్లాడుతున్నారన్నారు.  ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఏంటో బీజేపీ నేతలు పరిశీలించుకోవాలన్నారు.

 

ప్రధానితో తమ బంధం ఎలా ఉందో అమిత్‌ షాతోనూ అలానే ఉందన్నారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవన్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని  బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.  కేంద్ర  రాష్ట్ర  సంబంధాలు  చెడిపోయా యని జరుగుతన్న ప్రచారాన్నీ ఖండించారు. అలా ఎవరన్నారని.. ప్రశ్నించారు. అయితే  కేంద్రం పై  ప్రత్యేక  హోదా కు  సంబంధించి  పోరాటం  చేస్తూనే  ఉన్నామని..  పోరాటానికి  ఆకారం  ఉంటుందా అని బొత్స తనదైన శైలిలో సమర్థించుకున్నారు.

 

గతంలో తాము  ప్రతిపక్ష  పార్టీ  గా  ఉన్నప్పుడు  కూడా  హోదా  ఆడిగామన్నారు.  మా  ఎంపీ లు  నిత్యం  పోరాటం  చేస్తున్నారని.. దేశానికి  సంబంధించి న  అంశం  వస్తే  బిల్లుల  విషయంలో   కేంద్రానికి  మద్దతు  ఇస్తున్నామన్నారు.  పవన్  కళ్యాణ్  యాత్ర  అంటే  తనకు అర్థం కావడం లేదని ..  కాశీ  యాత్ర  లాగా  వారాహి  యాత్రనా అని ప్రశ్నించారు.  యాత్ర కు  పర్మిషన్లు  ఇవ్వడం పాలన  లో ఒక  భాగం…సెలెబ్రిటీ  లుూ పెర్మిషన్   తీసుకుంటారని  స్పష్టం చేశారు.  పవన్  యాత్ర పై  ఎలాంటి  ఆంక్షలు  లేవన్నారు.  ప్రజలకు  ఇబ్బంది  లేకుండా యాత్ర లు  చేసుకోవాలని సూచించారు.  వైసీపీ   విముక్త  అంటే  ఏంటి..విద్యా  విధానం..రైతులకు  జరిగే  మేలు..వైద్య  విధాన నిర్ణయాలు  అన్ని  ఆపేస్తారా  అని ప్రశ్నించారు.

బిపర్‌జాయ్ తుఫాన్ ఉగ్రరూపం.

మేము  ఒకటి  ఇస్తే  పవన్  పార్టనర్  రెండు  ఇస్తా  అంటున్నాడు..అంతిమంగా  ప్రజలు  కోరుకునేది  జరుగుతుందని జోస్యం చెప్పారు. ఏపీకి అందరితో పాటు రెండు వందే భారత్ రైళ్లు ఇవ్వటం తప్ప బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇంకా బొత్స మాట్లాడుతూ.. ‘‘9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులు ఇచ్చి ఏదో ఉద్ధరించామంటే ఎలా ? వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలి. గతంలో బీజేపీ నుంచి మాకున్న బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటి? ఇప్పుడు లేనిది ఏంటి? బీజేపీ నుంచి మాకు ఎలాంటి వెన్ను దన్ను ప్రత్యేకంగా లేదు. 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి.. మా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతున్నారు కాబట్టి మా వ్యూహాలు మాకు వున్నాయి’’ అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie